E-Paper
Advertisement

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!
Advertisement

Red Magic Astra 2: మొబైల్ గేమర్స్‌ కోసం ప్రముఖ బ్రాండ్ రెడ్‌మేజిక్ సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ ‘రెడ్‌మేజిక్ అస్త్రా 2 గేమింగ్ టాబ్లెట్’ను గ్లోబల్ మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. చైనాలో గత నెలలోనే లాంచ్ అయిన ఈ టాబ్లెట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. కాంపాక్ట్ డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, సరికొత్త కూలింగ్ టెక్నాలజీతో వచ్చిన ఈ టాబ్లెట్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

శక్తివంతమైన ప్రాసెసర్:

గేమింగ్‌లో విజువల్స్ చాలా కీలకం. అందుకే ఈ టాబ్లెట్‌లో 9.06 అంగుళాల 2.4K OLED స్క్రీన్‌ను అందించారు. ఇది గేమింగ్ ఆడేటప్పుడు అద్భుతమైన కలర్స్, క్లారిటీని ఇస్తుంది. దీని వేగవంతమైన టచ్ రెస్పాన్స్ వల్ల గేమ్స్ చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. దీనిలో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు కంపెనీ సొంతంగా డెవలప్ చేసిన రెడ్‌కోర్ ఆర్4 గేమింగ్ చిప్ కూడా ఉంది. ఇది గ్రాఫిక్స్ క్వాలిటీని పెంచడమే కాకుండా, బ్యాటరీపై భారం పడకుండా చూసుకుంటుంది.

Advertisement

Also Read: కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ:

ఎక్కువ సేపు గేమ్స్ ఆడితే డివైజ్‌లు వేడెక్కడం సర్వసాధారణం. కానీ ఈ టాబ్లెట్‌లో ఆ సమస్య రాకుండా ఉండటానికి కంపెనీ ప్రపంచంలోనే మొదటిసారిగా ‘ఆక్వాకోర్ కూలింగ్ సిస్టమ్ 2.0’ అనే ప్రవహించే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని వాడింది. దీని లోపల ఉండే ప్రత్యేకమైన లిక్విడ్, లిక్విడ్ మెటల్ వంటి లేయర్లు టాబ్లెట్ లోపల పుట్టే వేడిని చాలా వేగంగా బయటకు పంపేస్తాయి. తద్వారా గంటల తరబడి గేమ్స్ ఆడినా ఈ ట్యాబ్ అస్సలు వేడెక్కదట.

డ్యూయల్ టైప్-సి పోర్ట్స్:

Advertisement

ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం లేకుండా ఇందులో 8300mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 75W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కేవలం 60 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇందులో ఉన్న మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే.. దీనికి రెండు టైప్-సి పోర్ట్స్ ఇచ్చారు. ఒక పోర్ట్ ద్వారా చార్జింగ్ పెట్టుకుంటూనే, మరొక పోర్ట్ ద్వారా ఇయర్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకుని ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా గేమ్స్ ఆడుకోవచ్చు.

ధర ఎంతంటే?

ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రెడ్‌మేజిక్ ఓఎస్ 11.5పై పనిచేస్తుంది. దీనిలో 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ధరల విషయానికొస్తే.. 12GB+256GB బేస్ వేరియంట్ ధర సుమారు రూ.72,085 కాగా.. 16GB+512GB టాప్ వేరియంట్ ధర రూ.81,710గా ఉంది. ఈ టాబ్లెట్ ఆగస్టు 10 నుండి ముందస్తు బుకింగ్స్ ప్రారంభం కానుండగా.. ఆగస్టు 26 నుండి అందరికీ అందుబాటులోకి రానుంది. ప్రారంభంలో కొనేవారికి ఉచితంగా 80W ఫాస్ట్ ఛార్జర్, కీచైన్ లభిస్తాయి.

Also Read: రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×