E-Paper
Advertisement

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?
Advertisement

Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ తమ లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘హాట్ 70 ప్రో’ను గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. గతంలో వచ్చిన హాట్ 60 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ఇది వచ్చింది. కొత్త డిజైన్, సరికొత్త ప్రాసెసర్, భారీ బ్యాటరీ లాంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు కొన్ని నిరాశపరిచే మార్పులు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ దీని వెనుక భాగంలో ఉంది. బ్యాక్ సైడ్ ఉండే మూడో కెమెరా లెన్స్ లోపల Active Matrix Cube LED అనే సెకండరీ డిస్‌ప్లేను ఇన్ఫినిక్స్ అమర్చింది. ఇది ఫోన్‌కు చాలా యూనిక్ లుక్‌ను ఇస్తుంది. ఇక ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.76 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అయితే, గత మోడల్‌లో ఉన్న అమోలెడ్ స్క్రీన్‌ను తీసేసి, దీనిలో ఎల్‌సీడీ ప్యానెల్ ఇవ్వడం కాస్త నిరాశపరిచే విషయమే.

Advertisement

Also Read: గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

ఫొటోగ్రఫీ కోసం ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రధాన కెమెరా 50M సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. మరో కెమెరా వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 8MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. గత మోడల్‌లో 13MP కెమెరా ఉండగా.. ఇందులో దాన్ని తగ్గించారు. ఇక పనితీరు విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ పెట్టుకునే సదుపాయం లేదు.

Advertisement

ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే.. దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6000mAh భారీ బ్యాటరీని అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా చూసుకుంటే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు ఏకంగా 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ (ఆండ్రాయిడ్ 19 వరకు), అలాగే 2031 వరకు 5 ఏళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ఇన్ఫినిక్స్ ప్రకటించింది. బడ్జెట్ ఫోన్లలో ఈ స్థాయి సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇవ్వడం విశేషం.

ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 6 ఫ్యాన్సీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నైట్ పల్స్, డ్రైవ్ బ్లూ, డెప్త్ రింగ్ వైట్, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థర్మో ఆరెంజ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ధర ఎంత? భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? అనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Also Read: గెలాక్సీ వాచ్ వాడుతున్నారా? స్క్రీన్‌పై గ్రీన్ లైన్ వస్తే వెంటనే ఇలా చేయండి!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×