E-Paper
Advertisement

Redmi 14R Launched: వారెవ్వా.. సామాన్యుల కోసం కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్, బోలెడన్ని ఫీచర్లు!

Redmi 14R Launched: వారెవ్వా.. సామాన్యుల కోసం కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్, బోలెడన్ని ఫీచర్లు!

Redmi 14R Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. తరచూ కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఇందులో భాగంగానే ఇతర ప్రముఖ కంపెనీ ఫోన్లకు సైతం గట్టి పోటీనిస్తుంది. తాజాగా కంపెనీ మరోక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Redmi 14R పేరుతో ఓ ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 8GB వరకు RAM, 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందించింది. దీంతో పాటు అద్భుతమైన పనితీరు కోసం ఈ ఫోన్‌లో Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ అందించబడింది. అలా ఫోన్ ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఈ బడ్జెట్‌ఫోన్‌లో అందించారు. ఇప్పుడు దానికి సంబంధించిన ధర, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు సహా ఇతర విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Redmi 14R Specifications

Redmi 14R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇధి 6.68-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. 600నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలగి ఉంది. డ్యూయల్ సిమ్ (నానో)తో వచ్చింది. Redmi 14R Android 14-ఆధారిత HyperOS పై నడుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. గరిష్టంగా 8GB RAMను కలిగి ఉంది. అదే సమయంలో Redmi 14R 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది.

కంపెనీ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్‌లో సెకండరీ సెన్సార్‌తో పాటు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌లో ఉన్న 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. Redmi 14R ఫోన్ 18W ఛార్జింగ్‌కు మద్దతుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇందులో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించారు. అలాగే ఫోన్ సేఫ్టీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

Also Read: ఇచ్చిపడేసిన రియల్‌మి.. కొత్త ఫోన్ లాంచ్, మొదటి సేల్‌లో ఊహించని డిస్కౌంట్!

Redmi 14R Price

Redmi 14R స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 4GB RAM + 128GB స్టోరేజ్ ధర CNY 1,099 (సుమారు రూ.13,000) నుండి ప్రారంభమవుతుంది. అలాగే 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,499 (సుమారు Rs.17,700)గా ఉంది. అదే సమయంలో మూడో వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర CNY 1,699 (సుమారు Rs. 20,100)గా ఉంది.

ఇక దీని టాప్ రేంజ్ 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ CNY 1,899 (సుమారు Rs. 22,500)గా కంపెనీ నిర్ణయించింది. ఈ Redmi 14R స్మార్ట్‌ఫోన్‌ డీప్ ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ కలర్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అవుతుందా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Related News

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

Big Stories

×