EPAPER

Balakrishna vs YS Jagan: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

Balakrishna vs YS Jagan: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ

What is the future of YSRCP in Hindupuram: ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సెగ్మెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలాంటి చోట జగన్ గత ఎన్నికల్లో కొత్త ముఖాలతో ప్రయోగాలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారిని పక్కనపెట్టి ఇంపోర్టెడ్ నేతలను పోటీ చేయించి చేతులు కాల్చుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ కొత్త నేతలు పత్తా లేకుండా పోయారు. దాంతో అనాథలా మారిన పార్టీకి ఇప్పుడు తిరిగి మళ్ళీ పాత నాయకులు ఆ పార్టీకి దిక్కు అవుతున్నారు. ఇంతకీ ఆ పరిస్థితి ఎక్కడో మీరే చూడండి.


హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు జిల్లాలోని కీలక నియోజకవర్గాలు అన్నీ దాని పరిధిలోకే వస్తాయి. రాప్తాడు, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం లాంటి కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఆ నియోజకవర్గాలన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అత్యంత పట్టుకున్న ప్రాంతాలు. హిందూపురం నుంచి టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పోటీ చేసి గెలవడంతో ఆ సెగ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ అయింది.

హిందూపురంలో ఇప్పటి వరకు టీడీపీ ఓడిపోలేదు. నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన మెజార్టీని రెట్టింపు చేసుకుంటూ గత ఎన్నికల్లో అక్కడ హ్యాట్రిక్ విజయం సాధించారు. హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం హిందూపురం ఎంపీ స్థానంపై కూడా అనేక సార్లు పడింది. అలాంటి హిందూపురంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించింది. హిందూపురం నుంచి బీసీ కార్డును ప్రయోగించి వివాదాస్పద పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ ను బరిలోకి దింపి విజయం కైవసం చేసుకుంది. కురుబలు అత్యధికంగా ఉన్న హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ ను బరిలోకి దింపడంతో వైసీపీ విజయం సాధించగలిగింది.


2024 ఎన్నికలకి వచ్చే సరికి సీన్ మొత్తం మారిపోయింది. ఎంపీగా గెలిచిన తర్వాత గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం సంచలనంగా మారడంతో వైసీపీ అతనికి టికెట్ నిరాకరించి వేరే అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకులే లేనట్లు.. ఎక్కడో బళ్లారి నుంచి శాంత అనే మహిళను తీసుకొచ్చి హిందూపురం బరిలో దింపింది. శాంతి కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, మైనింగ్ కింగ్ గాలి జననార్ధనరెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరే.. ఆమె గతంలో బళ్లారి నుంచి బీజేపీ ఎంపీగా కూడా గెలిచారు.

గత ఎన్నికల్లో బీసీ మంత్రం పఠించిన జగన్.. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన శాంతను ఉదయం పార్టీలో చేర్చుకుని సాయంత్రానికి టికెట్ డిక్లేర్ చేసి హిందూపురం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చారు. ఎప్పుడో 2009లో ఒక సారి ఎంపీగా గెలిచి తర్వాత రాజకీయాలకు దూరమై ఇంటికి పరిమితమైన శాంతను తీసుకొచ్చి తమపై రుద్దడాన్ని హిందూపురం వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకే తెలియని ముఖాన్ని ప్రజలకు ఎలా పరిచయం చేస్తామని అప్పట్లో తెగ ఫీలై పోయారు. అయితే జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం లేక అంతా గమ్మున ఉండిపోయారట.

Also Read: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

శాంత అభ్యర్థిత్వాన్ని మార్పించాలని కొందరు తాడేపల్లి ప్యాలేస్‌కు కూడా వెళ్లొచ్చారంట. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆమెతోన ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె ఎవరు అని ప్రజలు అడుగుతుంటే పరిచయం చేయడానికి నానా పాట్లు పడ్డారు.. జిల్లాలో అంత మంది వాల్మీకి వర్గం నేతలు ఉండగా ఎక్కడో బళ్లారి నుంచి తీసుకుని వచ్చి శాంతను పోటీ చేయించడంతో ఆమెను పరిచయం చేయడానికే సగం రోజులు సరిపోయాయని హిందూపురం వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

టీడీపీ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టడంతో అప్పుడే సగం ఓటమి ఖరారు అయిపోయిందని పలువురు నేతలు ప్రచారానికి దూరమయ్యారంట. టీడీపీ తరఫున కురుబ సామజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు బీకే పార్థసారథి పోటీలో నిలవడంతో ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ స్థానాలపై కూడా పడింది. హిందూపురం ఎంపీ స్థానంతో పాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇంకేముంది భారీ తేడాతో ఓటమి పాలైన బళ్లారి శాంత.. తిరిగి బళ్లారి వెళ్లిపోయారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు హిందూపురం పార్లమెంటు సెగ్మెంట్‌లో వైసీపీకి నాయకుడే లేకుండా పోయాడు. ఓటమి తర్వాత శాంత బళ్లారికే పరిమితమై కనీసం తమవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానిక వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఎన్నికల ముగిసిన తర్వాత కనీసం చుట్టపు చూపుగా ఒక్కసారి కూడా ఆమె హిందూపురంలో కనిపించకపోవడంతో ఆమె వైసీపీలో ఉన్నారా లేదా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.

బళ్లారి మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి రికమండేషన్‌తో శాంతకు టికెట్ దక్కిందనేది బహిరంగ రహస్యమే.. కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి కావడంతో ఆర్థికంగా కూడా లోటు ఉండదని అప్పట్లో జిల్లా వైసీపీ నేతలు అంతా సంబరపడ్డారు. ఇప్పుడు చూస్తే అండగా నిలిచే నాయకుడు కూడా కరువయ్యాడని వాపోతున్నారు. అటు హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో టికెట్ దక్కించుకున్న దీపిక కూడా అడ్రస్ లేకుండా పోయారంట.

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన దీపికారెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్నారు. హిందూపురంలో బాలకృష్ణను ఓటిస్తామని ప్రకటించిన పెద్దిరెడ్డి.. అక్కడ తానే అభ్యర్ధిని అయినట్లు ఆమె కోసం ప్రచారం చేసి విపరీతంగా ఖర్చుకూడా పెట్టారు. తీరా చూస్తే బాలయ్య గతం కంటే రెట్టింపు మెజార్టీతో గెలిచారు. అంతే దీపిక మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. మొత్తమ్మీద హిందూపురంలో వైసీపీ శ్రేణులకు పెద్దదిక్కు కరువైందిప్పుడు.

Related News

Heavy Rains To AP: వానొచ్చేనంటే.. వరదొస్తది, ఏపీకి భారీ వర్ష సూచన.. కేబినెట్ భేటీ రద్దు?

AP Liquor Policy: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

IAS PETITIONS IN CAT : క్యాట్​కు వెళ్లిన ఐఏఎస్​లు… ఏపీలోనే ఉంటానంటున్న సృజన, తెలంగాణ కావాలంటున్న ఆమ్రపాలి

Big Stories

×