EPAPER

Pawan kalyan: పవన్ రాజకీయాలకు విరామం.. 21 రోజులు షూటింగ్ లోనే

Pawan kalyan: పవన్ రాజకీయాలకు విరామం.. 21 రోజులు షూటింగ్ లోనే

Pawan kalyan soon complete his pending movies shootings: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదరుచూసే క్షణాలు మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. భీమ్లా నాయక్ తర్వాత మరే ఇతర సినిమాలూ చేయలేదు పవన్ కళ్యాణ్. 2022 తర్వాత రెండేళ్లు విరామం ఇచ్చారు. ఈ రెండేళ్లలో జనసేనను బలోపేతం చేసే పనిలో బిజీగా మారారు. గత ఎన్నికలలో అటు చంద్రబాబును, ఇటు మోదీని కలిపి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ మొదటినుంచి రాజకీయ పదవులు ఆశించలేదు. అందుకే రాజకీయాలకు వచ్చి పదేళ్లవుతున్నా తనకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉన్నా కేంద్ర పదవుల జోలికి పవన్ ఏనాడూ వెళ్లలేదు. అలాగే చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా ఏనాడూ పదవులు ఆశించకుండానే పనిచేశారు.


ఆడంబరాలకు దూరం

రీసెంట్ ఎన్నికలలో తన పార్టీ తరపున అత్యధిక స్థానాలలో పోటీ చేసి గెలుపొందారు. దీనితో డిప్యూటీ సీఎంగా చంద్రబాబు పవన్ కి కీలక పదవిని అప్పగించారు. మొదటినుంచి పవన్ కళ్యాణ్ తనకు ఏ పని అప్పగించినా సిన్సియర్ గా చేయడం అలవాటు. తానే కాదు తన జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు. తక్కువ మాట్లాడటం.. ఎక్కువ పనిచేయడం పవన్ కున్న హాబీ అనాలి. ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండబట్టే ప్రజలలో అభిమాన నాయకుడు అయ్యారు. అటు సినిమాలలో క్రేజీ హీరోగా మంచి కమర్షియల్ విజయాలను అందుకుంటూనే హఠాత్తుగా జనసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. జనసేనకు ఎలాంటి సాయం లేకుండానే తన సంపాదనతోనే నెట్టుకొచ్చారు. ఎవరికి సాయం అందించాలన్నా సినిమాలలో తన సంసాదించుకున్న దానినే వారికి ఇచ్చి సాయపడేవారు. ఎందరో పేద విద్యార్థులకు సాయం అందించిన పవన్ కళ్యాణ్ ప్రజా ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ వైఖరిని బాహాటంగా ఎండగట్టారు.


Also Read: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పవన్ కు సంబంధించిన ప్రశ్న.. అదిరా పవర్ స్టార్ రేంజ్

బాబుకు అండగా..

చంద్రబాబును అన్యాయంగా జైలులో పెట్టిన సందర్భంలో రోడ్డుపై బాహాటంగా ధర్నాచేసి స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుకు అండగా ఉంటూ ఏపీలో తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. అయితే పవన్ సై అంటే బ్లాంక్ చెక్ తో క్యూ కట్టే నిర్మాతలు చాలా మందే ఉన్నారు. కోట్లు కుమ్మరిస్తామంటూ ముందుకు వచ్చారు. అయినా తనకు ప్రజా సేవే ముఖ్యం అంటూ పవన్ సినిమాల కన్నా ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయిస్తూ వచ్చారు.

 నిరవధికంగా షూటింగ్

పవన్ ఏ పని చెప్పినా సిద్ధంగా ఉంటారు జనసేన కార్యకర్తలు. పవన్ మాటే వారికి శాసనం. అయితే భీమ్లా నాయక్ సమయంలో పవన్ కళ్యాణ్ ఓ మూడు సినిమాలకు కమిట్ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీని రెండు భాగాలుగా తీయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే పవన్ నిర్ణయంతో వీరమల్లు మొదటి పార్ట్ పెండింగ్ వర్క్ ఉండిపోయింది. అలాగే సుజిత్ దర్శకత్వంలో ఓజీ కూడా షూటింగ్ నిరవధికంగా ఆగిపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది కానీ ఆగిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు వారాల సమయం ఇచ్చి ఈ మూడు సినిమాలు పూర్తి చేసేసి ఇక సినిమాలకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఈ నెల 23 నుంచి హైదరాబాద్ లో నిరవధికంగా మూడు వారాల పాటు షూటింగ్ లో పాల్గొనేలా తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మళ్లీ వెండితెరపై తమ అభిమాన హీరోని చూసుకోబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో.

Related News

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Vettaiyan Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేట్టయాన్ కలెక్షన్స్… ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Big Stories

×