Realme P2 Pro 5G Offers: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ రియల్‌మి ఇటీవల భారతీయ మార్కెట్‌లో Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు Realme మరో కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌కు GT మోడ్ గేమింగ్ అనుభవం, IP65 రేటింగ్, 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందించింది. దీని ద్వారా మరింత మందిని ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు దీని వేరియంట్లు, ధర, స్పెసిఫికేషన్లు, సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ రూ.21,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
Realme P2 Pro 5G Specifications
Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల FHD + కర్వ్డ్ Samsung OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ అందించబడింది. అలాగే 2412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, ప్రో-XDR, AI ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి. ఇది కాకుండా 120 nits బ్రైట్‌నెస్ మోడ్‌ను పొందుతారు. ఇక Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 7S Gen 2 చిప్‌సెట్ అందించబడింది. అదే సమయంలో గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందించింది. అందులో 8GB+128GB, 12GB+256GB, 12GB+512GB వంటి వేరియంట్లు ఉన్నాయి.
ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. Realme P2 Proలో 50MP LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కి శక్తిని అందించడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 5200mAh బ్యాటరీని అందించారు. వీటిలో కనెక్టివిటీ ఆప్షన్‌ల విషయానికొస్తే.. ఛార్జింగ్ కోసం 5G, 4G LTE, బ్లూటూత్ 5.2, Wi-Fi 6, GPS, USB టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. అలాగే గేమింగ్ కోసం GT మోడ్ అందించారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఇది IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.
Also Read: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!
Realme P2 Pro 5G Price And Offers
Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. ఇది మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 21,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కంపెనీ దీనిపై రూ.2000 తగ్గింపు అందిస్తుంది. ఈ తగ్గింపుతో దీనిని రూ. 19,999 లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీని మిడ్ రేంజ్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999లతో లాంచ్ అయింది. దీనిని రూ.3000 తగ్గింపుతో రూ 21,999లకే సొంతం చేసుకోవచ్చు.
అదే సమయంలో దీని టాప్ రేంజ్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 27,999 ఉండగా ఇప్పుడు రూ.3000 తగ్గింపుతో రూ. 24,999లకి కొనుక్కోవచ్చు. దీంతో ఒక మంచి ఫోన్‌ను అదిరిపోయే ఫీచర్లతో కొనుక్కోవాలని భావించే వారికి ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ సేల్ విషయానికొస్తే.. ఈ నెల అంటే సెప్టెంబర్ 17, 2024 నుండి ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆఫర్లతో కొనుక్కోవచ్చు. Flipkart, Realme వెబ్‌సైట్, Realme యాప్‌లో ఆసక్తిగల వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.