E-Paper
Advertisement

Redmi Buds 8 Lite: 36 గంటల బ్యాటరీ బ్యాకప్, IP54 రేటింగ్‌తో రెడ్‌మి కొత్త ఇయర్ బడ్స్.. ధర ఎంత?

Redmi Buds 8 Lite: 36 గంటల బ్యాటరీ బ్యాకప్, IP54 రేటింగ్‌తో రెడ్‌మి కొత్త ఇయర్ బడ్స్.. ధర ఎంత?
Advertisement

Redmi Buds 8 Lite| షావోమీ చైనాలో కొత్త రెడ్మీ బడ్స్ 8 లైట్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టాయి. బడ్జెట్ యూజర్లకు ప్రీమియం ఫీచర్లు ఇవ్వాలని లక్ష్యంతో ఈ కొత్త ఇయర్ బడ్స్ తీసుకొచ్చింది. అడ్వాన్స్‌డ్ ఆడియో డ్రైవర్లు, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి. ఆధునిక కనెక్టివిటీ, కస్టమైజేషన్ ఆప్షన్లు కూడా ఇచ్చాయి.

ధర, లభ్యత

రెడ్‌మి బడ్స్ 8 లైట్ ధర చైనాలో 139 యువాన్ (భారత కరెన్సీలో దాదాపు ధర రూ1,900). షావోమీ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో సేల్స్ ప్రారంభమయ్యాయి.

పవర్‌ఫుల్ ఆడియో పర్‌ఫామెన్స్

Advertisement

ఈ ఇయర్‌బడ్స్‌లో 12.4mm టైటానియం డైఫ్రాగమ్ డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. డీప్ బ్యాస్, క్లియర్ సౌండ్ ఇస్తాయి. టైటానియం మెటీరియల్ డ్యూరబిలిటీ, ఆడియో ప్రెసిషన్ మెరుగుపరుస్తుంది. 42dB వైడ్ ఫ్రీక్వెన్సీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ చేస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. మ్యూజిక్ ఆనందించడానికి బయటి శబ్దాలు ఇబ్బంది కలిగించవు. లో-ఫ్రీక్వెన్సీ సౌండ్స్‌ను బాగా తగ్గిస్తాయి. సబ్‌వే, ఎయిర్ కండిషనర్ నాయిస్ తగ్గుతుంది. ట్రావెలింగ్ సమయంలో, ఆఫీస్ ఉపయోగానికి సరిపోతాయి.

క్లియర్ కాలింగ్‌కు AI నాయిస్ రిడక్షన్

రెడ్మీ బడ్స్ 8 లైట్‌లో డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. AI నాయిస్ రిడక్షన్‌తో కాల్స్‌లో వాయిస్ క్లారిటీ మెరుగవుతుంది. 6m/s వరకు గాలి నాయిస్ తగ్గిస్తాయి. బయటి కాల్స్‌లో మంచి పనితీరు ఇస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్ఫెరెన్స్ లేకుండా కాల్స్ అటెండ్ చేయవచ్చు.

కోడెక్ సపోర్ట్, ఆడియో క్వాలిటీ

Advertisement

AAC, SBC కోడెక్స్ సపోర్ట్ చేస్తాయి. మంచి సౌండ్ క్వాలిటీని కాపాడతాయి. తక్కువ బిట్‌రేట్ ఆడియోలో కూడా బాగా పనిచేస్తాయి. వివిధ మ్యూజిక్ జానర్లలో బ్యాలెన్స్‌డ్ సౌండ్ ఇస్తాయి. పర్‌ఫామెన్స్ స్థిరంగా ఉంటుంది.

ఎక్కువ బ్యాటరీ లైఫ్

36 గంటల మొత్తం బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని షావోమీ తెలిపింది. ఛార్జింగ్ కేస్ పవర్ కలిపి ఈ డ్యూరేషన్ వస్తుంది. ఒక్క ఛార్జ్‌తో 8 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుంది. 10 నిమిషాల ఛార్జ్‌తో 2 గంటల ప్లేబ్యాక్ వస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఇస్తుంది.

స్మార్ట్ కనెక్టివిటీ, కంట్రోల్స్

డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ సపోర్ట్ చేస్తాయి. రెండు డివైసెస్‌కు ఒకేసారి కనెక్ట్ అవుతాయి. ఫోన్, ల్యాప్‌టాప్ మధ్య సులభంగా స్విచ్ చేయవచ్చు. కస్టమైజబుల్ జెస్చర్ కంట్రోల్స్ ఉన్నాయి. టచ్ ఫంక్షన్లను మార్చుకోవచ్చు. EQ సెట్టింగ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సౌండ్ ప్రొఫైల్స్ ప్రిఫరెన్స్ ప్రకారం సర్దుబాటు చేయవచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్రెట్ సెట్టింగ్.. ఆన్‌లైన్‌లో ఉన్నా ఆఫ్‌లైన్ చూపించవచ్చు.. ఇలా చేయండి

లైట్‌వెయిట్, డ్యూరబుల్ డిజైన్

ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 4.5 గ్రాములు మాత్రమే. ఎక్కువ సమయం ధరించినా కంఫర్ట్‌గా ఉంటాయి. IP54 రేటింగ్ ఉంది. దుమ్ము, నీటి చినికుల నుంచి రక్షణ ఇస్తాయి. వర్కౌట్స్ (వ్యాయమ సమయంలో), రఫ్ యూసేజ్‌కి బాగుంటాయి.

రెడ్మీ బడ్స్ 8 లైట్ బడ్జెట్ యూజర్లకు గొప్ప వాల్యూ ఇస్తాయి. ANC, ఎక్కువ బ్యాటరీ లైఫ్, స్మార్ట్ ఫీచర్లు కలిపి ఉన్నాయి. టైటానియం డ్రైవర్లు ఆడియో పర్‌ఫామెన్స్‌ని మెరుగుపరుస్తాయి. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ రోజువారీ సౌకర్యం ఇస్తుంది. అఫోర్డబుల్ సెగ్మెంట్‌లో బలంగా పోటీ పడుతున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఇస్తున్నాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×