E-Paper
Advertisement

Pradeep Ranganathan: ఇద్దరు తెలుగు స్టార్ హీరోయిన్లతో థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసిన ప్రదీప్ రంగనాథన్..

Pradeep Ranganathan: ఇద్దరు తెలుగు స్టార్ హీరోయిన్లతో థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసిన ప్రదీప్ రంగనాథన్..
Advertisement

Pradeep Ranganathan: కోలీవుడ్‌లో.. అలానే టాలీవుడ్ లో కూడా.. యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్… 2025లో డ్రాగన్, డ్యూడ్ వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న తర్వాత.. ఆయన పేరు మరింతగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన నటించిన కొత్త సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ‌ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Advertisement

ఇదిలా ఉండగా..ప్రదీప్ రంగనాథన్ తదుపరి సినిమా గురించి ఇండస్ట్రీలో బలమైన టాక్ నడుస్తోంది. ఇది ఓ భారీ బడ్జెట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా..దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే..ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

 

టాలీవుడ్ హీరోయిన్లతో ప్రదీప్ రంగనాథన్..

Advertisement

 

ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చే అంశం ఏంటంటే.. టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అందాల నటీమణులు ఇందులో కీలక పాత్రల్లో నటించబోతున్నారు. వారే శ్రీ లీలా, మీనాక్షి చౌదరి. ఈ ఇద్దరూ గతంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

 

ప్రదీప్ రంగనాథన్ హీరోయిన్లు..

 

మీనాక్షి చౌదరి తమిళంలో తన డెబ్యూ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే శ్రీలీల కూడా కోలీవుడ్‌లో అడుగుపెట్టి యువత దృష్టిని ఆకర్షించింది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినా..తెరపై వారి ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులోనూ, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథలతో ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అలాంటి హీరోతో కలిసి నటించడం వల్ల మీనాక్షి, శ్రీలీలకు కోలీవుడ్‌లో మరింత స్థిరమైన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

 

ఈ సై-ఫై థ్రిల్లర్ సినిమా ప్రదీప్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మలుపుగా మారేలా కనిపిస్తోంది. టాలీవుడ్ అందాల భామల జోడింపు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

 

Also Read: Tamil Directors: పాన్ ఇండియా క్రేజ్ కోసం తమిళ సినిమాను పక్కన పెడుతున్న దర్శకులు..!

Related News

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

కీర్తి సురేష్ పుట్టినరోజు స్పెషల్.. ‘అక్క’ టీజర్ రిలీజ్ !

ఇండస్ట్రీలో విషాదం.. మ్యూజిక్ డైరెక్టర్ ‘దేవా’ కన్నుమూత!

Big Stories

Advertisement
×