Redmi K70 Ultra: చైనీస్ టెక్ బ్రాండ్ Redmi అదిరిపోయే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తన పాపులారిటీని మరింత పెంచుకునేందుకు జూలై 19న చైనీస్ మార్కెట్లో Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫస్ట్ సేల్ జూలై 20న ప్రారంభమైంది. ఈ ఫోన్ కోసం మొదటి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న కస్టమర్లు ఫస్ట్‌సేల్‌లో అత్యధికంగా కొనేసారు. దీంతో Redmi K70 Ultra సేల్స్‌లో అబ్బురపరచింది. అమ్మకాల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది.
Redmi K70 Ultra ఫస్ట్ సేల్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ను Redmi విడుదల చేసింది. దీని ప్రకారం.. సేల్స్ ప్రారంభించిన మూడు గంటల్లోనే Redmi K70 Ultra 2024 మొదటి అమ్మకాల రికార్డును బద్దలు కొట్టింది. దీనిబట్టి చూస్తే K70 Ultraని కస్టమర్‌లు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోని, అన్ని ధరల విభాగాలలో సేల్స్‌లో అగ్ర స్థానాన్ని సాధించింది.
Redmi K70 Ultra Specifications
Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED 8T LTPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 9300+ చిప్, D1 గ్రాఫిక్స్ చిప్ వంటివి ఉన్నాయి. ఇది LPDDR5x RAM + UFS 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇది సేఫ్టీ కోసం ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంది. ఈ మెటల్ ఫ్రేమ్ స్మార్ట్‌ఫోన్‌లో IP68 రేటెడ్ ఛాసిస్ అమర్చబడింది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. K70 అల్ట్రా వెనుక భాగంలో OIS మద్దతుతో Sony IMX906 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Redmi K70 Ultra Price
Redmi K70 Ultra ధర విషయానికొస్తే.. ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో 12GB + 256GB వేరియంట్ ధర 2,599 యువాన్లు (సుమారు రూ. 29,894), అలాగే ఫోన్ 12GB + 512GB వేరియంట్ ధర 2,899 యువాన్ (సుమారు రూ. 33,461), 16GB + 512GB వేరియంట్ ధర 2,899 యువాన్ (సుమారు రూ. 36,807), అలాగే 3,199 యువాన్లు (సుమారు రూ. 41,408)గా నిర్ణయించబడింది. ఇది బ్లాక్, వైట్, పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా Redmi K70 అల్ట్రా ఛాంపియన్ ఎడిషన్.. లంబోర్ఘిని ఇన్‌స్పైర్ డిజైన్‌ను కలిగి ఉంది. దాని 24GB + 1TB వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ. 46,008)గా కంపెనీ పేర్కొంది. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ రానున్న రోజుల్లో చైనాలో అందుబాటులోకి రానుంది.