టీడీపీలో తిరువూరు పంచాయతీ పీక్స్‌కు చేరుకుంది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్న మధ్య అంతర్గత విభేదాలు కాస్తా రచ్చకెక్కాయి. ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి పోస్టులకు చిన్ని కూడా స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చిన పరిస్ధితి. ఇద్దరి మధ్య వివాదం బజారుకు కెక్కడంతో టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారంట. పార్టీ ఆఫీసు వైపు రావద్దని కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారంట.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి.ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం ముదిరి పాకాన పడినట్టైంది. నిన్నమొన్నటివరకూ వీరి మధ్య నడిచిన మాటల యుద్ధం కాస్త ఇప్పుడు ఆర్ధిక లావాదేవీల వరకూ వచ్చేసింది. ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా కొలికపూడి పెట్టిన పోస్టులు ఇప్పుడు టీడీపీలో సంచలనంగా మారాయి. తనకు టికెట్ ఇవ్వడానికి 5కోట్లు ఇవ్వాలని చిన్ని అడిగారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికల సమయంలో తన బ్యాంకు అకౌంట్ నుంచి పలుదఫాలుగా చిన్నికి నగదు బదిలీ చేసినట్లు…తన సేహ్నితుల ద్వారా మూడున్నర కోట్లు ఇచ్చినట్లు బ్యాంక్ లావాదేవీలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వాట్సప్ స్టేటస్, ఫేస్ బుక్ పోస్టుల్లో వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్ధిక లావాదేవీల వివరాలతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేయడంపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. పీఏ ఎవరో…ఎవరు ఎవరికి డబ్బులు ఇచ్చారో ఆధారాలు చూపించాలని ఎంపీ చిన్ని సవాలు విసిరారు.
తిరువూరు నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో ఎన్నో సేవాల కార్యక్రమాలు చేసిన తనకు ఎవరి నుంచి డబ్బులు తీసుకునే అవసరం లేదని చిన్ని చేప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలతో అంటకాగే వ్యక్తిత్వం తనది కాదని…ఎమ్మెల్యేనుద్దేశించి ఎంపీ చిన్ని కామెంట్స్ చేయడం చర్చనీయంశంగా మారింది.
తిరువూరు నియోజకవర్గంలో చిన్ని పర్యటనలో ఉన్న సమయంలోనే కొలికిపూడి బరస్ట్ అవ్వడం..సంచలనంగా మారింది. ఎంపీ పర్యటనలో పాల్గొనకుండానే…ఎంపీపైనే ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏడాది కాలంగా ఇరువురి మధ్య విభేదాలు అంతర్గతంగా నడుస్తున్నాయనేది టీడీపీలో ఉన్న టాక్. తిరువూరు నియోజకవర్గంలోని కొందరూ టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగాయి.
తనపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై ఎమ్మెల్యే కొలికపూడి కూడా చాల సందర్భాల్లో ఎంపీ చిన్ని పేరు చేప్పకుండానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. నియోజకవర్గం నుంచి వచ్చిన కంప్లైట్స్‌పై ఓసారి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరై…..ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చిన పరిస్ధితి. పార్టీ ముఖ్యనేతలు కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారనే చర్చ కూడా ఉంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి.. తనను డమ్మీగా మార్చిన అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకునేందుకు కొలికిపూడి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అధిష్టానం ఎలా రియాక్టు అవుతుందన్న విషయాన్ని వదిలేసి మరీ.. చిన్ని మీద చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎన్నికల సమయంలో తాను కేశినేని చిన్నికి భారీగా డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపణలు చేయటమే కాదు.. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సప్ స్టేటస్ లో పెట్టటంతో ఈ వ్యవహారం టీ కప్పులో తుపానుగా కాకుండా.. సునామీగా మారిందన్న మాట వినిపిస్తోంది.
తాజాగా కొలికపూడి వర్సెస్ చిన్న వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం. గతానికి భిన్నంగా ఈసారి కొలికపూడి విషయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాన్ని తీసుకుంటారని పార్టీ నేతలు ఇంటర్నల్‌గా చర్చించుకుంటున్నారట. కొలికపూడిని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తంగా తిరువూరు నియోజకవర్గంలో టీటీపీ పంచాయతీ చంద్రబాబు ఎలాంటి ఎండ్ కార్డు ఇస్తారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Story by Chadram, Big Tv