BigTV English

Bulk Drug Park: బల్క్ డ్రగ్ పార్క్.. పార్టీల స్టాండ్ ఏంటి?

Bulk Drug Park: బల్క్ డ్రగ్ పార్క్.. పార్టీల స్టాండ్ ఏంటి?
Advertisement

రాజయ్యపేట పరిసరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సహా పరిసర గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఏపీఐఐసీ రాజయ్యపేటలో 453 ఎకరాల భూమిని సమీకరించింది. ఆ భూమిని ప్రస్తుతం నిర్మాణానికి ఇవ్వడంతో వేగంగా పనులు జరుగుతున్నాయి. భూములను తీసుకున్న సమయంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పలేదని, ఇతర పరిశ్రమల ఏర్పాటు మాత్రమే చేస్తామని చెప్పడంతో భూములు ఇచ్చామని, కానీ ఇప్పుడు ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ 38 రోజులుగా రాజయ్యపేట గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు.


వైసీపీ ప్రభుత్వం హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి అంగీకారం

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి అంగీకారం తెలిపారు.. ప్రభుత్వ మారడంతో అధికారంలోకి వచ్చిన కూటమి బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు పనులు కూడా వేగంగా జరిగేలాగా చర్యలు చేపట్టడంతో వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. పరిశ్రమల స్థాపన జరుగుతుండడంతో అసలు విషయం బయటపడింది. ఇప్పటికే హెటిరో డ్రగ్ పరిశ్రమ వల్ల సముద్రంలో కాలుష్యం పెరిగిపోయి, మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోవడంతో పాటు, సముద్ర తీరంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు ఊపిరితిత్తులు క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నామని బల్క్ డ్రగ్ పార్క్ వద్దని ఆందోళన చేయడం మొదలుపెట్టారు. గత 38 రోజులుగా జరుగుతున్న రాజయ్యపేట మత్స్యకారుల ఆందోళన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది.

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అనుమతులు

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు ఫైల్స్ ని క్షణాల్లో క్లియర్ చేస్తుండడంతో వివిధ డ్రగ్ కంపెనీలు కార్యాలయాలతో పాటు పరిశ్రమల ఏర్పాటు కూడా చేసేస్తున్నాయి. పాయికరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన విఫలమైంది. హోం మంత్రి వాహనాన్ని సైతం రాజయ్యపేట మత్స్యకారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా జాతీయ రహదారిని నాలుగు గంటలకు పైగా దిగ్బంధించారు.

జాతీయ రహదారి దిగ్భంధనం

ప్రభుత్వంతోపాటు పోలీసులు కూడా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను సీరియస్ గా తీసుకున్నారు . హోం మంత్రిని మత్స్యకారులు అడ్డుకున్న తర్వాత మళ్లీ మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జాతీయ రహదారిని దిగ్బంధించిన తర్వాత రాజయ్యపేట సహా 8 గ్రామాల్లో వేల మంది పోలీసులను కవాతు చేయిస్తూ మత్స్యకారులు భయం కలిగేలా చేస్తున్నారు అధికారులు.దీంతో మత్స్యకారులు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం అధికార పార్టీ నుండి ప్రతిపక్షాల చేతుల్లోకి రోజురోజుకి వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది.

ఆందోళనకు దిగి బీసీవై పార్టీ అద్యక్షుడు రామచంద్ర యాదవ్

బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు రాజయ్యపేట వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు, పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉద్యమంలోకి వైసీపీ ఎంటర్ అయింది. నర్సీపట్నం మెడికల్ కాలేజీని పరిశీలించడానికి వచ్చిన మాజీ సీఎం జగన్ ను కలిసిన రాజయ్యపేట మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్నామని తమకు మద్దతుగా ఉండాలని కోరడంతో జగన్ సూచనలతో వైసిపి బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపింది.

ఛలో రాజయ్యపేటకు ఎలాంటి పర్మిషన్ లేదంటున్న పోలీసులు

ఈనెల 22వ తేదీన వైసీపీ ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు చలో రాజయ్యపేటకు పిలుపును ఇవ్వడంతో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా వైసిపి చేస్తున్న ఉద్యమం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది… మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సహా ఉత్తరాంధ్రలోని కీలకమైన వైసీపీ నాయకులు ఛలో రాజయ్యపేట వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసులు ఛలో రాజయ్యపేటకు ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్పడంతో వైసిపి నాయకులు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఉత్తరాంధ్రలో డిపాజిట్లు కోల్పోయిన వైసీపీ

ఇప్పటికే ఉత్తరాంధ్రలో దాదాపుగా గత గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన వైసీపీ రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కును భుజాన వేసుకుని మద్దతుగా నిలబడి పోరాటం చేస్తే సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉండే మత్స్యకార వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసిపి చేలో రాజయ్యపేటకు పిలుపునిచ్చినట్లు అర్థమవుతుంది. వైసీపీ వేసిన ప్లాన్ మరికూటమి ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Story By Apparao, Bigtv Live

Related News

Palnadu Politics: పల్నాడు నెత్తుటి కథ.. తప్పెవరిది?

Paritala Sriram vs Kethireddy: లైట్ తీసుకున్నారా ? కేతిరెడ్డిపై పరిటాల ప్లానేంటి?

Louvre Museum: ‘మనీ హీస్ట్’ సీరిస్ స్టైల్‌లో మ్యూజియంలో చోరీ.. జస్ట్ 7 నిమిషాల్లోనే పని కానిచ్చేసిన దొంగలు, ఇదిగో ఇలా!

Jubilee Hills By Election: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్ గట్టెక్కుతుందా?

Google In Vizag: ట్రెండ్ క్రియేట్ చేయబోతున్న వైజాగ్ ఏఐ హబ్‌.. మరి ఉద్యోగాలు?

YS Jagan: నరసాపురంలో పడకేసిన వైసీపీ.. పార్టీ కోసం జగన్ తిప్పలు

KCR: బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. రంగంలోకి కేసీఆర్ ?

Big Stories

×