Amaravati News: సోషల్ మీడియా పుణ్యమాని తప్పుడు వార్తల ప్రచారం జోరందుకుంది. దీనిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా, కొందరు ఏ మాత్రం వినడం లేదు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సమాజానికి హానికరంగా మారిన బ్లూ బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.
‘బ్లూ బ్యాచ్’పై మంత్రి ఆగ్రహం
ఏపీలో అధికారంలోకి వచ్చిన నుంచి కూటమి ప్రభుత్వంపై ఒకటే విమర్శలు. రాతలు, వీడియోలు కట్ పేస్ట్ చేసి నానాహంగామా చేస్తున్నారు కొందరు. అంతేకాదు కులాల మధ్య గొడవలు పెట్టారు.. ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు కూడా. కూటమి సర్కార్ పదేపదే చెబుతున్నా, ఏ మాత్రం వినడం లేదు.
ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఓ పోస్టు పెట్టారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకులో జరిగినట్లు ఒక కథనం రాసింది వైసీపీ అనుబంధ సోషల్ మీడియా. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
రంగంలోకి పోలీసులు
ఈ వార్తపై ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించింది. దీంతో కొద్దిరోజులు సైలెంట్ అయ్యింది. మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టేసింది. ఈ వ్యవహారం నేరుగా మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు.
అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా? అనే అనుమానం వస్తుందన్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అలాంటి ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా @APPOLICE100 వారిని కోరారు. ఆ పోస్టును ఏపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ALSO READ: న్యూఇయర్‌కి ముందే.. కూటమి కొత్త ప్లానేంటి?
ఆ పోస్టు ఎక్కడ నుంచి అప్‌లోడ్ అయ్యింది? అనేదానిపై కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించి రేపో మాపో అరెస్టులు ఖాయమని అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా రాజకీయ పార్టీలు విదేశాల నుంచి పోస్టింగులు పెడుతున్నారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
#PsychoFekuJagan
తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదు. పక్క రాష్ట్రంలో ఒక గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా అరకు లో జరిగినట్లు ఒక కథనం రాసి వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో… pic.twitter.com/6Pb40sxRIk— Lokesh Nara (@naralokesh) October 26, 2025