Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సర్వేలు గులాబీ పార్టీకి గుబులుపుట్టిస్తున్నాయట. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందుంచే.. ప్రధాన పార్టీల కంటే ముందుగానే నియోజకవర్గంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో అనుకూల పవనాలు వీడయంలేదనే చర్చ జోరుగా నడుస్తోందట. డివిజన్ల వారీగా నిర్వహిస్తున్న సర్వేలు గులాబీ నేతలకు టెన్షన్ పెట్టిస్తున్నాయట.
జూబ్లిహిల్స్‌లో గులాబీ పార్టీకి సర్వేల భయం
గులాబీ పార్టీకి సర్వేల భయం పట్టుకుందట. జూబ్లీహిల్స్‌లో ప్రజల నాడి తెలుసుకునేందుకు చేస్తున్న సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీకి గ్రాప్ రోజు రోజుకు తగ్గుతుందనే ప్రచారం జోరుగా నడుస్తోందట. ఆరు ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పుడు బీఆర్ఎస్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సమాచారం. ప్రజల్లో ఇంకా పెంచుకునేందుకు బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై గ్యారెంటీ కార్డులను ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేస్తుంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ గ్రాఫ్‌పై సర్వేల్లో నెగిటివ్‌గా వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. నెల రోజులకు ముందు అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లు పార్టీ నేతలు చేప్పుకున్నారట.అయితే తాజాగా నిర్వహిస్తున్న సర్వేల్లో గ్రాఫ్ పడిపోయినట్లు పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుందట. పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని చెబుతున్నది నేతలే పలు సందర్భాల్లో అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
ఉప ఎన్నికల్లో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్
ఉప ఎన్నికల్లో గెలుపును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచారశైలీపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకోసం వార్ రూంను సైతం ఏర్పాటు చేశారు. ఏ డివిజన్ లో ప్రచారంలో వెనుకబడ్డాం.. ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనేదానిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయిలో నేతలకు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సర్వేల్లో ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెరగకుండా తగ్గుతుండటంపై సమాలోచన చేస్తున్నారట. ఏం చేస్తే బీఆర్ఎస్‌కు ప్రజలు ఆకర్షితులవుతారు.. ఏ హామీలు ఇవ్వాలి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ 20రోజుల్లో జూబ్లీహిల్స్ ఎన్నిక ఉండటంతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారనేది ఆసక్తి నెలకొంది.
సర్వేలు చేయించుకుని నవీన్ యాదవ్‌కి టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థిని ప్రకటించింది. సర్వేలు చేసి మరీ నవీన్ యాదవ్ ను ప్రకటించి ప్రచారంను విస్తృతం చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్లమ్ ఏరియాల్లో ఆదరణ ఉండటం, మైనార్టీ వర్గాలతో పరిచయాలు ఉండటంతో ఆయనకు మంచి స్పందన వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని దెబ్బ తగిలినట్లయిందనే టాక్. సెంటిమెంట్ తో పాటు గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనుల పైనే గులాబీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. ఎంఐఎం సైతం కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుందట. దీనికి తోడు వామపక్షాలు, ఎంఐఎం మద్దతును సైతం కాంగ్రెస్ కూడగడడంతో అదనపు బలం వచ్చినట్లైంది. దీంతో బీఆర్ఎస్ ఒంటరిపోరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలు అస్త్రంగా బీఆర్ఎస్ వెళ్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ సెంటిమెంట్ తో వెళ్లాలనేదానిపై తర్జనభర్జన పడుతుంది.
తెలంగాణ భవన్ వేదికగా సర్వే టీంలతో కేటీఆర్ భేటీలు
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లలో సర్వేలు నిర్వహిస్తుంది. ప్రజల నాడిని తెలుసుకుంటుంది. అందులో భాగంగానే ప్రజలను మోటివేషన్ చేయాలని భావిస్తుందట. తెలంగాణ భవన్ వేదికగా సర్వే టీంలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో పార్టీ పరిస్థితి, ఏం చేస్తే అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చనే అంశాలపై చర్చించిస్తున్నారట. ఈ భేటీలోనే బీఆర్ఎస్ కు గ్రాప్‌కు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువస్తున్నాయట. మరోవైపు నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతలు, సీనియర్ నేతలు సైతం కలిసి పనిచేయడంలో కొంత గ్యాప్ ఉన్నట్లు సమాచారం. నాకేందుకులే.. నాకు పార్టీ ప్రియార్టీ ఇవ్వనప్పుడు ప్రచారం చేసి ఏం లాభం అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని నేతలే అభిప్రాయపడుతున్నారట.
Also Read: బల్క్ డ్రగ్ పార్క్.. పార్టీల స్టాండ్ ఏంటి?
నామినేషన్ల గడవు ముగియగానే ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహారచన చేస్తుంది బీఆర్ఎస్. అప్పటికి గ్రౌండ్‌లో ఉన్న మైనస్‌లను అధిగమించేందుకు కార్యచరణ చేస్తున్నారట గులాబీ నేతలు.
Story By Apparao, Bigtv Live