Firing at Chaderghat: హైదరాబాద్ చాదర్ఘాట్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఎఫ్ఐర్‌లో.. కీలక అంశాలు వెలుగు చూశాయి. ముబైల్ స్నాచింగ్ నిందులను పట్టుకునే ప్రయత్నంలో డీసీపీ చైతన్య ప్రాణాలను సైతం పణంగా పెట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం విక్టోరియా గ్రౌండ్ సమీపంలో జరిగింది.
బషీర్బాగ్‌లో డీసీపీల సమావేశం ముగిసిన అనంతరం.. సైదాబాద్ కార్యాలయానికి బయలుదేరిన డీసీపీ చైతన్య వాహనం.. కోటి ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రోడ్డుపక్కన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను స్నాచింగ్ దృశ్యాన్ని డీసీపీ డ్రైవర్ గమనించాడు. స్నాచింగ్ జరుగుతోంది అని డ్రైవర్ చెప్పగానే.. డీసీపీ ఆ దిశగా వెంబడించమని ఆదేశించారు.
ఆటోలో పరారవుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు వెంటాడారు. కొద్ది దూరం వెళ్లాక నిందితులు ఆటోనుంచి దూకి పారిపోవడం మొదలుపెట్టారు. వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఒమర్ అన్సారీ, మరో వ్యక్తి మహమ్మద్ అమర్ అన్సారీ ఉన్నారని పోలీసులు గుర్తించారు.
డీసీపీ చైతన్య, గన్‌మెన్ మూర్తి కలిసి వారిని వెంబడించారు. ఒమర్‌ను పట్టుకునే ప్రయత్నంలో మూర్తిని తోసేసి నేలకూల్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
మూర్తి పడ్డప్పటికీ, తన వెపన్‌ను వదలకుండా ఒమర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈలోపు ఒమర్ తన వద్ద ఉన్న కత్తితో మూర్తిపై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో డీసీపీ చైతన్య అప్రమత్తమై హెచ్చరిక ఇచ్చారు. కానీ నిందితుడు దాడి ఆపకపోవడంతో చైతన్య కాళ్ల భాగంలో మేజర్ ఇంజరీ కాకుండా కాల్పులు జరిపినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కాల్పుల అనంతరం కూడా ఒమర్ గన్‌మెన్‌పై దాడికి ప్రయత్నించాడని అధికారులు పేర్కొన్నారు. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఒమర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో గన్‌మెన్ మూర్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలంలో సెంట్రల్ జోన్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, ఆధారాలు సేకరించారు.
Also Read: ప్రేమలో ఓడిపోయాను.. యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఒమర్ అన్సారీపై గతంలోనూ స్నాచింగ్, చోరీ కేసులు నమోదైనట్లు తేలింది. అతనితో కలిసి పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. మొబైల్ స్నాచింగ్, ఆయుధాలతో దాడి, పోలీసులపై ప్రాణహానికర యత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
చాదర్‌ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు..
కాల్పుల ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు డీసీపీ చైతన్య ఫిర్యాదు
కోటి వద్ద ఓ వ్యక్తి మొబైల్ స్నాచింగ్ చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితుల యత్నం
ఆటోలో మొత్తం ముగ్గురు ఉన్నారు
ఒమర్ ను పట్టుకునేందుకు మా గన్ మెన్… https://t.co/8G2zKytBKA pic.twitter.com/etm44VL4uc
— BIG TV Breaking News (@bigtvtelugu) October 26, 2025