World Fastest Bullet Train: బుల్లెట్ ట్రైన్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది జపాన్. అక్కడ నిత్యం దానిపై ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. విమానం-రైలు ప్రయాణం జర్నీ ఒకటే చేయాలన్నది వారి ఆలోచన. విమానం కంటే బుల్లెట్ ట్రైన్ ఖర్చు కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే సెపరేట్‌గా ట్రాక్ వేయడం, టెక్నాలజీతో అనుసంధానం చేయడం వంటివి ఉంటాయి. తాజాగా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ ట్రైన్‌ని ఆవిష్కరించింది చైనా.
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ చైనా సొంతం
రైల్వేలో సంచలనాలకు కేంద్రం అయ్యింది చైనా. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ ‘సీఆర్450’ని ఆవిష్కరించింది. ట్రయల్స్‌లో ఈ ట్రైన్ గంటకు 453 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రైలు సర్వీస్ త్వరలో షాంఘై-చెంగ్డూ నగరాల మధ్య అందుబాటులోకి రానుంది.
ఇప్పుడు చైనాలో సీఆర్ 400 ఫక్సింగ్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. లేటెస్టుగా తీసుకొచ్చిన సీఆర్ 450 దానికంటే అత్యాధునికం, వేగవంతమైనది కూడా. మరో విషయం ఏంటంటే పాత మోడల్‌తో పోలిస్తే లేటెస్ట్ ట్రైన్ వెయిట్ 50 టన్నుల వరకు తగ్గించారు రైల్వే నిపుణులు. ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాక ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నారు.
షాంఘై-చెంగ్డూ నగరాల మధ్య
ఇటీవల సీఆర్ 450 సిరీస్ ట్రైన్లు ఎదురెదురుగా ప్రయాణిస్తూ గంటకు 896 కిలోమీటర్ల సంయుక్త వేగాన్ని నమోదు చేసింది. ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేముందు ఈ ట్రైన్ దాదాపు 6 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ప్రయాణించాల్సి ఉంటుంది.
CR450 బుల్లెట్ ట్రైన్ రికార్డు వేగానికి ఏరో డైనమిక్ మెరుగుదల, నిర్మాణాత్మక పురోగతుల కలయిక కారణమని ఇంజనీర్లు చెబుతున్నమాట. రైలు ముక్కు కోన్ మాదిరిగా ఉన్న 350 కి.మీ/గం మోడళ్లలో 12.5 మీటర్ల నుండి 15 మీటర్లకు పొడిగించారు. చైనా రవాణా మౌలిక సదుపాయాలు వేగంతో విస్తరిస్తూనే ఉన్నాయి.
ALSO READ: స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం
ఆ దేశం ఇప్పుడు ప్రపంచంలో హై-స్పీడ్ రైలు, ఎక్స్‌ప్రెస్‌వే వ్యవస్థలను నిర్వహిస్తోంది. 2021లో ప్రారంభించబడింది CR 450. చైనా హై-స్పీడ్ రైలు ఆశయాలలో ఒక ప్రధాన ప్రాజెక్ట్. ఇది సక్సెస్ అయితే ఇలాంటివి మరిన్ని నిర్మించాలని ఆలోచన చేస్తోందట చైనా రైల్వే విభాగం. ఒకప్పుడు బుల్లెట్ ట్రైన్ అంటే జపాన్ పేరు గుర్తుకు వచ్చేది. రాబోయే రోజుల్లో ఆ పేరు చైనా సొంతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
China's CR450 breaks barriers in high-speed rail innovation pic.twitter.com/7H8cnV18Az
— CGTN (@CGTNOfficial) October 22, 2025