BigTV English

PM Modi Ramp Walk: రంగురంగుల దుస్తుల్లో మోదీ ర్యాంప్ వాక్.. ఎక్కడ చేశారో తెలుసా?

PM Modi Ramp Walk: రంగురంగుల దుస్తుల్లో మోదీ ర్యాంప్ వాక్.. ఎక్కడ చేశారో తెలుసా?

Elon Musk Shares AI Ramp Walk Featuring Modi, Joe Biden, Trump, Kamala, Putin: ప్రధాని నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఆయనలా చేస్తారని కనీసం ఊహించనైనా ఊహించారా?, నిజంగా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ ఆయన ధరిస్తారు? ఎలా ట్రెండ్ సెట్ చేయగలుగుతారు? అనేవి ప్రశ్నలే. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి. కానీ ఊహలకు ఓ రూపాన్ని ఇచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్.


నరేంద్ర మోదీ ర్యాంప్ వాక్ చేయడాన్ని ఏఐ ద్వారా క్రియేట్ చేశారు. నుదుట తిలకం పెట్టుకుని, రంగురంగుల దుస్తులను ధరించిన మోదీ అలా దర్జాగా ర్యాంప్ వాక్ చేస్తోన్న సీన్ కళ్లకు కట్టినట్టు చూపించింది. ఒక్క మోదీ మాత్రమే కాదు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చైనా అధినేత జిన్ పింగ్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జొంగ్ ఉన్, కెనాడా, రష్యా ప్రధానమంత్రులు జస్టిన్ ట్రుడో, వ్లాదిమిర్ పుతిన్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే.. కలర్ కలర్ డ్రెస్ లు చేంజ్ చేస్తూ కనిపించారు. పోప్ ఫ్రాన్సిస్ సైతం ఇందులో ఉన్నారు.

Also Read: ‘వైద్య పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచండి’.. కేంద్రాన్ని కోరిన దేశీయ కంపెనీలు


నిజానికి వీళ్లందరూ ఒకేసారి కనిపించడమే చాలా అరుదు. అలాంటిది.. ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించడం మాత్రం.. కలలో కూడా జరిగే పని కాదు. కానీ.. దానిని ఏఐచాలా సింపుల్ గా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఈ వీడియోను పోస్ట్ చేసింది మరెవరో కాదు.. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. తన ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాను ముంచెత్తాయి.

Related News

Onam Tragedy: హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా ఆగిన గుండె.. కళ్ళముందే కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి!

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Big Stories

×