BigTV English
Advertisement

Oppo Camera Phone: ఓప్పో సూపర్ కెమెరా ఫోన్‌పై రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే?

Oppo Camera Phone: ఓప్పో సూపర్ కెమెరా ఫోన్‌పై రూ.13,000 ఫ్లాట్ డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే?

Oppo Camera Phone Discount| ఓప్పో బ్రాండ్‌లో టాప్ కెమెరా ఫోన్ ఫైండ్ X8 ప్రో ధర ఇప్పుడు తగ్గింది. అయితే ఈ డిస్కౌంట్ ధర కేవలం క్రోమా లోనే అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం ఫోన్ రూ.13,000 తగ్గింపు ధరతో లభిస్తోంది. హై-ఎండ్ టెక్నాలజీని సరసమైన ధరకు పొందవచ్చు. స్టాక్ అయిపోకముందే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోండి.


ప్రస్తుత ధరలు

ఓప్పో ఫైండ్ X8 ప్రో అసలు ధర రూ.99,999. కానీ ఇప్పుడు క్రోమాలో రూ.86,999కే కొనుగోలు చేయవచ్చు. అంటే నేరుగా రూ.13,000 డిస్కౌంట్. EMI ఆప్షన్‌లతో పేమెంట్ మరింత సులభతరం అవుతుంది. ఈ ధర కేవలం 16GB RAM/512GB వేరియంట్‌కు మాత్రమే.

డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లు

6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. డాల్బీ విజన్ వీడియోలకు సపోర్ట్ చేస్తుంది. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 4,500 నిట్స్. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.


పనితీరు, బ్యాటరీ

మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉంది. భారీ టాస్క్‌లను సులభంగా నిర్వహిస్తుంది. 5,910mAh బ్యాటరీ రోజంతా నిలబడుతుంది. 80W వైర్డ్ చార్జింగ్. 50W వైర్‌లెస్ చార్జింగ్ కూడా ఉంది.

కెమెరా క్వాలిటీ

ఫోన్ వెనుకభాగంలో ఉన్న నాలుగు కెమెరాలు అందమైన ఫోటోలు తీస్తాయి. ఇందులో సోనీ LYT808 టెక్నాలజీ కలిగిన మెయిన్ సెన్సార్ ఉంది. అలాగే పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్. మరొక లెన్స్ 6x ఆప్టికల్ జూమ్ తో వస్తుది. అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది.

మెయిన్ కెమెరా

50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ మెయిన్ కెమెరా. లో-లైట్‌లో అద్భుతమైన వీడియో, ఫొటోలు తీయగలదు. స్టెబిలైజేషన్ బ్లర్‌ను తగ్గిస్తుంది. ప్రొఫెషనల్ స్థాయి మొత్తం క్వాలిటీ ఉంటుంది.

జూమ్ సామర్థ్యం

పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x జూమ్ అందిస్తుంది. మరొక సెన్సార్ 6x ఆప్టికల్ జూమ్. డిజిటల్ జూమ్ 120x వరకు. దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి. దీని జూమ్ క్వాలిటీ ప్రొషెనల్స్ ఫొటోగ్రాఫర్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది.

బ్యాటరీ, చార్జింగ్

దీని పెద్ద బ్యాటరీ రోజంతా నిలబడుతుంది. కానీ భారీ ఉపయోగంలో క్రమంగా డ్రెయిన్ అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ తో ఫోన్ త్వరగా రీచార్జ్ అయిపోతుంది. వైర్‌లెస్ చార్జింగ్ చాలా సమర్థవంతంగా ఉంది. భారీ టాస్క్‌లకు తగిన బ్యాటరీ లైఫ్.

డిజైన్, బిల్డ్

ఈ ఫోన్ తయారీలో ప్రీమియం మెటీరియల్స్ ఉపయోగించారు. రోజువారీ ఉపయోగంలో డ్యూరబుల్. డిజైన్ మోడరన్, స్టైలిష్ గా ఉంటుంది. ఫోన్ హ్యాండ్లింగ్ చాలా సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుంది. ధరకు తగినట్లు దీని బిల్డ్ క్వాలిటీ కూడా ఉంది. ఫోన్ చేతిలో పట్టుకుంటే చాలా రిచ్, స్టైలిష్ గా అనిపిస్తుంది.

ప్రత్యేక ఆఫర్‌లు

క్రోమా తన క్యాటలాగ్‌లో చాలా ప్రొడక్ట్‌లపై సులభమైన EMI ఆప్షన్‌లు అందిస్తుంది. నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉండవచ్చు, వివరాల కోసం క్రోమా వెబ్‌సైట్ చూడండి. వివిధ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌లు కూడా వర్తిస్తాయి. ఆఫర్ వివరాలను జాగ్రత్తగా చదవండి.

కొత్త మోడల్‌తో పోలిక

ఓప్పో ఫైండ్ X9 సిరీస్ త్వరలో లాంచ్ అవుతుంది. అయినా, X8 ప్రో ఇంకా అద్భుతమైన ఫోన్. ఈ ఆఫర్ దాని విలువను మరింత పెంచుతుంది. కొత్త మోడల్స్ ఎక్కువ ధరలో ఉంటాయి.

బెస్ట్ డీల్

ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు. ప్రీమియం రేంజ్‌లో ఉన్న ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడం గొప్ప అవకాశం. కెమెరా సిస్టమ్ అద్భుతం. బ్యాటరీ లైఫ్ అంచనాలకు తగినది. లిమిటెడ్-టైమ్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు.. ఇప్పుడే ఆర్డర్ చేయండి.

Also Read: వాట్సాప్‌లో సీక్రెట్‌ ట్రిక్.. సెండర్‌కు తెలియకుండా ఫోటోలు చూడాలంటే ఇలా చేయండి

Related News

OnePlus 13T 5G: ఇంత పవర్‌ఫుల్ వన్‌ప్లస్ ఫోన్ ఎప్పుడూ రాలేదు.. 13టి 5జి పూర్తి వివరాలు

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

Samsung Galaxy S26 Ultra: ప్రతి బ్రాండ్‌కి సవాల్ విసిరిన సామ్‌సంగ్.. 220ఎంపి గెలాక్సీ ఎస్26 అల్ట్రా గ్రాండ్ ఎంట్రీ

Ulefone Tablet Projector: 24,200mAh బ్యాటరీ, ప్రొజెక్టర్‌తో ప్రపంచంలోనే మొదటి టాబ్లెట్‌.. యులెఫోన్ ప్యాడ్ 5 అల్ట్రా లాంచ్

Chrome Running Slow: గూగుల్ క్రోమ్ స్లోగా పనిచేస్తోందా? వెంటనే స్పీడ్ పెంచడానికి ఇలా చేయండి

Amazon iPhone Offers: రూ.50వేల లోపే ఐఫోన్ 16, ఐఫోన్ 15.. ఈ ఒక్క రోజే ఛాన్స్, వెంటనే కొనేయండి

Jio Phone 3 5G: స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో జియో ఫోన్ 3 5జి లాంచ్.. ప్రత్యేకతలు తెలుసుకోండి

Big Stories

×