Ulefone Tablet Projector| సూపర్ స్ట్రాంగ్ స్మార్ట్‌ఫోన్‌లు, డివైస్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన కంపెనీ యులెఫోన్. తాజాగా యులెఫోన్ ఆర్మర్ ప్యాడ్ 5 సిరీస్ అనే అద్భుతమైన టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఆర్మర్ ప్యాడ్ 5 అల్ట్రా, ఆర్మర్ ప్యాడ్ 5 ప్రో. ఈ టాబ్లెట్ లో భారీ 24,200mAh బ్యాటరీ, ప్రపంచంలో మొదటిసారిగా బిల్ట్-ఇన్ ప్రొజెక్టర్ ఫీచర్లు ప్రత్యేకం.
ఆర్మర్ ప్యాడ్ 5 సిరీస్ ఒక్కసారి చార్జ్ చేస్తే చాలా కాలం పని చేసేలా రూపొందించబడింది. యులెఫోన్ ప్రకారం.. ఈ టాబ్లెట్‌లోని 24,200 mAh బ్యాటరీ.. 1662 గంటల స్టాండ్‌బై టైమ్, 109 గంటల టాక్ టైమ్ లేదా 109 గంటల వీడియో ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. ఇది బయట ఎక్కువ పని చేసే వారు లేదా ప్రయాణంలో ఉండే వారికి సరైన డివైస్. ఈ టాబ్లెట్ 120W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, కాబట్టి త్వరగా చార్జ్ అవుతుంది. అంతేకాకుండా, 10W రివర్స్ చార్జింగ్ ఫీచర్‌తో ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేయగలదు.
ఆర్మర్ ప్యాడ్ 5 అల్ట్రా మోడల్‌లో బిల్ట్-ఇన్ ప్రొజెక్టర్ ఉంది. ఈ ప్రొజెక్టర్ 960×540 రిజల్యూషన్‌తో వీడియోలను ప్రదర్శిస్తుంది. ఇందులో ఆటోమేటిక్, మాన్యువల్ ఫోకస్ ఆప్షన్లు ఉన్నాయి. అదనంగా.. డెడికేటెడ్ ప్రొజెక్టర్ కంట్రోల్, వన్-కీ క్విక్ యాక్సెస్ ఫీచర్లు ఉపయోగించడాన్ని సులభతరం చేస్తాయి. ఈ ఫీచర్ ప్రెజెంటేషన్లు, సినిమాలు చూడటం లేదా కంటెంట్‌ను పెద్ద స్క్రీన్‌పై షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఈ సిరీస్‌లోని రెండు టాబ్లెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 7400X 5G చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఈ శక్తివంతమైన చిప్.. వేగవంతమైన పనితీరును, మల్టీ టాస్క్‌లను సులభంగా నిర్వహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ డివైజ్ సిస్టమ్ రన్ అవుతుంది. ఇది సునాయాసమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. ఈ టాబ్లెట్‌లు రగ్డ్ డిజైన్‌తో తయారు చేయబడ్డాయి, అంటే ఇవి కింద పడిపోయినా, దుమ్ము లేదా నీటిని తట్టుకోగలవు. ఇవి తీవ్ర వాతావరణం, ఇండస్ట్రియల్ ఉపయోగం కోసం బెస్ట్.
ఈ ప్యాడ్ 5 అల్ట్రా సిరీస్‌లో 64MP మెయిన్ కెమెరా స్పష్టమైన ఫోటోల కోసం, 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఉన్నాయి. 11-ఇంచ్ ఫుల్ HD డిస్‌ప్లే స్పష్టమైన ఫొటోలను అందిస్తుంది. 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎండలో కూడా సులభంగా కనిపిస్తుంది. అదనంగా, 754 LEDలతో కూడిన డ్యూయల్ LED లైట్లు అత్యవసర లైటింగ్‌గా పనిచేస్తాయి.
యులెఫోన్ ఆర్మర్ ప్యాడ్ 5 సిరీస్ అత్యంత పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రత్యేకమైన ప్రొజెక్టర్, గట్టి డిజైన్, ఫాస్ట్ చార్జింగ్, మంచి కెమెరా, ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో లాంటి ఫీచర్లతో వస్తుంది. రఫ్ అండ్ టఫ్ గా ఉండే ఈ టాబ్లెట్ ఎక్కువ కాలం పనిచేసే డివైజ్ కావాలనుకునే వారికి గొప్ప ఆప్షన్. మరిన్ని వివరాల కోసం యులెఫోన్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.