Madonna Sebastian: సాధారణంగా సినీ సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే కామెంట్లు ఒక్కొక్కసారి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. దీనికి కారణం వారిపై నెటిజన్స్ చేసే కామెంట్లే అని చెప్పవచ్చు. ఆ కామెంట్లకు విసిగిపోయిన వీరు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మడోన్నా సెబాస్టియన్ కూడా చేసిన కామెంట్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తమిళ్ , మలయాళం చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ సినిమా ద్వారా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ సినిమా తర్వాత నాని (Nani) హీరోగా నటించిన ‘ శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా తర్వాత అవకాశాలు మాత్రం తలుపు తట్టలేదు. దాంతో తమిళ్, మలయాళం లోనే చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే మడోన్నా సెబాస్టియన్ సినిమాలలో తక్కువగా కనిపించినా.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈమె.. ఇప్పుడు చిట్టి పొట్టి నిక్కర్లు ధరిస్తూ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఈమెను ట్యాగ్ చేస్తూ చాలామంది చాలా దారుణంగా కామెంట్లు చేయడంతో ఎట్టకేలకు రియాక్ట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.
అందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “గ్లామర్ షో చేయడం తప్పేమీ కాదు.. కానీ గ్లామర్ షో కి, అసభ్యతకు మధ్య వ్యత్యాసం తెలిస్తే చాలు. మీరెవరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నాకు తెలుసు.. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలుసు” అంటూ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికైతే ఒక్క పోస్టుతో తాను కూడా గ్లామర్ షో చేయడానికి సిద్ధమని కాకపోతే అసభ్యతకు దూరంగా ఉంటానని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి గ్లామర్ షో చేయడానికి సిద్ధం అని చెబుతున్న ఈమెకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. మొత్తానికైతే మడోన్నా తనపై వస్తున్న రూమర్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అని చెప్పవచ్చు.
మడోన్నా సెబాస్టియన్ విషయానికి వస్తే.. 1992 అక్టోబర్ 1న కేరళ రాష్ట్రం కన్నూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు బేబీసిడీ దేవాసియా.. తల్లి పేరు శైల బేబీసిడి.. సెయింట్ పీటర్స్ సీనియర్ సెకండరీ స్కూల్ కడాయిరుప్పులో ఉన్నత చదువులు చదివిన ఈమె.. స్టార్ట్ కోజికోడులో ఒక ఏడాది పాటు మాస్టర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసింది. బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టభద్రురాలు అయింది. మలయాళం సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ప్రేమమ్ సినిమాతో సైమా అవార్డ్స్ ఉత్తమ తొలి నటిగా నామినేట్ అయ్యింది.