Janhvi Kapoor:టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు సినీ పరిశ్రమలో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంది అంటూ ఇప్పటికే ఎంతోమంది కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ హీరోయిన్స్ మొదలుకొని సీనియర్ స్టార్ హీరోయిన్స్ వరకూ ఎంతోమంది ఇదే విషయంపై ఎన్నోసార్లు తమ గొంతు వినిపించారు. అటు హీరోలకు ఇచ్చే విలువ హీరోయిన్లకు ఇవ్వడం లేదని.. వారితో సమానంగా పారితోషకం ఇవ్వడంలేదని.. దీనికి తోడు హీరోలు కేవలం 8గంటలు మాత్రమే పనిచేస్తున్నారని.. పైగా శని, ఆదివారాలలో సెలవులు తీసుకుంటున్నారని.. హీరోయిన్లకు మాత్రం ఇలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ ఎంతోమంది తమ బాధను వినిపించారు.
అంతేకాదు ఇండస్ట్రీలో పురుషాహంకారం ఎక్కువగా ఉంది అంటూ చాలామంది చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ కిడ్ జాన్వీ కపూర్ (Janhvi kapoor) కూడా ఇదే విషయాన్ని తెలిపింది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar)తో కలిసి ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol ) జంటగా నిర్వహిస్తున్న “టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ ” షో కి హాజరైంది. ఇందులో భాగంగానే ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి ఆమె సంచలన కామెంట్లు చేసింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “నేను నెపోకిడ్ ని అయినప్పటికీ చాలామంది నాకు అన్ని అవకాశాలు దగ్గరికే వస్తాయనుకుంటారు.. ఇందులో నిజం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో పురుష అహంకారం ఎక్కువగా ఉంది.వారి అహంకారాన్ని తట్టుకొని నిలబడాలి అంటే ప్రతిసారి మౌనంగా అన్ని భరించాల్సి వస్తోంది. ముఖ్యంగా నలుగురు ఆడవాళ్ళ మధ్య నా గొంతును స్పష్టంగా వినిపించగలను. అదే నలుగురు మగవాళ్ళ మధ్య నిలబడినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీల్ అవ్వాల్సి వస్తోంది. ముఖ్యంగా వారి మనసు నొచ్చుకోకుండా వారిని ఇబ్బంది పెట్టకుండా నన్ను నేను మార్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయంలో నేను ఎన్నోసార్లు పోరాడాను. హీరోల కోసం హీరోయిన్లను కావాలనే తక్కువగా చేసి చూపిస్తున్నారు” అంటూ తెలిపింది.
అయితే జాన్వీకపూర్ చేసిన కామెంట్లకు ట్వింకిల్ ఖన్నా కూడా నిజం అనే తెలిపింది. తాను కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలలో చేస్తున్నప్పుడు.. ఇలాంటి పురుష అహంకారాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నానని.. తాను కూడా పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకునేదాన్ని.. ఏ రోజు ఎవరికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు” అంటూ కూడా చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తే హీరోయిన్స్ అందరూ ఇండస్ట్రీలో పురుష అహంకారం ఎక్కువగా ఉందని చెబుతున్నా.. దీనిపై ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది హిందీలో పరమ్ సుందరి , సన్నీ సంస్కారీ కీ తులసి కుమారి, హోమ్ బౌండ్ అంటూ మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మూడు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక తెలుగులో ఎన్టీఆర్ తో దేవర సినిమా చేసిన ఈమె ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తోంది.. అలాగే నాని ప్యారడైజ్ సినిమాతో పాటు హిందీలో థక్త్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
ALSO READ: Dhruv Vikram: అనుపమతో రిలేషన్కన్ఫామ్ చేసిన ధ్రువ్!