Dhruv Vikram: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ (Chiyan Vikram) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) . ఇటీవల బైసన్ (Baison) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్లో విడుదలైన వారం తర్వాత తెలుగులో విడుదలై ఇక్కడ కూడా మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి సంబంధించిన లిప్ లాక్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే వార్తలు గట్టిగా వినిపించాయి. పైగా ధ్రువ్ తో సన్నిహితంగా ప్రవర్తిస్తూ.. ఈ విషయంపై అడిగితే అనుపమ సున్నితంగా తప్పించుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ధ్రువ్ విక్రమ్.. ఇటీవల తన తండ్రితో కలిసి ‘మహాన్’ అనే ఓటీటీ సినిమా చేశారు. ఇప్పుడు ‘బైసన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో వీరిద్దరి పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా లాంచ్ ఈవెంట్లో అనుపమకు మీడియా నుంచి ధ్రువ్ తో డేటింగ్ ప్రశ్న ఎదురయింది? మీరు ధ్రువ్ తో డేటింగ్ లో ఉన్నారట.. నిజమేనా? అని ఒక రిపోర్టర్ అడగగా.. సిగ్గుపడిన అనుపమ.. నవ్వుతూ తెలివిగా ప్రశ్నను తప్పించుకుంది. వెంటనే ధ్రువ్ నటనను పొగుడుతూ.. టాపిక్ డైవర్ట్ చేసేసింది. ఇకపోతే ఇదే కార్యక్రమంలో ధ్రువ్ ను హత్తుకోవడం అతని పేరు వినగానే ఈమె ముఖం ఎర్రబారడం వంటి క్షణాలను చూసిన వారంతా నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ రిలేషన్ ను కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. బైసన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే పెర్ల్ మానే టాక్ షోకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అక్టోబర్ 25న ఈ టాక్ షో ప్రసారమైంది. ఈ టాక్ షోలో భాగంగా ధ్రువ్ అసలు విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే ఈ టాక్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న పెర్ల్ మానే. మీరు నా ప్రత్యేక సెలబ్రిటీ ఇంటర్వ్యూలను ఎప్పుడైనా చూసారా? అని అడగ్గా ఆ చూసాను అని చెప్పాడు ధ్రువ్. ఆమె సంతోషంగా నజ్రియా, బాసిల్ జోసెఫ్ తో ఇంటర్వ్యూలు చూశారా? అని అడగ్గా.. కాదు అనుపమ ఇంటర్వ్యూ చూశాను అని చెప్పాడు. ఆ తర్వాత ఒక టీజర్ వేయగా అది అందర్నీ ఆకర్షించింది. దీని తర్వాత పెర్ల్ మానేఅనుపమ గురించి ప్రస్తావించగా ధ్రువ్ సిగ్గు పడిపోయాడు. అంతేకాదు ఆమె పేరు వినగానే ఆయన మోములో నవ్వు వికసించింది. మొత్తానికైతే అనుపమతో తనకున్న సంబంధాన్ని పరోక్షంగా నిర్ధారించారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం.
ALSO READ:Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?