E-Paper
Advertisement

Redmi K90 Launched: అప్‌డేటెడ్ లుక్‌లో రెడ్మీ కె90 5జి… స్టైలిష్‌గా వచ్చిన కొత్త ప్రీమియం ఫోన్

Redmi K90 Launched: అప్‌డేటెడ్ లుక్‌లో రెడ్మీ కె90 5జి… స్టైలిష్‌గా వచ్చిన కొత్త ప్రీమియం ఫోన్

Redmi K90 Launched: రెడ్‌మి అనే పేరు మార్కెట్లో వినిపిస్తే, ఎక్కువమంది ముందు గుర్తు చేసుకునేది బడ్జెట్‌ ధరలోనూ హై పర్‌ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్‌లు. కానీ ఇప్పుడు రెడ్‌మి కె90తో కంపెనీ పూర్తిగా ట్రాక్ మార్చింది. ఇది సాధారణ అప్‌గ్రేడ్‌ కాదు, రెడ్‌మి ఇప్పటివరకు చేసిన ఫోన్లన్నింటిలో ఇదే అత్యంత శక్తివంతమైన, ప్రీమియం మోడల్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్‌షిప్ కిల్లర్ అనిపించుకోవడానికి కావాల్సిన ప్రతీ ఫీచర్‌ను, ప్రతీ స్పెసిఫికేషన్‌ను కంపెనీ ఈ మోడల్‌లో ఉంచింది. ఇప్పుడు ఈ మోడల్‌లో ఉన్న ప్రతి అంశం ఎలా పని చేస్తుందో పూర్తి వివరంగా చూద్దాం.

డిజైన్ ప్రీమియం అనుభూతి

డిజైన్ విషయానికి వస్తే రెడ్మీ కె90 చాలా శుభ్రంగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ముందుభాగంలోని సెంటర్ పంచ్-హోల్ అమరిక ఫోన్‌కి క్లియర్‌ లుక్ ఇస్తుంది. 87.5శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉండటంతో ఫోన్‌ను చూస్తే మొత్తం స్క్రీన్‌మే కనిపించినట్టే ఉంటుంది. స్క్రీన్ పెద్దదైనా చేతిలో పడేటప్పుడు ఫోన్ అసౌకర్యం కలిగించదు. 206 గ్రాముల బరువు బ్యాలెన్స్ ఉండటంతో పట్టుకోవడం సులభంగా ఉంటుంది. 8 మిల్లీమీటర్ల మందం ఫోన్‌ను సన్నగా, స్మార్ట్‌గా చూపిస్తుంది. మొత్తంగా చేతిలో గ్రిప్, చూడటానికి అప్‌డేటెడ్ లుక్ ఇచ్చే డిజైన్ ఇది.

డిస్‌ప్లే .. అమోలేడ్ స్క్రీన్

డిస్‌ప్లే విషయానికి వస్తే 6.59 అంగుళాల 2కే అమోలేడ్ స్క్రీన్ స్పష్టత అద్భుతంగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్‌రేట్ వల్ల స్క్రోలింగ్‌, గేమింగ్‌, సోషల్ మీడియా… అన్నీ చాలా స్మూత్‌గా అనిపిస్తాయి. బయట ఎండలో ఉన్నా స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గడం జరగదు. రంగుల ప్రదర్శన జీవంతో ఉంటుంది. కళ్ళకు ఇబ్బందిగా అనిపించకుండా గంటల తరబడి కంటెంట్ చూడవచ్చు.

మూడు రియర్ కెమెరాలు

కెమెరా సెటప్‌లో మూడు రియర్ కెమెరాలు, 50ఎంపి ప్రధాన సెన్సర్, 50ఎంపి రెండవ సెన్సర్, 8ఎంపి వైడ్ సెన్సర్ ఇమేజ్ క్వాలిటీని హై లెవెల్ స్థాయికి తీసుకెళ్తాయి. పగలు–రాత్రి ఏ సమయమైనా ఫోటోలు క్లారిటీతో వస్తాయి. రంగులు సహజంగా, డీటెయిల్స్ స్పష్టంగా కనపడతాయి. 20ఎంపి ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు సహజంగా రావటంలో బాగా సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే అదనపు ఎడిటింగ్ అవసరం లేకుండా అందంగా కనిపిస్తుంది.

Also Read: Nokia Premium 5G: నోకియా ప్రీమియం 5జీ కంబ్యాక్.. 2కె డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ హైలైట్

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌

రెడ్‌మి కె90 శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఈ చిప్‌సెట్ పనితనం అంత వేగంగా ఉండడంతో యాప్‌లు ఓపెన్ అవ్వటం, గేమింగ్‌, వీడియో ఎడిటింగ్ వంటి పనుల్లో ఏ మాత్రం ల్యాగ్ అనిపించదు. భారీ గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ఈ ఫోన్‌లో అత్యంత స్మూత్‌గా నడుస్తాయి. ఫోన్ వేడి పెరగకుండా, స్థిరంగా పనిచేయడంలో ఈ ప్రాసెసర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నిజంగా ఫ్లాగ్‌షిప్‌లా అనిపించే ప్రాంతం ఇదే.

1టిబి స్టోరేజ్‌ – అప్‌డేటెడ్ లుక్‌

స్టోరేజ్, ర్యామ్ విభాగంలో రెడ్మీ కె90 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్‌తో వస్తున్నది పెద్ద ప్రత్యేకత. యాప్‌లు ఎక్కువగా ఓపెన్ చేసి ఉంచినా ఎక్కడా స్లో అనిపించదు. భారీ ఫైళ్లు, పెద్ద వీడియోలు, ప్రాజెక్టులు అన్నీ సులభంగా స్టోర్ చేయవచ్చు. మొబైల్‌ వచ్చే కొన్ని సంవత్సరాల వరకు ఈ స్టోరేజ్ సమస్యే ఉండదు. ఓఎస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే హైపర్‌ఓఎస్ 3 యూజర్‌కు పూర్తిగా స్మూత్ అనుభవం ఇస్తుంది. యానిమేషన్‌లు, స్క్రీన్ ట్రాన్సిషన్‌లు, నోటిఫికేషన్ రెస్పాన్స్ అన్నీ చక్కగా నడుస్తాయి. ఫోన్ అప్‌డేటెడ్ లుక్‌తో కనిపించటానికి కూడా హైపర్‌ఓఎస్ ప్రధాన కారణం.

7,100mAh బ్యాటరీ

బ్యాటరీ విభాగం ఈ ఫోన్‌కి మరో పెద్ద ప్లస్‌. 7,100mAh బ్యాటరీని ఉంచడంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే పూర్తిగా ఒక రోజు గడిచే వరకు పవర్ తగ్గదు. ఎక్కువగా యూజ్ చేసినా కూడా సాయంత్రం వరకూ ఛార్జ్ ఆగిపోదు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడంతో కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీ శాతం గణనీయంగా పెరుగుతుంది. ఉదయం బయటకు వెళ్లే ముందు కొద్దిసేపు ఛార్జ్ పెడితే సరిపోతుంది.

అందుబాటులో ధర  

రెడ్‌మి కె90 యొక్క భారత ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చైనా మార్కెట్‌లో అయితే 12జిబి ప్లస్ 256జిబి వేరియంట్‌ను సిఎన్‌వై (CNY) అంటే చైనా అధికారిక కరెన్సీ ప్రకారం 2,599కు విడుదల చేశారు, ఇది భారత కరెన్సీలో సుమారుగా రూ.32,000కు సమానం. ఈ లెక్కలు ఆధారంగా చూస్తే, భారత్‌లో రెడ్‌మి కె90 ధర రూ.35,000 నుండి రూ.40,000 మధ్యలో ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు రూ.35,990 ఉంటుందని టాక్. మొత్తం చూస్తే రెడ్‌మి నిజంగా ఫ్లాగ్‌షిప్ కిల్లర్ మోడల్. దీన్ని ఉపయోగించే వారికి నిరాశ కలిగించదు.

Related News

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

Big Stories

×