Nokia Premium 5G: నేటి మార్కెట్లో టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఎలాంటి రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ రేంజ్ మధ్యలోకి చాలా కాలం తర్వాత నోకియా మళ్లీ అడుగు పెడుతోంది. ఒకప్పుడు మొబైల్ వరల్డ్ లో స్టేబుల్ పేరు గా నిలిచిన నోకియా, ఈసారి ప్రీమియం సెగ్మెంట్ లోకి వెనక్కి తగ్గకుండా సూటిగా చెలెంజ్ ఇచ్చే విధంగా కొత్త నోకియా ప్రీమియం 5జీ ఫ్లాగ్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఇదంతా చూస్తే నోకియా నిజంగా మళ్లీ నేనిక్కడనే ఉన్నా అని చెబుతున్నట్టే ఉంటుంది.
2కె కర్వ్డ్ డిస్‌ప్లే
కొత్త నోకియా ఫ్లాగ్‌షిప్ లో మొదట కనిపించే విషయం దీని డిజైన్. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, అన్ని వైపులా ప్రీమియం టచ్. హ్యాండ్ లో పట్టుకున్నప్పుడు ఫోన్ బరువు కూడా బాగా బ్యాలెన్స్ గా ఉంటుంది. 2కె కర్వ్డ్ డిస్‌ప్లే కాస్తా మరింత హై ఎండ్ ఫీలింగ్ ఇస్తుంది. బీజెల్స్ చాలా సన్నగా ఉండటంతో స్క్రీన్ రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది. వీడియోలు చూడటానికి అయినా, గేమ్స్ ఆడటానికి అయినా ఇది అసలు కళ్లకు విందే. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ కుడా నోకియా క్లాసిక్ స్టైల్ ని ఫాలో అవుతూ, విత్ మోడర్నిటీ మిక్స్ అయ్యింది. ఐపి68 రేటింగ్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నీరు, దుమ్ము పడినా ఈఫోన్ సేఫ్ అని చెప్పాలి.
స్మూత్ డిస్‌ప్లే క్వాలిటీ
ఫోన్‌లోని డిస్‌ప్లే క్వాలిటీ మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. 2కె కర్వ్డ్ డిస్‌ప్లేలోని బ్రైట్‌నెస్, కలర్స్, షార్ప్‌నెస్ అన్నీ తగినంత అద్భుతంగా కనిపిస్తాయి. గేమింగ్ చేస్తూ ఉన్నా, సినిమాలు చూస్తూ ఉన్నా, డే–టు–డే యూజ్‌లో ఉన్నా స్క్రీన్ రెస్పాన్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. హై రిఫ్రెష్ రేట్ ఉండటం యూజర్ ఎక్స్‌పీరియెన్స్ ని ఇంకా మృదువుగా మార్చేస్తుంది. ముఖ్యంగా కర్వ్డ్ స్క్రీన్ ఉండటం వల్ల ఫోన్ కాస్తా మరింత లగ్జరీగా, ఆల్ట్రా ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది.
250ఎంపి జీస్ ప్రధాన సెన్సర్
ఈ ఫోన్ యొక్క అసలు శక్తి కెమెరా సెక్షన్ లోనే కనిపిస్తుంది. 250ఎంపి జీస్ ప్రధాన సెన్సర్ ఉండటం అంటే మొబైల్ ఫోటోగ్రఫీలో ఒక కొత్త లుక్ అందిస్తుంది. ఏమాత్రం లైటింగ్‌లో ఉన్నా ఫొటోలు షార్ప్‌గా, డీటైల్ తో వస్తాయి. చిన్న చిన్న వివరాలు కూడా క్లియర్‌గా కనపడే స్థాయిలో ఈ కెమెరా పని చేస్తుంది. నైట్ టైం లో తీసిన ఫొటోలు కూడా తగినంత నేచురల్‌గా, శబ్దం తగ్గిన ఇమేజ్‌గా కనిపిస్తాయి. అయితే ఈ ఫోన్ లో అసలైన ఆకర్షణ 220ఎక్స్ జూమ్. ఇంత జూమ్ అందించే ఫోన్లు మార్కెట్లో లేవు అనడం అతిశయోక్తి కాదు. ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ అయినా జూమ్ చేస్తే దాని ఆకృతి, అవుట్‌లైన్ తక్కువ లాస్ తో క్లియర్ గా కనిపించడం ఫోటోగ్రఫీ ప్రేమికులకు పెద్ద బోనస్.
పనితీరులో నో కాంప్రమైజ్
పనితీరులో కూడా నోకియా ఈసారి అస్సలు కాంప్రమైజ్ చేయలేదు. ఈ ప్రీమియం ఫోన్‌లో ఉన్న హై–ఎండ్ ప్రాసెసర్ మల్టీటాస్కింగ్ అయ్యేలా, అడ్వాన్సుడ్ గేమింగ్ స్మూత్‌గా రన్ అయ్యేలా చేస్తుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, స్క్రోల్ అవ్వడం, బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీస్ ఆల్ లగ్ ఫ్రీ. పెద్ద ర్యామ్ ఆప్షన్లు ఉండడం వల్ల ఎవరు ఎంత హెవీ యూజ్ చేసినా ఫోన్ సులభంగా హ్యాండిల్ చేస్తుంది. రోజువారీ పనులు నుంచి హై గ్రాఫిక్స్ గేమ్స్ వరకు ఈ ఫోన్‌కు ఎటువంటి కష్టమనిపించదు.
7000mAh పెద్ద బ్యాటరీ
ఈ ఫోన్ యొక్క మరో ప్రధాన బలం బ్యాటరీ. 7000mAh పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే కాలం మర్చిపోయి వాడుకునేంత వరకు పవర్ ఉంటుంది. స్ట్రీమింగ్, గేమింగ్, సోషల్ మీడియా అననీ భారీగా వినియోగించిన ఒక్కరోజు పూర్తి అవ్వడం గ్యారెంటీ. సాధారణ యూజ్ చేస్తే రెండు రోజులు కూడా వస్తుంది. ఈ పెద్ద బ్యాటరీకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ కలిపి రావడం వినియోగదారులకు పెద్ద లాభం. తక్కువ సమయంలోనే తగినంత ఛార్జ్ అవ్వడం వల్ల ఛార్జర్ దగ్గర ఎక్కువసేపు కూర్చోవలసిన అవసరం ఉండదు.
టైమ్ టు టైమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే, నోకియా మళ్లీ తన నైపుణ్యాన్ని చూపిస్తుంది. మల్టిపుల్ 5జి బ్యాండ్స్, మెరుగైన వైఫై, అప్‌డేటెడ్ బ్లూటూత్, సెక్యూర్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవం అన్నీ ఇవి ఫోన్‌ని మరింత ప్రీమియంగా నిలబెడతాయి. టైమ్ టు టైమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ రావడం భద్రత పరంగా ఉపయోగపడే అంశం.
ధర ఎంతంటే?
ధర విషయానికి వస్తే, అధికారిక సమాచారం కాకపోయినా ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోనే పడే అవకాశముంది. భారత మార్కెట్‌లో ఈ ఫోన్ సుమారు రూ.55,000 నుంచి రూ.65,000 మధ్యలో ధర నిర్ణయించే ఛాన్స్ ఉంది. కాగా.. ఫోటోగ్రఫీ నుంచి గేమింగ్ వరకు, సినిమా అనుభవం నుంచి డే–టు–డే యూజ్ వరకు అన్నింటిలోనూ వినియోగదారులకి పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఇవ్వాలని నోకియా అడుగు వేసింది. ఇన్ని స్పెసిఫికేషన్లతో నోకియా మరోసారి మార్కెట్లో పెద్ద చర్చగా నిలవడం ఖాయం.