E-Paper
Advertisement

Movie Piracy : పైరసీని పూర్తిగా కట్టడి చేయాలంటే… ఈ మార్పులు జరగాలి

Movie Piracy : పైరసీని పూర్తిగా కట్టడి చేయాలంటే… ఈ మార్పులు జరగాలి
Advertisement

Movie Piracy : పైరసీ సామ్రజ్యాన్ని స్థాపించి… 21,000 లకు పైగా సినిమాలను పైరసీ చేసి కోట్లాది రూపాయలను దోచుకున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఒక్క అరెస్ట్‌తో ఐ బొమ్మ, బప్పం టీవీలు ఇప్పటి వరకు అయితే మూతపడ్డాయి.

అవును ఇప్పటి వరకే మూతపడ్డాయి. ఈ రవి పోతే.. ఇంక ఎవడో ఒకడు వస్తాడు… పైరసీ సినిమాలను మళ్లీ తీసుకొస్తాడు అంటూ సోషల్ మీడియాలో కొంత మంది జనాలు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు.

Advertisement

అవును.. వాళ్లు చెప్పింది నిజమే. ఈ రవి పోతే ఇంక ఎవడో ఒకడు వస్తాడు. ఈ ఐ బొమ్మ కాకపోతే… ఇంక ఏదో బొమ్మ వస్తుంది. సినిమాలను ప్రైవసీ చేస్తుంది. మరి ఎలా ఈ పైరసీ భూతాన్ని ఆపేది ? అనే దాని గురించి ఓ లుక్ వేద్దాం రండి.

పైరసీ సినిమాల విషయంలో ఇప్పుడు అరెస్ట్ అయిన ఇమ్మడి రవిది ఎంత వరకు తప్పు ఉందో… వాటిని ప్రొత్సహిస్తున్న వాళ్లది కూడా అంతే మిస్టేక్ ఉంది. గతంలో ఈ ఇమ్మడి రవి… “దమ్ముంటే పట్టుకోండి” అంటూ పోలీసులకు సవాల్ విసిరినప్పుడు.. కొంత మంది ఈ ఐ బొమ్మ వాడిని హీరోలా అభివర్ణించుకున్నారు. “దమ్ముంటే పట్టుకోరా షికావత్తు” అంటూ అల్లు అర్జున్‌తో పోల్చారు కొంత మంది.

Advertisement

ఒక నేరస్థుడిని… బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను తీసిన దుర్మార్గున్ని హీరోని చేశారంటే… అసలు సమాజం ఎలా మారిపోయింది? ఇలా మారిపోవడానికి కారణాలు ఏంటి ? ఒక్క సారి ఆలోచించారా ?

ఒక ఫ్యామిలీలో నలుగురు సినిమా చూడటానికి మల్టీ ప్లెక్స్ కి వెళ్లింది. సినిమా ఒక్క టికెట్‌కు దాదాపు 300 రూపాయలు. మధ్యలో పాప్ కార్న్ అండ్ కూల్ డ్రింక్.. ఒక్క మనిషికి దాదాపు 600 వరకు అవుతుంది. అంటే ఒక్క మనిషి సినిమా చూస్తే దాదాపు 900కు పైగా ఖర్చు అవుతుంది. అంటే నలుగురు కుటుంబ సభ్యులు వెళ్తే… 3,600 నుంచి 4,000 వరకు అవుతుంది.

అలా కాకుండా.. 49 రూపాయలతో డేటా ప్యాక్ వేసుకుంటే.. 25 జీబీ డేటా వస్తుంది. దాంతో కనీసం 10 సినిమాలను హెచ్‌డీ క్లారిటీతో డౌన్ లోడ్ చేసుకుని.. ఫ్యామిలీలో నలుగురు మాత్రమే కాదు.. ఎంత మంది అయినా.. చూసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రజలు ఇలాంటి వే.. లోనే ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజలు.. థియేటర్స్ గడప తొక్కడం మానేసి… ఇంట్లోనే… పైరసీ సినిమాలు చూస్తున్నారు. ఇది మారాలంటే ఫస్ట్ ఎవరు మారాలి… ప్రజలా ? నిర్మాతలా ? థియేటర్స్ యజమానులా ?

సినిమాను రిలీజ్ చేస్తూ… స్పెషల్ జీవోలు తెచ్చుకుని టికెట్స్ ధరలను ఆకాశానికి అంటేలా చేస్తున్న నిర్మాతలు మారాలి. సినిమా టికెట్స్ కంటే… థియేటర్స్ లో అమ్ముతున్న పాప్ కార్న్.. కూల్ డ్రింగ్స్ అమ్మే థియేటర్స్ ఓనర్స్ మారాలి. మార్పు అక్కడ నుంచి మొదలవ్వాలి.

అందుబాటులో టికెట్స్ ధరలు తీసుకురావాలి. 10 రూపాయల వాల్యూ చేసే పాప్ కార్న్‌ను మరీ 400 రూపాయలు కాకుండా… సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. 20 రూపాయలు విలువ చేసే కూల్ డ్రింక్స్ ధరలు మరీ 200 రూపాయలు కూడా చూసుకోవాలి. 20 రూపాయల వాటర్ బాటిల్‌ను 50 రూపాయలకు అమ్ముతున్నారంటే… ఇక్కడ దోపిడి 100 శాతం కంటే ఎక్కువ ఉంది.

ముందు వీటిని మార్చాలి. ఈ ధరలను అరికట్టాలి. అప్పుడు పైరసీని ప్రభుత్వమో.. పోలీసులో కాదు.. ప్రజలే అరికడుతారు.

ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తూ… అందరి మన్ననలు పొందుతున్న పోలీస్ కమిషనర్ సజ్జనార్ సార్ వీటి పైన కూడా దృష్టి పెడితే బాగుంటుంది.

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×