Redmi Smart TV A50| షావోమీ కంపెనీ తాజాగా రెడ్‌మి స్మార్ట్ టీవీల లైనప్‌లో కొత్త మోడల్ విడుదల చేసింది. దీని పేరు రెడ్‌మి స్మార్ట్ టివి A50 ఎనర్జీ ఎఫిషియెన్సీ లెవెల్ 1 ఎడిషన్. ఈ టీవి బడ్జెట్ స్మార్ట్ టీవీ సెగ్మెంట్‌లో సరికొత్త మోడల్. అయితే ఈ టీవీలో చాలా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద స్క్రీన్, తక్కువ విద్యుత్ వినియోగం, ఎక్కువ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
చైనాలో ఈ టీవీ ధర 1,399 యూవాన్ (భారత కరెన్సీలో దాదాపు రూ. 16,000). ప్రస్తుతం చైనా మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌లో రెడ్‌మి టీవీలు ఇప్పటికే బాగా సేల్ అవుతున్నాయి. అయితే ఈ A50 మోడల్ ఇంకా మన దేశంలో లాంచ్ కాలేదు. షావోమీ త్వరలోనే ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా A50 మోడల్ టీవీ లాంచ్ చేయనుంది.
ఈ టీవీ స్పెషల్ 50 ఇంచ్ స్క్రీన్‌తో వస్తుంది. 4K UHD రిజల్యూషన్ (3840* 2160 పిక్సెల్స్)తో స్పష్టమైన, డీటెయిల్డ్ వీడియోలు చూడవచ్చు. సినిమాలు, స్పోర్ట్స్, గేమింగ్‌కు బాగుంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో ఫాస్ట్ మోషన్ సీన్స్ స్మూత్‌గా కనిపిస్తాయి.
ఈ ప్రత్యేక టీవీలో ప్రత్యేక డైరెక్ట్-లిట్ LCD టెక్నాలజీ ఉపయోగించారు. LEDలు స్క్రీన్ వెనక నేరుగా ఉంటాయి. ఇది స్క్రీన్ అంతటా యూనిఫాం బ్రైట్‌నెస్ ఇస్తుంది. వివిధ లైటింగ్ కండీషన్లలో మంచి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. True Tone టెక్నాలజీతో కలర్లు నేచురల్‌గా కనిపిస్తాయి.
టీవీలో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. Cortex A35 CPU కోర్లు, Mali G31 MP2 GPU. అంటే సాధారణ వీడియోలతో పాటు, మానిటర్ లాగా ఇంటర్నెట్ కనెక్ట చేసి సులభంగా ఉపయోగించవచ్చు. 2GB RAM, 32GB స్టోరేజ్ ఉంది. యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, మీడియా ఫైల్స్ సేవ్ చేయవచ్చు. షావోమీ Surge OSతో రన్ అవుతుంది.
ఈ టీవీకి ఎనర్జీ ఎఫిషియెన్సీ లెవల్ 1 సర్టిఫికేషన్ ఉంది. చైనాలో అత్యధిక ఎనర్జీ సేవింగ్ స్టాండర్డ్. సాధారణ టీవీల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లు తగ్గుతుంది. అంటే పర్యావరణానికి కూడా మంచిది.
టీవీలో డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ప్రతి స్పీకర్ 10W, మొత్తం 20W అవుట్‌పుట్. సాధారణ వ్యూయింగ్‌కు స్పష్టమైన సౌండ్ ఇస్తుంది. ఎక్స్‌టర్నల్ స్పీకర్లు లేకుండానే సినిమాలు, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.
Also Read: ఇంటర్నెట్ డేటాపై పన్ను.. ప్రతి ఒక్కGBపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి.. ఎంతంటే?
రెండు HDMI పోర్టులు (ఒకటి ARC సపోర్ట్‌తో), రెండు USB-A పోర్టులు, AV ఇన్‌పుట్, ఈథర్నెట్ LAN ఉన్నాయి. S/PDIF ఆడియో అవుట్‌పుట్ కూడా ఉంది. DTMB, అనలాగ్ సిగ్నల్ రిసెప్షన్ సపోర్ట్ ఉంది. 2.4GHz Wi-Fiతో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సపోర్ట్ ఉంది.
ఈ టీవీ బడ్జెట్ కస్టమర్లకు గొప్ప విలువ ఇస్తుంది. పెద్ద 4K స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్, ఎనర్జీ సేవింగ్, మంచి సౌండ్, ఎక్కువ పోర్టులు ఉన్నాయి. ఇండియాలో లాంచ్ అయితే బడ్జెట్ వినియోగదారులను ఆకర్షిస్తుంది.
ముఖ్య గమనిక: పై తెలిపిన స్మార్ట్ టీవీ వివరాలు, దాని ధర సదరు కంపెనీ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. మీరు కొనుగోలు చేసే సమయానికి మీ అవసరాలను తగిన టీవీని సరిచూసుకొని కొనండి. ఈ కథనంలో పేర్కొన్న ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. అందుకే ఈ విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.