Illu Illalu Pillalu Today Episode March 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వేరే దాంతో తిరుగుతావా అని ధీరజ్ విశ్వాన్ని కొడతాడు.. అయితే ధీరజ్ ఇక విశ్వం ని చంపేందుకు రెడీ అవుతాడు. ఆగన్నయ్య నువ్వు అన్నందుకు కొడుతున్నావ్ అని చంపేసి నువ్వు జైలుకెళ్తావా అని అమూల్య అంటుంది.. వాడు నీ మెడలో తాళి కట్టి ఇప్పుడు వేరే దాంతో తిరుగుతున్నాడు అమ్మ దీని చంపేసిన, జైలుకెళ్ళినా పర్వాలేదు అని ధీరజ్ అంటాడు.. ఆ మాట వినగానే అమూల్య నాకసలు పెళ్లే కాలేదు వీడు నా మెడలో తాళి కట్టలేదు అని గట్టిగా అరుస్తుంది..
అయితే తాళి కట్ట లేదా మరి నీ మెడలోకి తాళి ఎలా వచ్చింది అని అందరూ అడుగుతారు.. ప్రేమ, నర్మదా ఇద్దరు కూడా అమూల్య చెప్పింది నిజమే ఆ తాళి వాడు కట్టలేదు అని అంటారు.. వాడు తాళి కట్టలేదంటే ఇందులో ఏదో మతలబ్ ఉంది.. అసలేం జరిగిందో చెప్పండి అని వేదవతి సీరియస్ అవుతుంది. ఇక ప్రేమ నిజంగానే అమూల్య మెడలో ఆ తాళి వేసుకోలేదు. మెడలో తాళి వేసుకోమని చెప్పాను అని ప్రేమ అంటుంది.. ఏం మాట్లాడుతున్నారే ఏంది మీరు చెప్పేది అర్థం కావడం లేదు అని వేదవతి అంటుంది.. రామరాజు మాత్రం అమూల్యను ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అమూల్యను అసలు పెళ్లి పెట్టుకొని నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు అని అందరు గుచ్చి గుచ్చి అడుగుతారు. ధీరజ్ ప్రేమనే కదా బయటకు తీసుకొని వెళ్ళింది అని అంటాడు. దానికి ప్రేమ వదినకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు అని అమూల్య అంటుంది.. మరి ఎవరు తీసుకొని వెళ్ళమన్నారు అని అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు. శ్రీవల్లి తన పేరు ఎక్కడ చెప్తుంది అని భయపడిపోతూ ఉంటుంది.. కానీ అమూల్య మాత్రం శ్రీవల్లి పేరు చెప్పదు. శ్రీవల్లి తన పేరు ఎక్కడ బయటపడిపోతుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నన్ను బయటకు తీసుకెళ్లింది ఎవరో కాదు నేనే వెళ్ళను వాడు నన్ను చివరిగా మాట్లాడాలి అని పిలిస్తే గుడ్డిగా నమ్మి వెళ్లాను. కానీ వాడు నాకు కిడ్నాప్ చేశాడు అని అమూల్య శ్రీవల్లి పేరు బయటకు తీసుకురాకుండా చెప్తుంది. అయితే శ్రీవల్లి అమ్మయ్య నా పేరు చెప్పలేదు సేఫ్ అని అంటుంది.
ప్రేమ తాళి వేసుకుని రమ్మని చెప్పడం వల్లే ఇదంతా జరిగింది అని అందరూ ప్రేమని తిడతారు. కానీ నర్మద మాత్రం ప్రేమకి సపోర్ట్ గా నిలుస్తుంది.. ఇందులో ప్రేమ చేసిన తప్పేంటి..? తను అమూల్య జీవితం మీద మచ్చ వెయ్యాలని అనుకున్నాడు. కానీ ప్రేమ అలా చెప్పడం వల్ల వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని అందరూ సైలెంట్ అయ్యారు.. ఇందులో ప్రేమ తప్పు ఎలా అవుతుంది అని నర్మదా ముందుకు వచ్చి అడుగుతుంది.. ప్రేమ తాళి వేసుకొని చెప్పడం వల్లే కదా నాన్నకు గుండెపోటు వచ్చింది ఇవన్నీ ప్రేమ వల్ల జరిగినవి అని చెందు అంటాడు. శ్రీవల్లి కూడా నర్మదా ప్రేమల వైపే వెళుతుంది.. మొత్తానికి అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పినందుకు ప్రేమ అడ్డంగా ఇరుకుంటుంది..
కానీ రామరాజు మాత్రం తన కూతురు చేసింది మంచి పని అనుకుంటాడు.. మెడలో తాళి వేసుకోకుండా వచ్చినట్టే ఈపాటికి నేను ప్రాణాలతో ఉండే దాని కాదు అని అమూల్య అంటుంది.. నా జీవితం మీద మచ్చ వెయ్యాలని చూసాడు. నా ఇంటి పరువుని తీయాలని చూసాడు. అలా చేసుకోకుండా ఉంటే కచ్చితంగా నేను తప్పు చేస్తున్న దాన్ని అయ్యే దాన్ని.. మా నాన్నగారి కుటుంబం గురించి పరువు గురించి ఆలోచించాను కాబట్టే ప్రేమ వదిన చెప్పింది కరెక్టే అని అనుకున్నాను ఇందులో వదిన తప్ప ఏమీ లేదు అని అమూల్య అంటుంది. ఇక తర్వాత అందరూ భోజనం చేద్దాం పదండి అని రామరాజు అంటాడు. ప్రేమ ధీరజ్ తో మాట్లాడడానికి ప్రయత్నించిన సరే ధీరజ్ మాత్రం తనని అసహ్యించుకుంటాడు..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నర్మద షాకింగ్ నిర్ణయం.. జీవితంలో ఆ తప్పు చెయ్యను..
ఆ తర్వాత ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమ చెప్పిన మాటని వినకుండా తనని అసహ్యించుకుంటాడు.. ప్రేమ ఎంత చెప్తున్నా సరే నువ్వు చేసిన పనికి నిన్ను ప్రేమించాలని అనిపించడం లేదు. పెళ్లి పీటల నుంచి లేచిపోయిన నిన్ను ప్రేమించాను చూడు అది నేను చేసిన తప్పు. నీకు నాలాంటి వాళ్ళు కాదు ఆ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ అంటూ ప్రేమ గురించి ధీరజ్ దారుణంగా మాట్లాడుతాడు.. నీ మొహం కూడా నాకు చూపించడానికి వీల్లేదు అని చెప్పేసి వెళ్తాడు. ఇదంతా విన్న నర్మదా ధీరజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని అడుగుతుంది. నేనేం మాట్లాడాలో నాకు బాగా తెలుసు వదిన మీరు ఏమి ఈ విషయాల్లో కల్పించుకోవద్దు అని ధీరజ్ అంటాడు.. ప్రేమని నర్మద ఎంత ఓదార్చిన సరే ప్రేమ మాత్రం ధీరజ్ నన్ను బాధ పెట్టాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీవల్లి మాత్రం తను వేసిన ప్లాను సక్సెస్ అయింది అని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…