E-Paper
Advertisement

Redmi Note 14 5G: విద్యార్థులు, ఉద్యోగులు కోసం బెస్ట్ చాయిస్.. రెడ్మి నోట్ 14 5G సేల్ ప్రారంభం

Redmi Note 14 5G: విద్యార్థులు, ఉద్యోగులు కోసం బెస్ట్ చాయిస్.. రెడ్మి నోట్ 14 5G సేల్ ప్రారంభం

Redmi Note 14 5G: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ అనే పేరు వినియోగదారుల మధ్య ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తక్కువ ధరల్లో నమ్మకమైన పనితీరు, రోజువారీ ఉపయోగానికి సరిపడే ఫీచర్లు, అందరికీ అందుబాటులో ఉండే మోడల్స్ అందించడం ఈ బ్రాండ్ గుర్తింపు. ముఖ్యంగా రెడ్‌మీ నోట్ సిరీస్ విడుదలైన ప్రతీసారి టెక్ వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులైనా ఎన్నుకునే ఫోన్ బ్రాండ్‌గా రెడ్‌మీ ఎదిగింది. అందుకే కొత్త మోడల్ ప్రకటించిన ప్రతీసారి మార్కెట్‌లో చర్చలు వేగంగా సాగుతాయి.

డిజైన్ క్లిన్ అండ్ కంఫర్టబుల్ ఫీల్

డిజైన్ విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 14 5జి చేతిలో పట్టుకున్న వెంటనే క్లిన్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ ఇస్తుంది. స్లిమ్ బాడీ, ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ స్టైల్ వలన గ్రిప్ బాగా ఉంటుంది. వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండటం ఫోన్‌ని అందంగా కనిపించేలా చేస్తుంది, ఫింగర్‌ప్రింట్స్ కనిపించకుండా తగ్గిస్తుంది. కెమేరా ఐలాండ్ డిజైన్ మొత్తం లుక్‌కు కొత్త ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. బటన్ ప్లేస్‌మెంట్ సరైనస్థానంలో ఉండటం, ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్ రిస్పాన్స్ రావడం కన్‌స్ట్రక్షన్ క్వాలిటీని చూపిస్తుంది. మొత్తం చూసినప్పుడు, గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్ లో క్లియర్ అప్‌డేట్ కనిపిస్తుంది.

అమోలేడ్ డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 14 5జి లో ఉన్న అమోలేడ్ డిస్‌ప్లే రంగులు, విజువల్స్‌ని క్లియర్‌గా చూపిస్తుంది. హై రిఫ్రెష్ రేట్ వలన స్క్రోలింగ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ మరియు వీడియో స్ట్రీమింగ్ స్మూత్‌గా అనిపిస్తుంది. బ్రైట్నెస్ లెవెల్ ఎక్కువగా ఉండటం వలన బయట ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్‌లో కలర్ డెప్త్, కంట్రాస్ట్ బాగా పనిచేయడం వల్ల మూవీ వాచ్ చేసే సమయంలో స్క్రీన్ ఇంప్రెసివ్‌గా ఉంటుంది.

Also Read: iQOO 15 Smartphone: ఐక్యూఓ 15 పై రూ.15వేల వరకు డిస్కౌంట్.. ఇండియా సేల్ ప్రారంభం, పూర్తి వివరాలు

200ఎంపి ఏఐ మెయిన్ కెమెరా

కెమెరా పనితీరు విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 14 5జి లో ఉన్న 200ఎంపి ఏఐ మెయిన్ కెమెరా డేలైట్ ఫోటోల్లో మంచి క్లారిటీని ఇస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ మెరుగ్గా ఉండటం వలన రంగులు నేచురల్‌గా కనిపిస్తాయి. లో-లైట్ మోడ్‌లో కూడా ఫోటోలు బ్రైట్‌గా రావడం యూజర్ల రియాక్షన్‌ ప్రకారం ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా చెప్పవచ్చు. అల్ట్రా వైడ్ కెమేరా ట్రావెల్, ల్యాండ్‌స్కేప్ షాట్స్‌లో వైడ్ కవర్ ఇస్తుంది. ఫ్రంట్ కెమేరా సెల్ఫీస్‌లో సాఫ్ట్ స్కిన్ టోన్, స్పష్టమైన అవుట్‌పుట్ అందిస్తుంది, సోషల్ మీడియా యూజ్‌కి సరిపోతుంది.

డిమెన్సిటీ 7300 చిప్‌సెట్

పర్‌ఫార్మెన్స్ వైపు చూస్తే, డిమెన్సిటీ 7300 చిప్‌సెట్ రెడ్‌మీ నోట్14 5జి కి స్పీడ్ అందిస్తోంది. యాప్స్ ఓపెన్ టైం తక్కువగా ఉండటం, మల్టీటాస్కింగ్ స్విచింగ్ వెంటనే జరగడం, మీడియం గేమింగ్ సమయంలో కూడా స్మూత్ రిజల్ట్స్ రావడం ఈ ప్రాసెసర్ పవర్‌ని చూపిస్తుంది. 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజ్ డైలీ యూజ్‌లో లార్జ్ ఫైల్స్, వీడియోలు మరియు యాప్ డేటాను హ్యాండిల్ చేయడంలో సపోర్ట్ ఇస్తాయి. హీటింగ్ కంట్రోల్ సిస్టమ్ మెరుగ్గా పనిచేయడం వల్ల లాంగ్ సెషన్స్‌లో కూడా యూజ్ స్టేబుల్‌గా ఉంటుంది.

బ్యాటరీ .. ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా యూజ్

బ్యాటరీ విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 14 5జి లో ఉన్న లార్జ్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వీడియో వాచ్ చేసినా, సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్నా, బ్రౌజింగ్ ఎక్కువసేపు చేసినా పవర్ డ్రాప్ నెమ్మదిగా ఉంటుంది. 45W ఫాస్ట్ చార్జింగ్ ఉండటం వలన తక్కువ టైంలో ఎక్కువ చార్జ్ పొందటం యూజర్లకు కన్వీనియంట్ గా ఉంటుంది.

హైపర్ ఓఎస్‌తో రన్ సాఫ్ట్‌వేర్

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, రెడ్‌మీ నోట్ 14 5జి ఆండ్రాయిడ్ 14 బేస్ మీద హైపర్ ఓఎస్‌తో రన్ అవుతోంది. యూజర్ ఇంటర్‌ఫేస్ క్లీన్‌గా ఉండటం, అనిమేషన్స్ స్మూత్‌గా కనిపించడం వలన ఫోన్ యూజ్ అనుభవం సింపుల్‌గా ఉంటుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ రెగ్యులర్‌గా అందడం, డివైస్‌పై యూజర్ల నమ్మకాన్ని పెంచుతోంది.

ఇండియాలో ధర ఎంతంటే?

రెడ్‌మీ నోట్ 14 5జి భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయింది. విడుదల తర్వాత టెక్ యూజర్ల దృష్టిని ఆకర్షించిన ఈ మోడల్ ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో సేల్‌లో అందుబాటులో ఉంది. 6జిబి ర్యామ్ ప్లస్ 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499, అలాగే 8జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.18,499 గా ప్రకటించబడింది. ఈ మోడల్ బడ్జెట్ యూజర్లకు ఒక ప్రాక్టికల్ చాయిస్‌గా కనిపిస్తోంది. ధర, ఫీచర్ల పరంగా ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇవ్వగల మోడల్ అనే అభిప్రాయం వెలువడుతోంది.

Related News

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

Big Stories

×