E-Paper
Advertisement

Telangana Politics: పవన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే సినిమాలు ఆడనివ్వం- మంత్రి కోమటిరెడ్డి

Telangana Politics:  పవన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేకుంటే సినిమాలు ఆడనివ్వం- మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Telangana Politics: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పార్టీ సీరియస్ అయ్యింది. ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆయన సినిమాలు ఆడనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. తన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు

Advertisement

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనికిపై అధికార పార్టీ నేతలు ఒకొక్కరుగా రియాక్ట్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ  నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.  తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.

రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 13 సంవత్సరాలు అవుతోందన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణను అవమానపరచవద్దని, పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెబితే తెలంగాణ ప్రజలు క్షమిస్తారని అన్నారు.  పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు.

Advertisement

క్షమాపణ చెప్పకుంటే సినిమాలు ఆడనివ్వం-కోమటిరెడ్డి

తెలిసి తెలియక ఆయన మాట్లాడారా? కావాలనే తెలంగాణ ప్రజలను అవమానపరచాలని అనుకున్నారో తెలీదన్నారు. క్షమాపణలు చెబితే ఆయన సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుందని, చెప్పకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో రిలీజ్ కావన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ఈ విషయం చెబుతున్నానని వెల్లడించారు.

ఈ విషయానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని, ఆయన్ని సూపర్‌మేన్ గా వర్ణించారు. అంతేకాదు ఆయన వివాదాలకు దూరంగా ఉంటారన్నారు. మెచ్యూరిటీ లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని మరొక మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇరు ప్రాంతాలు బాగుండాలని తాము ఎన్నో సందర్భాలు చెప్పామని, అన్నదమ్ములుగా విడిపోయామని అన్నారు.

ALSO READ: ముంచుకొస్తున్న ముప్పు.. ఓవైపు వర్షం.. మరోవైపు చలి

మేము మంచిగా బతుకుతుంటే.. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని వివరించారు. మైలేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేసినట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని, అందరికీ మంచిది అవుతుందన్నారు.

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేకుంటే సినిమాలు ఆడనిచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. పవన్ కళ్యాణ్ అవకాశవాది మాదిరిగా అనాలోచిత ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

పవన్ కళ్యాణ్‌ను గెలిపించడం వల్ల గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని జనసేన నేతలు పవన్ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది.

 

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×