E-Paper
Advertisement

Redmi Note 15 5G: భారత్‌లో రెడ్‌మీ నోట్ 15 5G లాంచ్ కన్ఫర్మ్.. 108MP కెమెరాతో పవర్‌ఫుల్ ఫీచర్లు!

Redmi Note 15 5G: భారత్‌లో రెడ్‌మీ నోట్ 15 5G లాంచ్ కన్ఫర్మ్.. 108MP కెమెరాతో పవర్‌ఫుల్ ఫీచర్లు!
Advertisement

Redmi Note 15 5G: ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం షావోమి తన రెడ్‌మి నోట్ సిరీస్‌ను మరింత బలోపేతం చేేసే క్రమంలో త్వరలో ‘Redmi Note 15 5G’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటికే లాంచ్ తేదీతో పాటు, ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా 108MP కెమెరా, కర్డ్వ్ AMOLED డిస్‌ప్లే వంటి ప్రీమియమ్ స్పెసిఫికేషన్లు ఈ ఫోన్‌పై అంచనాలను పెంచుతున్నాయి.

భారత్‌లో విడుదల ఎప్పుడు?

షావోమి వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్‌మీ నోట్ 15 5G జనవరి 6, 2026న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌లో ‘Faster, Stronger, Simply Better’ అనే ట్యాగ్‌లైన్‌ను కంపెనీ ఉపయోగించింది. లాంచ్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉండనుంది.

Advertisement

Also Read: అత్యంత సన్నని ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.15,000 వరకు డిస్కౌంట్.. మిస్ అయితే లాసే భయ్యా!

ఏమేం ఫీచర్లు ఉన్నాయంటే:

డిస్‌ప్లే విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల కర్వ్డ్ AMOLED స్క్రీన్ అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ను సపోర్ట్ చేయనుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్‌తో రానున్న ఈ డివైస్‌కు IP66 రేటింగ్ కూడా ఉండటం విశేషం.

Advertisement

ఇక పర్ఫార్మెన్స్ కోసం రెడ్‌మీ నోట్ 15 5Gలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఇది 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లతో రానుంది. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఈ ఫోన్ HyperOS 2పై అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుందని సమాచారం.

కెమెరా, బ్యాటరీ వివరాలిలా:

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 108MP ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇవ్వనుంది. అయితే సెకండరీ కెమెరా వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా.

ధర ఎంతంటే?

రెడ్‌మీ నోట్ 15 5G ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. 5,520mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. ఇకపోతే ప్రస్తుతం Redmi Note 15 5G ధరపై షావోమి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ రూ.22,000 నుంచి రూ.25,000 మధ్యలో భారత మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితమైన ధర వివరాలు తెలుసుకోవాలంటే లాంచ్ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: బ్యాటరీ మాన్‌స్టర్ వచ్చేస్తోంది.. 9000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో ఐకూ కొత్త ఫోన్ విడుదలకు సిద్ధం!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×