iQOO Z11 Turbo: ఐకూ నుంచి త్వరలో రాబోయే iQOO Z11 Turbo స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్‌ను 2026 జనవరిలో చైనా మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫ్లాగ్‌షిప్-స్థాయి ఫీచర్లతో ఈ డివైస్ యూజర్లలో ఆసక్తిని పెంచుతోంది.
ఐకూ Z11 టర్బో లో 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 144Hz వరకు హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. గేమింగ్, స్క్రోలింగ్ సమయంలో స్మూత్ అనుభవం అందించేలా ఈ డిస్‌ప్లే రూపొందించారని లీక్‌లు సూచిస్తున్నాయి. అలాగే తాగా టీజర్‌ల ప్రకారం ఈ ఫోన్ బ్లూ కలర్ ఫినిషింగ్‌తో పాటు మెటల్ ఫ్రేమ్ డిజైన్‌లో రానుంది. అలాగే IP68, IP69 రేటింగ్‌లతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చని అంచనా.
Also Read: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ‘ఘోస్ట్ పెయిరింగ్’తో వాట్సప్ హ్యాక్, ఆదమరిస్తే ఖాతా మొత్తం ఖాళీ!
ఇక కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండగా, ఇందులో 200MP సెన్సార్ లేదా OIS సపోర్ట్‌తో 50MP Sony LYT-600 కెమెరా ఉండే అవకాశముంది. ముందు భాగంలో 16MP లేదా 32MP సెల్ఫీ కెమెరా ఇవ్వవచ్చని సమాచారం.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఐకూ Z11 టర్బోలో భారీ సిలికాన్ బ్యాటరీపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇది 7600mAh కంటే ఎక్కువగా లేదా 9000mAh వరకు ఉండే అవకాశం ఉంది. దీనికి 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తారు.
పనితీరులో ఈ ఫోన్‌ను క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC ప్రాసెసర్‌తో అందించనున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగంతో పాటు హెవీ యూజ్‌కూ సరిపడే పనితీరును ఇస్తుంది. దీంతోపాటు ఈ ఐకూ Z11 టర్బో ఫోన్ 16GB వరకు RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి ఈ ఫోన్ 2026 జనవరిలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశం లేదా గ్లోబల్ మార్కెట్‌లకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయితే, భారత్‌లో విడుదలైతే, బేస్ వేరియంట్ ధర సుమారు రూ.26,999 ఉండొచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: అత్యంత సన్నని ఫోన్‌పై భారీ ఆఫర్.. రూ.15,000 వరకు డిస్కౌంట్.. మిస్ అయితే లాసే భయ్యా!