E-Paper
Advertisement

Menstruation: ఇంట్లో నెలసరి సమయంలో నిత్య పూజలు చేయవచ్చా..?

Menstruation: ఇంట్లో నెలసరి సమయంలో నిత్య పూజలు చేయవచ్చా..?
Advertisement

Menstruation: సాధారణంగా ప్రతి ఇంట్లో నిత్య పూజలు చేస్తుంటారు. అయితే ఇంట్లో ఎవరికైనా నెలసరి వచ్చినప్పుడు పూజలు చేయవచ్చా లేదా అనే అనుమానం వస్తుంటుంది. కొందరు చేయవచ్చు అంటుంటారు. కొందరు చేయకూడదు అంటుంటారు. అందులో ఏది నిజం..? ఏది అబద్దం..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయాలు మరియు ధర్మశాస్త్రాల ప్రకారం, నెలసరి (Menstruation) సమయంలో కొన్ని నియమాలను పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయంలో ఉన్న ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నేరుగా పూజ చేయడం: నెలసరి ఉన్న మూడు లేదా నాలుగు రోజుల పాటు దేవుడి పటాలను తాకడం, దీపారాధన చేయడం లేదా పూజా గదిలోకి వెళ్లడం నిషిద్ధంగా భావిస్తారట. ఈ సమయంలో శారీరక విశ్రాంతికి మరియు శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతోందట.

మానసిక పూజ: శారీరకంగా పూజ చేయకూడదు కానీ, మనసులో దేవుడిని తలుచుకోవడానికి, నామస్మరణ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదట. భగవంతుడిని స్మరించడానికి శారీరక స్థితితో సంబంధం లేకుండా మానసికంగా నిరంతరం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

స్తోత్రాలు మరియు మంత్రాలు: నెలసరి సమయంలో ప్రత్యక్షంగా పూజ చేయడం శాస్త్రం విరుద్దం అని చెప్పారు కానీ భక్తి గీతాలు వినడం.. మనసులోనే శ్లోకాలు చదువుకోవడం లాంటివి చేయవచ్చట. అయితే, పూజా పుస్తకాలను నేరుగా తాకకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అవసరమైతే ఫోన్లలో చూసి చదువుకోవచ్చట.

నైవేద్యం మరియు వంట: సాంప్రదాయకంగా ఈ సమయంలో దేవుడికి నైవేద్యం వండటం లేదా పూజా సామాగ్రిని తాకడం చేయకూడదట. ఇంట్లో వేరే వారు ఎవరైనా ఉంటే వారితో దీపారాధన చేయించడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.

ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు పూజలు చేయవచ్చా..?: ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు పూజ చేయవచ్చట.. నెలసరిలో ఉన్న వారు కాకుండా, ఇంట్లో ఉన్న భర్త, పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు యధావిధిగా దీపారాధన లేదా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చట. నెలసరిలో ఉన్న వారు పూజా గదిలోకి వెళ్లకుండా, పూజా సామాగ్రిని లేదా దేవుడి పటాలను తాకకుండా ఉంటే సరిపోతుందట. మిగిలిన వారు స్నానం చేసి శుచిగా పూజ చేసుకోవచ్చట నేవైద్యం కూడా పూజ చేసే వారే స్వయంగా రెడీ చేసుకోవాలట. ఇంట్లో దీపం వెలిగించే ఆచారం ఆగిపోకూడదు కాబట్టి, ఆ సమయంలో మరొకరు దీపారాధన చేయవచ్చని శాస్త్రం చెప్తుందట.

శాస్త్రాల ప్రకారం, అశౌచం (తీటు) అనేది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది కానీ మొత్తం ఇంటికి లేదా ఇతర వ్యక్తులకు వర్తించదు. కాబట్టి మిగిలిన వారు భక్తితో పూజను కొనసాగించవచ్చట. పూర్వకాలంలో మహిళలకు ఈ సమయంలో పూర్తి విశ్రాంతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నియమాలను పెట్టారట. ప్రస్తుత కాలంలో చాలామంది దీనిని వ్యక్తిగత నమ్మకం మరియు కుటుంబ ఆచారాలను బట్టి పాటిస్తున్నారు. మీ ఇంట్లో పెద్దలు పాటించే పద్ధతులను గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిది. సాధారణంగా ఐదవ రోజు స్నానం చేసిన తర్వాత తిరిగి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పంచ మహా కన్యలు అని ఎవరిని పిలుస్తారు..? వారికున్న ప్రత్యేకలు ఏంటి..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×