E-Paper
Advertisement

భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో Redmi Turbo 5.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!

భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ఫీచర్లతో Redmi Turbo 5.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్!
Advertisement

Redmi Turbo 5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ భారతీయ మొబైల్ ప్రియుల కోసం సరికొత్త ఫోన్‌ను తీసుకువస్తోంది. Redmi Turbo 5 పేరుతో సరికొత్త మోడల్‌ను ఈ నెలలోనే దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి టర్బో సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇది రెడ్‌మీ బ్రాండ్ నుంచి వస్తున్న అత్యంత వేగవంతమైన ఫోన్ మాత్రమే కాదు.. ఇప్పటివరకు లేని విధంగా భారీ బ్యాటరీతో వస్తోందని కంపెనీ పేర్కొంది.

జూన్ 16న గ్రాండ్ ఎంట్రీ:

Redmi Turbo 5 ఈనెల 16న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని రెడ్‌మీ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక పేజీ కూడా ప్రత్యక్షమైంది. దీన్ని బట్టి ఈ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ ఫోన్ నలుపు, తెలుపు రంగుల్లో లభించనుంది.

భారీ ర్యామ్:

Advertisement

రెడ్‌మీ టర్బో 5 పనితీరు విషయానికి వస్తే.. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. అలాగే ఇందులో గరిష్టంగా 24GB వరకు RAM సపోర్ట్ ఉంటుంది. దీంతోపాటు 12GB వరకు వర్చువల్ RAM కావడం గమనార్హం. అంటే.. ఈ ఫోన్ 12 GB ఫిజికల్ RAM వేరియంట్‌తో రానుంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కూలింగ్ టెక్నాలజీని కూడా జోడించారు.

Also Read: గూగుల్‌లో మీకంటూ ఒక ప్రత్యేక ప్రొఫైల్‌.. ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా?

పిక్చర్ క్వాలిటీ అదిరిపోద్ది:

Advertisement

చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఫీచర్లను గమనిస్తే.. ఇది 6.59 ఇంచుల AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, మెరుగైన బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 20MP కెమెరాను అందించారు.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్:

ఈ ఫోన్‌లోని మరో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. రెడ్‌మీ ఫోన్లలోనే అత్యంత భారీ బ్యాటరీ అయిన 7,560 mAh సామర్థ్యం గల బ్యాటరీని ఇందులో అమర్చారు. దీనికి తోడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అదిరిపోయే ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనేది జూన్ 16న తెలియనుంది.

Also Read: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!

Related News

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

Big Stories

Advertisement
×