E-Paper
Advertisement

రూ.30 వేల బడ్జెట్‌లో.. ఐపీ69 రేటింగ్‌, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో కుమ్మేయడానికి వచ్చేస్తోన్న రెడ్‌మీ కొత్త ఫోన్!

రూ.30 వేల బడ్జెట్‌లో.. ఐపీ69 రేటింగ్‌, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో కుమ్మేయడానికి వచ్చేస్తోన్న రెడ్‌మీ కొత్త ఫోన్!
Advertisement

Redmi Turbo 5: భారత్‌లోని తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి రెడ్‌మీ సరికొత్త Turbo 5 మోడల్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో వస్తున్న ఈ ఫోన్ త్వరలోనే ఇండియాలో విడుదల కానుంది. టర్బో సిరీస్ నుంచి భారత్‌లోకి వస్తున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. జూన్ మొదటి వారంలోనే ఇది మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మెరుపు వేగంతో ఛార్జింగ్:

ఈ Turbo 5లో ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీ. దీనిలో ఏకంగా 7560mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవ్వడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. దీనివల్ల గేమ్స్ ఆడేవారికి, ఎక్కువ సమయం ఫోన్ వాడేవారికి బ్యాటరీ సమస్య అస్సలు ఉండదు.

గేమింగ్‌కు కేరాఫ్ అడ్రస్:

Advertisement

Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచుల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీనివల్ల వీడియోలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, స్మూత్‌గా కనిపిస్తాయి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Also Read: సమ్మర్‌లో ఫ్రిడ్జ్ కరెంట్ బిల్లు హాఫ్ అవ్వాలంటే.. ఈ సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలు!

కెమెరా విశేషాలివే:

Advertisement

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ప్రమోషనల్ చిత్రాల ప్రకారం.. ఈ ఫోన్ ఫ్లాట్ రేర్ ప్యానెల్‌తో, బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో చాలా క్లాసిక్‌గా కనిపిస్తోంది. అంతేకాదు.. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ68 రేటింగ్ కూడా ఉండనుంది.

ధర ఎంత ఉండొచ్చు?

చైనా మార్కెట్లో ఈ ఫోన్ (12GB RAM + 256GB స్టోరేజ్) ప్రారంభ ధర 2299 యువాన్లుగా ఉంది. మన భారత కరెన్సీలో ఇది సుమారు రూ.30,000 వరకు ఉండవచ్చు. ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరలోనే సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ Redmi Turbo 5 మంచి ఆప్షన్ కానుంది.

Also Read: మీ ఇంట్లో బోరు నీళ్లు వాడుతున్నారా? ఉప్పుదనం, బ్యాక్టీరియాకు చెక్ పెట్టే బెస్ట్ ప్యూరిఫైయర్లు ఇవే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×