E-Paper
Advertisement

మెట్రో స్టేషన్ల బంద్.. లంచ్ టైంలో తేల్చండి, నేనే రంగంలోకి దిగుతా- సీజేఐ

మెట్రో స్టేషన్ల బంద్.. లంచ్ టైంలో తేల్చండి, నేనే రంగంలోకి దిగుతా- సీజేఐ
Advertisement

Supreme Court: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని అనే మెట్రో రైల్వే స్టేషన్లను మూసి వేసింది. దీన్ని సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మధ్యాహ్న భోజన విరామం లోపు స్టేషన్‌ను తిరిగి తెరవాలని తెలిపింది. లేకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ని హెచ్చరించింది.

ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సీజేఐ గరంగరం- ఢిల్లీలో సోమవారం నుంచి కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో  విద్యార్థుల నిరసనలకు దిగారు. దీని కారణంగా  ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. ఫలితంగా ఉద్యోగులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది.

Advertisement

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిటిషన్-మెట్రో స్టేషన్ల మూసివేతతో న్యాయవాదులు-కోర్టు సిబ్బంది ఎదురైన సమస్యలను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లింది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు దాదాపు 16 మెట్రో స్టేషన్‌తోపాటు పలు ఇతర స్టేషన్లను మూసి వేయడం వల్ల కోర్టుకు రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు.

న్యాయవాదులు, పిటిషన్లు, రిజిస్ట్రీ సిబ్బందికి పరిమిత సంఖ్యలో అనుమతించాలని ఆయన కోరారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కోరారు.    సుప్రీంకోర్టుకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఉన్నవారిని, రిజిస్ట్రీ సిబ్బందిని మెట్రో స్టేషన్‌లో దిగేందుకు అనుమతించాలన్నారు.

Advertisement

భోజనం సమయానికి తేల్చాలన్న సీజేఐ-  రైలు దిగిన తర్వాత ఎగ్జిట్ పాయింట్ వద్ద వారిని తనిఖీ చేసి బయటకు పంపవచ్చని వికాస్ సింగ్ చెప్పారు. దీనిపై సీజేఐ స్పందించారు.  మధ్యాహ్న భోజన విరామ సమయానికి సమస్య పరిష్కారం కావాలని, లేకుంటే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. దీనిపై మెట్రో అధికారులతో మాట్లాడాలని సుప్రీంకోర్టు యంత్రాంగాన్ని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.

ALSO READ: నీట్ రచ్చ.. పార్లమెంటు ఉభయసభలు మళ్లీ వాయిదా

ఇవాళ న్యాయవాదులు కోర్టుకు హాజరు కాలేక పోయిన కేసుల్లో ఎలాంటి ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆదేశించామని అన్నారు. గడిచిన నాలుగు రోజులుగా సోషల్ మీడియా పార్టీ సీజేపీ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే.

Related News

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో బైకర్ బిజీ బిజీ.. వీడియో వైరల్

NEET రచ్చ.. పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ వాయిదా.. అసలేం జరుగుతోంది?

సీజేపీ నిరసనకారులకు ఆహారం ఎవరిస్తున్నారు? అజ్ఞాత దాతలు వెనుక అసలు కథ

సీజేపీ ఆందోళనలు తీవ్రతరం.. రూ.10 కోట్ల ఆఫర్, బీజేపీ ఎంపీ సంచలన వీడియో

దిగివచ్చిన మోడీ? నీట్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన, విద్యార్థులు శాంతిస్తారా?

ఘోరం.. నగల కోసం వృద్ధురాలిని చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి, ఆపై..

బెంగుళూరు ట్రిఫుల్ మర్డర్ కేసు.. చంపింది ఇద్దరు కాదు, ఏఐతో కలిసి ముగ్గురు-షాకైన పోలీసులు

Big Stories

Advertisement
×