E-Paper
Advertisement

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!
Advertisement

Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు యుద్ధ మేఘాలుగా మారుతోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు ముగియడంతో, అగ్రరాజ్యం ఇరాన్‌పై ఎటువంటి చర్య తీసుకోబోతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలపై స్పందించిన ట్రంప్, ఆ మార్గాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీనికి కొనసాగింపుగా సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా “బలంతో కూడిన శాంతి” (Peace through Strength) అని పేర్కొంటూ తన ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.

ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ (IRGC) ఏమాత్రం లెక్కచేయకుండా, వినూత్న రీతిలో స్పందించింది. గతంలో ట్రంప్ నిర్వహించిన ‘ది అప్రెంటిస్’ టీవీ షోలో “యు ఆర్ ఫైర్డ్” (మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేశాం) అనే పదాన్ని ప్రయోగిస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్రంప్ శైలిని అనుకరిస్తూనే, అమెరికా అల్టిమేటమ్‌లకు భయపడే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా క్షీణించాయనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

Advertisement

భౌగోళికంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేత అనేది ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఒకవేళ వాషింగ్టన్-టెల్ అవీవ్ కూటమి తమపై సైనిక చర్యకు దిగితే, ఈ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తామని టెహ్రాన్ ప్రభుత్వం బెదిరిస్తోంది. ఇది కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా, అంతర్జాతీయ ఇంధన సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఖారీ స్పందిస్తూ, అమెరికా గనుక తమ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు మాత్రమే కాకుండా, అమెరికా మిత్రదేశాల చమురు కేంద్రాలు, సమాచార వ్యవస్థలు, నీటి శుద్ధి ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ప్రతిసవాల్ విసిరారు. “కంటికి కన్ను” అన్నట్లుగా ఇరాన్ ఇంధన గ్రిడ్‌పై దాడి జరిగితే, మొత్తం ప్రాంతంలోని శక్తి వనరులను ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Also Read: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం..ఆపై బాదుడు, లీటర్ పెట్రోల్ రూ. 300

ప్రస్తుతానికి అగ్రరాజ్యం తన తదుపరి అడుగును చాలా వ్యూహాత్మకంగా వేస్తోంది. ట్రంప్ తన సందేశంలో “బలంతో శాంతి” అని పేర్కొనడం వెనుక, కేవలం హెచ్చరికలతో ఆగుతారా లేదా ప్రత్యక్ష దాడులకు దిగుతారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ యుద్ధం గనుక సంభవిస్తే, అది పశ్చిమాసియా రూపురేఖలను మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాలు, చమురు ధరలు ఆకాశాన్నంటేలా చేస్తుంది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ ‘మైండ్ గేమ్’ యుద్ధానికి దారితీస్తుందో లేక చర్చలతో సద్దుమణుగుతుందో వేచి చూడాలి.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×