Refrigerators Launch Feb 2026: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లు (Refrigerators)దర్శనమిస్తున్నాయి. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. కూరగాయాలు, పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటున్నారు. అయితే సాధారణ రోజులతో పోలిస్తే వేసవిలో ఫ్రిడ్జ్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి ఎండలు తీవ్రతరం కానుండటంతో పలువురు కొత్త రిఫ్రిజిరేటర్ల కోసం సెర్చ్ చేస్తున్నారు. వారి కోసం ప్రస్తుతం మార్కెట్ లోని టాప్ రిఫ్రిజిరేటర్లు ఏవి? వాటి ప్రధాన ఫీచర్లు? ధర ఎంత ఉండొచ్చు? అన్న వివరాలను ఈ కథనంలో ఇవ్వడం జరుగుతోంది.
మార్కెట్ లో మంచి గుడ్ విల్ ఉన్న రిఫ్రిజిరేటర్ కంపెనీల్లో హైయర్ (Haier) ఒకటి. ఈ కంపెనీ నుంచి ఫిబ్రవరి నెలకు గానూ కొత్త ఫ్రిడ్జ్ రాబోతోంది. Haier 185 L పేరుతో సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ను హైయర్ తీసుకురాబోతోంది. ఈ ఫ్రిడ్జ్.. 185 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం, 34 కేజీల బరువు, 197 W పవర్ వినియోగం, యాంటీ ఫంగల్ గాస్కెట్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. దీని ధర రూ. 11,990 కాగా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్రిడ్జ్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.
గోద్రేజ్ నుంచి కూడా తక్కువ బడ్జెట్ లో మంచి రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉంది. Godrej 180 L సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను రూ.13,990 అందుబాటులోకి తీసుకొచ్చింది. 35.2 కేజీల బరువు, యాంటీ బ్యాక్టీరియల్ గాస్కెట్ (Anti Bacterial Gasket), డైరెక్ట్ కూల్ టెక్నాలజీ, ఫిక్స్డ్ స్పీడ్ కంప్రెసర్ వంటి ఫీచర్లను ఈ ఫ్రిడ్జ్ కలిగి ఉంది.
డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ను కోరుకునే వారు Whirlpool కంపెనీకి చెందిన Whirlpool 265 L Frost Free Double Door రిఫ్రిజిరేటర్ ను పరిశీలించవచ్చు. ఇది 265 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం, డిజిటల్ ఇన్ వర్టర్, 60 కేజీల బరువు తదితర ఫీచర్లను కలిగి ఉంది. అయితే దీని ధర రూ. 27,740 కాగా, అమెజాన్ లో అందుబాటులో ఉంది.
తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కోరుకునే వారు.. Samsung 183 L ట్రై చేయవచ్చు. ఇది సింగిల్ డోర్ కలిగిన 4 స్టార్ రిఫ్రిజిరేటర్. 183 లీటర్ల సామర్థ్యం, డైరెక్ట్ కూల్ సిస్టమ్, 36 కేజీల బరువు, డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో రూపొందింది. ఈ ఫ్రిడ్జ్ ధర రూ. 15,990. అమెజాన్ లో పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
రూ.20 వేలలో ఎల్జీ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కోరుకునేవారు LG 190 L 5 Star Refrigeratorను పరిశీలించవచ్చు. ఇది 190 లీటర్ల సామర్థ్యం కలిగిన సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. డైరెక్ట్ కూల్, స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, 33.5 కేజీల బరువు, 131 kw పవన్ వినియోగం వంటి ఫీచర్లను కలిగి ఉంది. రూ. 21,704 ధర కలిగిన ఈ ఫ్రిడ్జ్ ప్రస్తుతం ఫ్లిప్ కార్టులోనూ లభిస్తోంది.
Also Read: MG Windsor EV vs Tata Curvv EV: ఎంజీ విండ్సర్ ఈవీ vs టాటా కర్వ్ ఈవీ.. ఈ రెండింటిలో ఏది తోపు అంటే?