E-Paper
Advertisement

MG Windsor EV vs Tata Curvv EV: ఎంజీ విండ్సర్ ఈవీ vs టాటా కర్వ్ ఈవీ.. ఈ రెండింటిలో ఏది తోపు అంటే?

MG Windsor EV vs Tata Curvv EV: ఎంజీ విండ్సర్ ఈవీ vs టాటా కర్వ్ ఈవీ.. ఈ రెండింటిలో ఏది తోపు అంటే?
Advertisement

MG Windsor EV vs Tata Curvv EV Comparison:  ఇండియన్ మార్కెట్ లోకి రోజు రోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి.  ప్రజలను నుంచి ఈవీలకు ఎక్కువ మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఆటో మేకర్స్ కూడా ఈవీ కార్ల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. రీసెంట్ గా మార్కెట్ లోకి అదుంబాటులోకి వచ్చిన రెండు పాపులర్ బ్రాండ్లు ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ. రెండు కార్లు ప్రస్తుతం మార్కెట్ లో సత్తా చాటుతున్నాయి. వీటిలో ఏది బెస్ట్? ఎందకు? అనేది ఇప్పుడు చూద్దాం..

ఎంజీ విండ్సర్ ఈవీ vs టాటా కర్వ్ ఈవీ తేడాలు

⦿ బ్యాటరీ, రేంజ్: టాటా కర్వ్ ఈవీ 45kWh/55kWh బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఒకే ఛార్జ్ మీద ఏకంగా 500 కి.మీకి పైగా రేంజ్ ను అందిస్తుంది. అదే సమయంలో 70kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎంజీ విండ్సర్ ఈవీ 38kWh బ్యాటరీతో వస్తుంది. కర్వ్ ఈవీ 148-165 bhp పవర్ ను ఉత్పత్తి చేయగా, విండ్సర్ ఈవీ 134 bhp పవర్ ను అందిస్తుంది. ఎంజీ విండ్సర్ ఈవీ ఒకే ఛార్జ్ మీద 332 కి.మీ రేంజ్ ను అందిస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు: టాటా కర్వ్ ఈవీ కూపే SUV లుక్‌ తో  ఆకట్టుకుంటుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్‌ఫినిటీ సౌండ్ సిస్టమ్, గ్లాస్ రూఫ్‌ తో ప్రీమియం ఇంటీరియర్‌ను అందిస్తుంది. రెండూ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటాయి. వింగ్సర్ 15.6-అంగుళాల టచ్‌ స్క్రీన్, సోఫా మాదిరి వెనుక సీటును కలిగి ఉంటుంది. కర్వ్ భద్రతకు సంబంధించి 5-స్టార్ GNCAP సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉంది.

⦿ ప్రాక్టికాలిటీ, బూట్ ప్సేస్: ఎంజీ విండ్సర్ ఈవీ క్రాస్ ఓవర్ MPV తరహాలో ఉంటుంది. 604 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. 135 డిగ్రీస్ బ్యాక్ సీట్ రిక్లైనింగ్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ 500 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ధర, వేరియంట్లు: ఎంజీ విండ్సర్ ఈవీ  ప్రారంభ ధర రూ. 9.99 లక్షలుగా ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల వరకు ఉంటుంది.

Read Also:  యమహా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్లొచ్చంటే?

ఏది ఎవరికి బెస్ట్ అంటే?   

ఎంజీ విండ్సర్ ఈవీని విశాలమైన, సౌకర్యవంతమైన, సరసమైన ధరలో ఫ్యామిలీకి అనుకూలంగా ఉండే సిటీ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అటు నగర ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు సుదూర హైవే ప్రయాణాలకు స్టైలిష్, లాంగ్ రేంజ్ EV కోరుకునే వారికి, 5 స్టార్ రేటింగ్ కావాలనుకునే వారికి టాటా కర్వ్ EV  బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: యమహా నుంచి క్రేజీ స్కూటర్, లాంచింగ్ ఎప్పుడంటే

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×