E-Paper
Advertisement

Mahabubabad: వారిద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు.. అందుకే పార్టీ మారుతున్నా..?

Mahabubabad: వారిద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారు.. అందుకే పార్టీ మారుతున్నా..?
Advertisement

Mahabubabad: స్వేఛ్చ బ్యూరో: మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత(Maloth Kavitha), మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(MLA Banoth Shankar Naik) పార్టీ నాశనం చేస్తున్నారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఆరోపించారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో 36 వ వార్డు తరఫున మార్నేని వెంకన్న వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలాట..

అయితే పోటీలో ఉండేందుకు సిద్ధమవుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సూచన మేరకు నామినేషన్ దాఖలను ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. మా పార్టీ ఉద్యమకారులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆలోచన మేరకు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలాటగా సాగుతుందన్నారు. ఉద్యమం చేసినప్పుడు లేని వారి పెత్తనం ప్రస్తుతం పార్టీలో సాగుతుందన్నారు. ఉద్యమకారులకు విలువలు లేకుండా పోతుందన్నారు. కేటీఆర్ హామీ మేరకు నామినేషన్ దాఖలను ఉపసంహరించుకుంటున్నట్లుగా వెంకన్న మీడియాకు వివరించారు.

Advertisement

Also Read: Business Idea For Women: తక్కువ పెట్టుబడి-ఎక్కువ లాభం, ఇంట్టో ఉండే మహిళల కోసం డిజిటల్ బిజినెస్ ప్లాన్స్

ఆందోళన వ్యక్తం..

కేటీఆర్(KTR) మీద ఉన్న గౌరవంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, నా వార్డు ప్రజలు వాళ్ళందరితో చర్చించాకనే ఏ నిర్ణయమైన తీసుకుంటామన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మున్నూరు కాపు వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఒక్కరికి కూడా వార్డు కౌన్సిలర్ గా టికెట్ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కారణం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలవుతు కవితలేనని స్పష్టం చేశారు. అందుకు ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నారు.

Advertisement

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×