E-Paper
Advertisement

Jio Bharat J1 4G: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!

Jio Bharat J1 4G: జియో సంచలనం.. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు చుక్కలే.. ధర మరీ ఇంత తక్కువా!
Advertisement

Jio Bharat J1 4G : రిలయన్స్ జియో గతేడాది G సిరీస్ లైనప్‌లో అనేక ఫోన్లను దేశంలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన బ్రాండ్ వాల్యూ‌ను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జియో భారత్ సిరీస్ కింద కంపెనీ రెండు బడ్జెట్ 4జీ ఫోన్లను జియో భారత్ V2, V2 కార్బన్‌లను పరిచయం చేసింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం తాజాగా రియలన్స్ జియో ఇప్పుడు ఈ సిరీస్‌‌లో కొత్త ఫోన్ జియో భారత్ J1 ను విడుదల చేసింది. ఈ ఫోన్ సరికొత్త టెక్నాలజీలో రూపొందించిన కీప్యాడ్ ఫోన్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్ కంపెనీ ఇప్పుడు జియో భారత్ J1 4Gని మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 4G కీప్యాడ్ ఫోన్. ఇది కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో ప్రజలకు చేరువవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో జియో యాప్‌తో సహా అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా UPI లావాదేవీల కోసం JioPay, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం JioCinema యాప్స్ కూడా రన్ అవుతాయి. ఈ జియో కొత్త ఫోన్ చాలా చౌరన ధరలో అందుబాటులోకి రానుంది. దీనిని ప్రజలు సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అవుట్ డిస్‌ప్లే కూడా బెటర్‌గా కనిపిస్తుంది.

Advertisement

Also Read: Samsung Galaxy S23 Ultra Discount: ఇప్పుడే కొనండి.. రూ. 44 వేల డిస్కౌంట్.. సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్!

జియో భారత్ J1 4G ధర విషయానికి వస్తే గత సంవత్సరం జియో భారత్ V2, V2 కార్బన్ ఫోన్ల ధర రూ.999 మాత్రమే. కాగా భారత్ J1 4G ధర రూ.1,799. ఈ ఫోన్‌ను అమెజాన్‌లో సింగిల్ బ్లాక్/గ్రే కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. అలానే ఈ ఫోన్ బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Advertisement

జియో భారత్ J1 4G కొత్త డిజైన్‌తో వస్తుంది. ఫోన్ కొంచెం పెద్ద ఫారమ్ ఫ్యాక్టర్, పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో 2.8 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 2,500mAh పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది. పెద్ద బ్యాటరీ, స్క్రీన్‌ దీనిలో చెప్పుకోదగ్గ ఫీచర్లు. 4G ఫీచర్ ఫోన్‌లు బడ్జెట్‌లో మంచి వినోదాన్ని అందిస్తాయి. ఎందుకంటే ఇందులో జియో టీవీ సహాయంతో ప్రజలు హాయిగా టీవీని చూడవచ్చు.

జియో భారత్ J1 ఫోన్ జియో యాప్‌లు, సేవలతో వస్తుంది. ఇది UPI లావాదేవీల కోసం JioPay, కంటెంట్ స్ట్రీమింగ్ కోసం JioCinema,  ఇతర ఫీచర్లతో వస్తుంది. అలానే కొత్త జియో ఫోన్‌లు జియో సినిమా ప్రీ-ఇన్‌స్టాల్‌తో వస్తాయి. వినియోగదారులు జియో టీవీ యాప్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండు యాప్‌లు ఫోన్‌లో లైవ్ స్పోర్ట్స్, లైవ్ టీవీ కంటెంట్‌ను ఫ్రీగా చూసేందుకు యాక్సెస్ అందిస్తాయి.

Also Read: Flipkart-Amazon TV Offers: కూల్ కూల్ ఆఫర్స్.. ఈ 10 బ్రాండెడ్ టీవీలపై బిగ్ డిస్కౌంట్స్!

జియో భారత్ J1 4G ఫోన్ కోసం కంపెనీ రూ.123 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటుులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేయడం ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 14 జీబీ డేటా, జియో యాప్‌లు, సేవలను అందిస్తోంది. ఈ కీప్యాడ్ ఫోన్ మూడు 4జీ బ్యాండ్‌లను కలిగి ఉంది. ఇది జియోతో లాక్ చేయబడిన ఫోన్. అంటే దీనిలో జియో సిమ్ మాత్రమే ఉపయోగించగలరు.

Related News

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!

రూ.వెయ్యిలోపు బెస్ట్ గేమింగ్ ఇయర్ బడ్స్..వెంటనే కొనేయండి

Big Stories

Advertisement
×