BigTV English

Cryptocurrency Robbery| అమెరికా మహిళ నుంచి మూడు కోట్లు దొంగిలించిన భారతీయుడు.. ఎలా చేశాడంటే?

Cryptocurrency Robbery| అమెరికా మహిళ నుంచి మూడు కోట్లు దొంగిలించిన భారతీయుడు.. ఎలా చేశాడంటే?

Cryptocurrency Robbery| ఢిల్లీలోని తన ఇంట్లో కూర్చొని ఓ యువకుడు.. అమెరికాలోని ఓ మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 3 కోట్ల 30 లక్షలు కాజేశాడు. ఆ దొంగతనం చేసిన సొమ్ముని మరో ఘనకార్యం కోసం వినియోగించాడు. అయితే ఈ కేసులో పోలీసులు ఎంతో కష్టపడి అతడిని, అతని గ్యాంగ్ ని పట్టుకున్నారు.


ఎలా చేశాడంటే?..
పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో లీసా రోథ్ అనే మహిళతో ఢిల్లీలోని షంషాద్ గార్డెన్ ప్రాంతానికి చెందిన లక్ష్య విజ్ అనే 33 ఏళ్ల యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆమెతో తరుచూ మాట్లాడుతూ ఆమె లాప్ ట్యాప్ ని హ్యాక్ చేశాడు. ఆ తరువాత ఒక రోజు లీసా తన లాప్ ట్యాప్ ఉపయోగిస్తుండగా.. ఒక్కసారిగా ఆమె స్క్రీన్ బ్లాక్ అయింది. ఆమె స్కీన్ పై ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ కు కాల్ చేస్తే.. అవతలి వ్యక్తి తాను మైక్రోసాఫ్ట్ ఏజెంట్ అని చెప్పాడు. ఆమె తన ల్యాప్ ట్యాప్ లో వచ్చిన సమస్య పరిష్కారం కోసం ఆ వ్యక్తి చెప్పినట్లు చేసింది. అంతే ఆమె లాప్ ట్యాప్ లో ఉన్న మొత్తం డేటా అతను దొంగలించాడు.

ఆ లాప్ ట్యాప్ ఆమె పాస్ వర్డ్స్ ఉన్నాయి. దాని ద్వారా అమె ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా పాస్ వర్డ్స్ అతను దొంగలించాడు. ఆ తరువాత లెసా బ్యాంక్ అకౌంట్స్ ఆమె ఈ మెయిల్స్ లో ఉన్నట్లు తెలుసుకొని.. ఆమె బ్యాంక్ అకౌంట్ లో ఉన్న మొత్తం నాలుగు లక్షల డాలర్లు(రూ.3.3 కోట్లు) కాజేశాడు. ఆ మొత్తం సొమ్ముని లీసా అకౌంట్ నుంచి మరో ఇద్దరు భారతీయుల అకౌంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఒక బుకీ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ తరువాత లీసా తన బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.


అమెరికా పోలీసులు.. ఇండియాలోని సిబిఐకు ఈ కేసు అప్పగించారు. దీంతో విచారణ మొదలుపెట్టిన సిబిఐ.. లీసా అకౌంట్ నుంచి ఏ రెండు అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందో తెలుసుకున్నారు. ఫ్రఫుల్ గుప్తా, అతని తల్లి సరితా గుప్తా బ్యాంక్ అకౌంట్లకు డబ్బు చేరిందని సిబిఐ విచారణలో తేలింది. అయితే వీరిద్దరూ బినామీలు.. వారికేమీ తెలియదు. వారి బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించి కరణ్ చుగ్ అనే వ్యక్తి డబ్బులు కాజేశాడని తెలిసింది. కరణ్ చుగ్ కోసం గాలిస్తూ.. ఇటీవలే సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఆ తరువాత కరణ్ చుగ్ ని తమ విధానంలో ప్రశ్నిస్తే.. ఈ దొంగతనం అంతా తాను, లక్ష్య కలిసి చేశామని.. మైక్రోసాఫ్ట్ ఏజెంట్ గా లీసాతో కరణ్ మాట్లాడినట్లు తేలింది. అయితే ఈ డబ్బు మొత్తాన్ని క్రికెట్ ఆనె లైన్ బెట్టింగులలో పెట్టామని కరణ్ తెలిపాడు.

Also Read:  యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

ఆ తరువాత అసలు దొంగ లక్ష్య ఆచూకీ కరణ్ తెలపడంతో సిబిఐ అధికారులు దిల్ షాద్ గార్డెన్ ప్రాంతంలోని లక్ష్య ఇంటి మీద దాడి చేసి.. అతడిని అరెస్టు చేశారు. అతని ఇంట్లో నుంచి పలు లాప్ ట్యాప్ లు, మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రస్తుతం కరణ్, లక్ష్యని మనిలాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అప్పగించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×