BigTV English

Telangana Budget 24-25 live updates: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ లైవ్ అప్డేట్

Telangana Budget 24-25 live updates: తెలంగాణ అసెంబ్లీ  బడ్జెట్ లైవ్ అప్డేట్

Telangana Budget 24-25 live updates: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నా తెలంగాణ కోటిరతనాల వీణ అంటూ దాశరథి చెప్పిన కవితతో భట్టి విక్రమార్క తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ పురోభివృద్ధి అంటూ గత పాలకులు.. ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారన్నారు. వాళ్ల పాలనలో రూ.6.70 లక్షల కోట్లకు అప్పులు చేరాయని ధ్వజమెత్తారు. మధ్య మధ్యలో బీఆర్ఎస్ చేసిన తప్పులను గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు డిప్యూటీ సీఎం. బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదని.. అది మన విలువల, ఆశల వ్యక్తీకరణ కూడా అని గుర్తు చేశారు. రైతుభరోసాతోపాటు ఇతర హామీలన్నింటిని పూర్తిగా అమలు చేస్తామన్నారు. తాము ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ తమను నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షల, నమ్మకాల ప్రతిబింబమేనని వెల్లడించారు.


  • ఐటీఐల ఆధునీకరణ- రూ.300 కోట్లు
  • హోంశాఖ- రూ. 9,564 కోట్లు
  • విద్యా రంగం- రూ. 21,292 కోట్లు
  • పరిశ్రమల శాఖ – రూ. 2,762 కోట్లు
  • ఆర్ అండ్ బీ- రూ.5,790 కోట్లు
  • ఐటీ రంగం- రూ. 774 కోట్లు
  • నీటి పారుదల శాఖ-రూ. 22,301 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం – రూ. 33,124 కోట్లు
  • స్త్రీ, శిశు సంక్షేమం- రూ.2736 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం- రూ.3,003 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం- రూ. 17,056
  • అడవులు, పర్యావరణం- రూ.1,064
  • ట్రాన్స్ కో- డిస్కంలు- రూ. 16,410 కోట్లు
  • వైద్యం- ఆరోగ్యం- రూ. 11,468
  • బీసీ సంక్షేమం- రూ. 9,200 కోట్లు
  • ఔటర్ రింగ్ రోడ్డు- రూ.200 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు-రూ. 500 కోట్లు
  • పాతబస్తీ మెట్రో విస్తరణ- రూ.500 కోట్లు
  • మల్లీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్- రూ 50 కోట్లు
  • ఆర్ఆర్ఆర్- రూ. 1525 కోట్లు
  • మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు- రూ.1500 కోట్లు
  • హైదరాబాద్ సిటీ అభివృద్ధి- రూ. 10 వేల కోట్లు
  • విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ. 100 కోట్లు
  • హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన- రూ. 500 కోట్లు
  • జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన- రూ.3,065 కోట్లు
  • హైడ్రా సంస్థ – రూ. 200 కోట్లు
  • మెట్రో వాటర్ వర్స్క్- రూ.3,385 కోట్లు
  • పంచాయతీ రాజ్-గ్రామీణాభివృద్ధి- రూ.29.816 కోట్లు
  • ప్రజాపంపిణీ కోసం – రూ 3,836 కోట్లు
  • గృహజ్యోతి స్కీమ్- రూ. 2,418 కోట్లు
  • గ్యాస్ సిలిండర్ స్కీమ్- రూ. 723 కోట్లు
  • పశుసంవర్థకం- రూ. 1,980 కోట్లు
  • ఉద్యానవనం- రూ. 737 కోట్లు
  • తెలంగాణ బడ్జెట్‌ను 2,91,159 కోట్లతో ప్రవేశపెట్టారు
  • రెవిన్యూ వ్యయం – రూ. 2,20,945 కోట్లు
  • మూల ధన వ్యయం -రూ. 33,487 కోట్లు
  • వ్యవసాయం- రూ. 72,659 కోట్లు
  • రెవెన్యూ మిగులు అంచనా- రూ. 297.42 కోట్లు
  • ప్రాథమిక లోటు అంచనా రూ. 31,525 కోట్లు
  • ఆర్థిక లోటు అంచనా- రూ. 49,255.41 కోట్లు


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×