E-Paper
Advertisement

Mohammad Amir: 44 ఏళ్ల ముస‌లోడివి అయ్యావ్, ఇంకా ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గు లేదా ? ఇంత డ‌బ్బు పిచ్చి ఎందుకు

Mohammad Amir: 44 ఏళ్ల ముస‌లోడివి అయ్యావ్, ఇంకా ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గు లేదా ? ఇంత డ‌బ్బు పిచ్చి ఎందుకు
Advertisement

Mohammad Amir:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ అంటే మరో తొమ్మిది రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో 10 జట్లు ఈ టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్ల ప్లేయర్లు తమ హోమ్ సిటీలకు చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ప్రారంభ మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore ) మధ్య జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ పై ( Mahendra Singh Dhoni ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir). 44 సంవత్సరాల వయసు వచ్చిన కూడా నీకు ఎందుకు ఐపీఎల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ పై మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మీ పాకిస్తాన్ సూపర్ లీగ్ గురించి మాట్లాడుకో.. అనవసరంగా ధోని జోలికి రాకూడదని వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

44 ఏళ్ల ముస‌లోడివి అయ్యావ్, ఇంకా ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గు లేదా ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి మహమ్మద్ అమీర్ ( Mohammad Amir) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏజ్ పైబడిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఎందుకు ఆడుతున్నాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 44 సంవత్సరాలు వచ్చాయి కదా ? ఇంట్లో హాయిగా కూర్చుని టీవీ చూడొచ్చు అంటూ మహేంద్ర సింగ్ ధోనీకి చురకలు అంటించారు. 44 సంవత్సరాలు వచ్చిన గ్రౌండ్ లోకి వచ్చి క్రికెట్ ఆడడం నీకు అవసరమా అంటూ నిలదీశారు.

డబ్బుల కోసం ఇంత దిగజారుతావా ? అని షాకింగ్ కామెంట్స్ చేశారు మహమ్మద్ అమీర్. ఇకనైనా నువ్వు ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకో.. కుర్ర క్రికెటర్లకు అవకాశం ఇవ్వు అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దీంతో మహేంద్రసింగ్ ధోనీ పై మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అమీర్ చేసిన వ్యాఖ్యలకు మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 44 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు వచ్చిన మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK Team) తరఫున బరిలోకి దిగుతాడని కామెంట్స్ చేస్తున్నారు. వీల్ చైర్ పైన కూడా క్రికెట్ ఆడతాడని మహమ్మద్ అమీర్ పరువు తీస్తున్నారు ధోని అభిమానులు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

 

https://www.facebook.com/story.php?story_fbid=1831033234428501&id=100025655258612&post_id=100025655258612_1831033234428501&rdid=NZkhcDLbXbOVBW5c#

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×