E-Paper
Advertisement

AI Coding Jobs: ఇక కోడింగ్ ఉద్యోగాలకు మనుషులు అవసరం లేదు.. ఏఐ చేసేస్తుంది.. శాం ఆల్ట్‌మ్యాన్ షాకింగ్ వ్యాఖ్యలు

AI Coding Jobs: ఇక కోడింగ్ ఉద్యోగాలకు మనుషులు అవసరం లేదు.. ఏఐ చేసేస్తుంది.. శాం ఆల్ట్‌మ్యాన్ షాకింగ్ వ్యాఖ్యలు
Advertisement

AI Coding Jobs| ఓపెన్‌ఏఐ సీఈఓ శాం ఆల్ట్‌మ్యాన్ ఇటీవల చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మెసేజ్ ప్రధానంగా డెవలపర్లు, కోడింగ్ చేసే ఉద్యోగుల గురించి ఉండడంతో టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. ఆల్ట్‌మ్యాన్ వ్యాఖ్యలను చాలామంది టెక్ నిపుణులు.. ఏఐ వల్ల కోడింగ్ ఉద్యోగుల ఊడినట్టే అని అభిప్రాయపడుతున్నారు.

శాం ఆల్ట్‌మ్యాన్ ఏమన్నారు?

డెవలపర్లు ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌ నిర్మించడానికి ఎంత కష్టపడి కోడింగ్ రాశారో ఆల్ట్‌మన్ తన పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు. గతంలో కోడర్లు ఒక్కో లైన్ కోడ్‌ను రాత్రింబవళ్లు శ్రమించి రాసేవారు. దీనికి చాలా సమయం, ఓపిక, లోతైన సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యేవి. కానీ ఇప్పుడు AI టూల్స్ కేవలం నిమిషాల్లో ఆ కోడ్‌ను సులభంగా జనరేట్ చేస్తున్నాయి. బగ్స్‌ను ఫిక్స్ చేయడం, కోడ్ స్ట్రక్చర్‌ను మెరుగుపరచడం కూడా సులువుగా చేస్తున్నాయి. సాంకేతికత ఎంత వేగంగా మారుతోందో ఆయన మాటలు తెలియజేశాయి.

AI వల్ల కోడింగ్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం

Advertisement

AI టూల్స్ కోడింగ్‌ను చాలా వేగవంతం చేశాయి. చాలా రొటీన్ పనులు ఇప్పుడు తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి. దీంతో డెవలపర్లలో ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. భవిష్యత్తులో AI మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తుందేమోనని కొందరు భయపడుతున్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు మాత్రం కోడింగ్ ఉద్యోగాలు పూర్తిగా పోవని చెబుతున్నారు. కానీ ఏఐ కోడింగ్ వల్ల డెవలపర్ల పాత్ర మాత్రం మారిపోతుంది. AI టెక్నాలజీ ఒక సహాయకుడిగా ఉండొచ్చు కానీ పూర్తిగా భర్తీ చేయలేదు.

ఏఐ వచ్చినా డెవలపర్లు ఎందుకు ఇంకా అవసరం?

సంక్లిష్టమైన సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్ నిర్మించడంలో డెవలపర్ల పాత్ర కీలకం. పెద్ద ఎత్తున డీబగ్గింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ వంటి పనులకు మనిషి మెదడు అవసరం. టెక్నాలజీలో ఎథికల్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనిషి అవగాహన అవసరం. కొత్త ఐడియాలను క్రియేట్ చేయడం, సమస్యలకు విభిన్న పరిష్కారాలు కనిపెట్టడం మనిషి ప్రత్యేకత. AI ప్రధానంగా రొటీన్ పనుల్లో మాత్రమే సాయపడుతుంది. ఇది ప్రొడక్టివిటీ పెంచడానికి దోహదపడుతుంది.

Advertisement

Also Read: లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం

ఏఐ సేవలు ఉచితంగా ఇవ్వడం కుదరదు: శ్యాం ఆల్ట్‌మ్యాన్

AI సర్వీసుల ప్రైసింగ్‌ని ఓపెన్‌ఏఐ కూడా సమీక్షిస్తోంది. డిమాండ్ పెరగడంతో నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. సర్వర్లు, డేటా సెంటర్లు, మెమరీ చిప్స్ వంటివన్నీ ఖరీదైనవి. అన్‌లిమిటెడ్ యూసేజ్ ప్లాన్లను కొనసాగించడం కష్టంగా మారుతోంది. యూసేజ్ బేస్డ్ లేదా టైర్డ్ ప్రైసింగ్ మోడల్స్‌ను కంపెనీ పరిశీలిస్తోంది. అంటే ఎంత ఉపయోగిస్తే అంత డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. ఖర్చులు నిర్వహించడానికి ఇలాంటి మార్పులు అవసరమవుతాయి.

AI వల్ల కోడింగ్ పనులు వేగంగా మారిపోతున్నాయి. కానీ మనుషుల పాత్ర కొంతవరకు తగ్గినా పూర్తిగా తొలగిపోదు. డెవలపర్లు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×