E-Paper
Advertisement

Himalayan Royal Enfield: రోడ్డుపై ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ మొదలైతే… గాలి కూడా పక్కకు తప్పుకోవాలి

Himalayan Royal Enfield: రోడ్డుపై ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ మొదలైతే… గాలి కూడా  పక్కకు తప్పుకోవాలి
Advertisement

Himalayan Royal Enfield: బైక్స్‌పై ప్రాణం పెట్టే వాళ్లు ఒక్కసారి రోడ్డుపైకి వచ్చాక వాళ్లకు గాలి తాకుడే సంగీతం, ఇంజిన్ గర్జనే హృదయ స్పందనలా అనిపిస్తుంది. ప్రతి ట్రిప్‌లో కొత్త అనుభవం, ప్రతి ప్రయాణంలో ఒక కథ, ప్రతి మలుపులో ఒక ఎక్స్‌పీరియెన్స్. ఇలాంటి రైడర్స్‌కు తమ బైక్ అంటే కేవలం ప్రయాణ భాగస్వామి కాదు, అది ఓ భావోద్వేగం. అదే ఫీలింగ్‌ని ఇంకోసారి కలిగించేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ అడ్వెంచర్ తరహాలో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అడ్వెంచర్ కోరుకునే మనసులు మరింత ఉత్సాహంగా కొట్టుకునేలా రోడ్డుపై ప్రత్యేక ఉనికి ఇచ్చేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 సిరీస్‌లో కొత్త వేరియంట్‌గా మనా బ్లాక్ లాంచ్ అయింది.

రైడర్స్‌కు సింబల్ ఆఫ్ కరేజ్

Advertisement

మనా బ్లాక్ వేరియంట్ డిజైన్‌కి ఇన్‌స్పిరేషన్ మనా పాస్‌ నుంచి తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రిస్క్ మార్గాల్లో ఒకటైన ఈ పాస్, రైడర్స్‌కు సింబల్ ఆఫ్ కరేజ్. అందుకే ఈ బైక్‌కి జెట్ బ్లాక్ పెయింట్ అప్‌డేటెడ్ లుక్ ఇచ్చి గ్రే గ్రాఫిక్స్‌తో కాంట్రాస్ట్‌గా ప్రత్యేక హైలైట్ ఇచ్చారు. హిమాలయన్ 450లో స్ట్రాంగ్ అడ్వెంచర్ అపిల్ ఉన్నా, ఈ కొత్త షేడింగ్‌తో రోడ్డుపై చూసేవాళ్లకు వెంటనే ఆకర్షణ కలిగించేలా స్టెల్తీ ప్రెజెన్స్ వచ్చింది.

అద్భుతమైన సాలిడ్ లుక్

Advertisement

ఇది కేవలం పెయింట్ జాబ్ కాదు. ఇంజిన్, యూ ఎస్ డీ ఫోర్క్స్, ట్యూబ్‌లెస్ వైర్ స్పోక్ రిమ్స్ ఆల్ ఇన్ బ్లాక్ ఫినిష్. ర్యాలీ హ్యాండ్ గార్డ్స్, సీట్, టెయిల్ సెక్షన్ కూడా బ్లాక్‌లోనే డిజైన్ చేసి మొత్తం బైక్‌ని ఒక్కటైన యూనిఫార్మ్ స్టైల్‌లో తీసుకొచ్చారు. ర్యాలీ టెయిల్ సెక్షన్ వెనక నుంచి చూసినప్పుడు బైక్‌కి అద్భుతమైన సాలిడ్ లుక్ ఇవ్వడంతో పాటు విజువల్ బల్క్ కూడా తగ్గిస్తుంది.

Also Read: Amazon Black Friday Sale: అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ పై బంపర్ ఆఫర్… బ్లాక్ ఫ్రైడేలో మిస్ అవొద్దు

40 ఎన్ఎమ్ టార్క్ జనరేట్

పవర్ విషయానికి వస్తే 452సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 40 బిహెచ్‌పి పవర్, 40 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో హైవేల్లో లాంగ్ రన్ చేయాలన్నా, కఠినమైన క్లైంబింగ్ రోడ్డుల్లో క్యారెక్టర్ చూపించాలన్నా ఈ ఇంజిన్‌కు ఆ సామర్థ్యం ఉంది. రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ బెటర్ అయ్యేలా టిఎఫ్‌టి ఇన్స్‌ట్రుమెంట్ క్లస్టర్, పవర్ మోడ్‌లు, స్విచ్చబుల్ ఏబిఎస్ మొదలైన ఫీచర్లు అలాగే స్టాండర్డ్ హిమాలయన్ ప్యాకేజీగా అందుబాటులో ఉన్నాయి.

450లోనే స్ట్రాంగ్ రోడ్ గ్రిప్

బరువు 196కిలోలు, టాప్ స్పీడ్ సుమారు 165కిమీ. రెంజ్ కూడా గట్టిగానే ఇస్తుంది. అడ్వెంచర్ టూరింగ్ లవర్స్‌కు ఇది ఒక ప్రాక్టికల్ కాంబినేషన్. హిమాలయన్ 450లోనే స్ట్రాంగ్ రోడ్ గ్రిప్, కంఫర్ట్ రైడింగ్ పొజిషన్ వంటి లక్షణాలన్నీ ఉన్నప్పుడు, ఈ మోడల్ ప్రత్యేకత స్టైల్ అంశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆధునాతన ఫీల్‌తోపాటు సాలిడ్ అడ్వెంచర్ మైండ్‌ను కలిపిన ఈ బైక్, స్టెల్తీ బ్లాక్ లుక్‌ని ప్రేమించే రైడర్స్‌కి ఖచ్చితంగా ఒక స్పెషల్ ఆప్షన్.

ధర ఎంతంటే?

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మనా బ్లాక్ వేరియంట్‌కి ఇండియాలో ఎక్స్ షోరూం ధర 3.37 లక్షలు. ఈ ధరతో హిమాలయన్ 450 లైనప్‌లోనే ఇది అత్యంత ప్రీమియం ఆప్షన్‌గా నిలిచింది. అడ్వెంచర్ బైక్స్‌పై ప్రాణం పెట్టేవాళ్లకు, స్టెల్తీ లుక్‌కి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లకు, రోడ్డుపై ఓ ప్రత్యేక ఉనికి కావాలనుకునేవాళ్లకు, ఫీచర్లు & ఫినిషింగ్ విషయంలో టాప్ ఆఫ్ ద లైన్ వేరియంట్ కోసం ఎదురు చూసేవాళ్లకు ఈ ప్రైస్ సరిపోయే విలువ ఇస్తుంది. మనా పాస్ ఇన్‌స్పిరేషన్‌తో వచ్చిన ఈ బ్లాక్ థీమ్ స్పెషల్ ఎడిషన్, బైక్ అంటే భావోద్వేగం అనుకునే రైడర్స్‌కి ఒక ప్రీమియం ఐడెంటిటీగా మారేలా డిజైన్ చేశారు. కేవలం రైడ్ చేయడానికి కాదు, రైడ్‌ను ఒక ప్రౌడ్ మోమెంట్‌గా మార్చేలా ఈ మోడల్‌ను మార్కెట్లో ఉంచారు.

ప్రయాణానికి బోల్డ్ కంపానియన్‌

మొత్తంగా చెప్పాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మనా బ్లాక్, సినిమా లా కేవలం చూడటానికి కాదు, రైడ్ చేస్తుంటే రైడర్‌కు ప్రౌడ్ ఫీలింగ్, ఆత్మవిశ్వాసం, ఓ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ ఇస్తుంది. బ్లాక్ కమాండింగ్ ప్రెజెన్స్‌ని రోడ్డుపై చూపించాలనుకునే రైడర్స్‌కి ఇది ఒక అద్భుతమైన సెలెక్షన్. ఇప్పటి రైడర్స్ అడ్వెంచర్‌ అంటే కేవలం గమ్యం చేరడమే కాదు, ప్రయాణ అనుభవంలో లైఫ్ మెమరీలు సృష్టించడం. అలాంటి ప్రయాణానికి బోల్డ్ కంపానియన్‌గా నిలిచే బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మనా బ్లాక్.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×