E-Paper
Advertisement

Visakhapatnam AI Hub: దేశానికి ఏఐ హబ్‌గా విశాఖ.. లక్షల్లో ఉద్యోగాలు, ఇండియా-అమెరికా కనెక్ట్

Visakhapatnam AI Hub: దేశానికి ఏఐ హబ్‌గా విశాఖ..  లక్షల్లో ఉద్యోగాలు, ఇండియా-అమెరికా కనెక్ట్
Advertisement

Visakhapatnam AI Hub:  విశాఖలో గూగుల్ పెట్టుబడులతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారుతున్నాయా? దాదాపు లక్షలాది మంది యువతీ యువకులకు ఉద్యోగాలు రానున్నాయా? ఇండియా టు అమెరికాకు కనెక్ట్‌విటీగా మారుతోందా? దేశానికి విశాఖ ఏఐ హబ్‌గా మారబోతోందా? అవుననే అంటున్నారు టెక్ దిగ్గజాలు. తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో ఏమన్నారు?

దేశానికి ఏఐ హబ్‌గా విశాఖ.. గ్లోబల్ మ్యాప్‌లో సాగరతీరం

Advertisement

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌‌లో తాము విశాఖలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 15 బిలియన్ డాలర్లతో 1,000 మెగావాట్లతో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గిగావాట్ స్థాయిలో ఏర్పాటు అవుతుందని, అంతేకాదు ప్రపంచ స్థాయి సముద్ర కేబుల్ గేట్‌వేగా మారుతుందన్నారు.

వీటివల్ల కటింగ్ ఎడ్జ్ ఏఐ ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు, వ్యాపారవేత్తలకు వాటి సేవలు అందుతాయని తెలిపారు. దీనివల్ల వచ్చే అవకాశాలను వినియోగించుకునేందుకు నైపుణ్య శిక్షణలో పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు. ఏఐ అనేది మన జీవితకాలంలో వచ్చిన అతిపెద్ద మార్పుగా వర్ణించారు. భారత్‌ లాంటి దేశాలకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

Advertisement

లక్షల్లో ఉద్యోగాలు.. ఇండియా-అమెరికా కనెక్ట్

దీని ద్వారా ఆరోగ్యం, ఎడ్యుకేషన్, వాతావరణ వంటి రంగాల్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవడం ఈజీ అవుతుందన్నారు. దేశంలో ఏఐ ఎనేబుల్డ్‌ వాయిస్, విజువల్‌ సెర్చ్‌ను వినియోగించడం తాము గుర్తించినట్టు తెలిపారు. అంతేకాదు అమెరికా-భారత్‌ మధ్య ఏఐ కనెక్టివిటీ కొత్త సబ్‌సీ కేబుల్‌ ఏర్పాటుతో మెరుగవుతుందన్నారు. గతేడాదిలో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది గూగుల్ సంస్థ.

పేరుకే డేటా సెంటర్ అయినా దీనివల్ల ప్రయోజనాలు దేశవ్యాప్తంగా అందనున్నాయి.  అది పూర్తయితే భారత్‌లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ​దీనికి కొనసాగింపుగా ఇండియా-అమెరికా కనెక్ట్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఆ సంస్థ. సముద్రం అడుగున కొత్త కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల అమెరికా టు భారత్, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మధ్య ఇంటర్నెట్, AI కనెక్షన్‌ను మరింత వేగవంతం చేయనుంది.

ALSO READ: ఒడియమ్మ బంటి.. బంగారం మళ్లీ కొండెక్కి కూర్చుందిరోయ్!

AI అప్లికేషన్లు వేగంగా పని చేయాలంటే భారీ స్థాయిలో డేటా ట్రాన్స్‌ఫర్ జరగాలి. కొత్త కేబుల్స్ ద్వారా డేటా ప్రయాణించే వేగం, సామర్థ్యం పెరుగుతుంది. ​
ప్రస్తుతం భారత్ ఎక్కువగా సింగపూర్, యూరప్ మీదుగా వచ్చే ఇంటర్నెట్ కేబుల్స్‌పై ఆధారపడుతోంది. ఇండియా టు అమెరికా కనెక్ట్ వల్ల మధ్యలో అంతరాయాలు లేకుండా నేరుగా కనెక్షన్ రానుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం పెరగడమే కాకుండా, ఖర్చు సైతం తగ్గనుంది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ఆఫ్రికా, యూరప్‌లోని మరిన్ని దేశాలను కలుపుతూ కేబుల్ రానుంది. దీనివల్ల వైజాగ్ అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా మారబోతోంది.

 

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×