E-Paper
Advertisement

Samsung Galaxy A35 Price Drop: బడ్జెట్ యూజర్లకు జాక్‌పాట్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లుచెదిరే డిస్కౌంట్!

Samsung Galaxy A35 Price Drop: బడ్జెట్ యూజర్లకు జాక్‌పాట్.. శాంసంగ్ గెలాక్సీ A35పై కళ్లుచెదిరే డిస్కౌంట్!
Advertisement

Samsung Galaxy A35 Price Drop: తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి శాంసంగ్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గడం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లాంచ్ సమయంలో రూ.33,999 ఉన్న ఈ ఫోన్.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.19,999కే అందుబాటులో ఉంది.

అంటే.. దాదాపు ఈ ఫోన్‌పై రూ.14 వేల వరకు ధర తగ్గడం విశేషం. దీనికి తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా తోడైతే మరో రూ.1000 అదనపు తగ్గింపుతో రూ.18,999కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే వారికి కూడా ఇదే మంచి సమయం. ఎందుకంటే.. ఎక్స్ఛేంజ్ ద్వారా ధరను ఇంకాస్త తగ్గించుకునే వీలుంది.

శాంసంగ్ గెలాక్సీ A35 స్పెసిఫికేషన్స్:

Advertisement

ఫీచర్ల పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల భారీ FHD+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1900 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వడం గమనార్హం. పెర్ఫార్మెన్స్ కోసం క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీటాస్కింగ్‌కు చక్కగా సరిపోతుంది.

Also Read: డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో ఐకూ నియో 11.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది భయ్యా!

50 మెగాపిక్సల్ కెమెరా సెటప్:

Advertisement

ఇక శాంసంగ్ గెలాక్సీ A35 కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ సెటప్ ఉంది. ఇది తక్కువ వెలుతురులో కూడా మంచి ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. అలాగే సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

బెస్ట్ బడ్జెట్ డీల్:

ఈ ఫోన్ కొంటే మరో ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయని కంపెనీ హామీ ఇస్తోంది. 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు యూజర్లకు మంచి బ్యాకప్ ఇస్తాయి. ఒకేసారి డబ్బు చెల్లించలేని వారు నెలకు సుమారు రూ.3,334 ఈజీ EMI పద్ధతిలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే వారికి గెలాక్సీ A35 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్లలో ఒకటి.

Also Read: వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ గేమింగ్ ఫోన్.. 165Hz డిస్‌ప్లేతో అరాచకంరా అయ్యా!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×