E-Paper
Advertisement

Romantic Comedy OTT : ఇది కదా భయ్యా లవ్ స్టోరీ అంటే… అలా చూస్తూ ఉండిపోయే అద్భుతమైన కే డ్రామా

Romantic Comedy OTT : ఇది కదా భయ్యా లవ్ స్టోరీ అంటే… అలా చూస్తూ ఉండిపోయే అద్భుతమైన కే డ్రామా
Advertisement

Romantic Cmedy OTT : ఓటీటీలోకి ఎన్నో సిరీస్ లు సినిమాలు వస్తున్నాయి. అయితే కొరియన్ సిరీస్ లు మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇక ఈ సిరీస్ లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే కొరియన్ డ్రామాలను ఇష్టపడేవాళ్ళు, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను ఖచ్చితంగా చూడాల్సిందే. సిరీస్ అంత బాగా ఉంటుంది. ఈ కథలో హైస్కూల్‌లో ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు పెద్దయ్యాక డాక్టర్లు అవుతారు. చివరికి వాళ్ళే కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ మెడికల్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘డాక్టర్ స్లంప్’ (Doctor Slump). 2024లో ఈ సిరీస్ లో పార్క్ హ్యుంగ్-సిక్, పార్క్ షిన్-హై ప్రధాన పాత్రల్లో నటించారు. 16 ఎపిసోడ్ల ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ఇండియా సహా చాలా దేశాల్లో టాప్ 10 లిస్టులో నిలిచింది. ఐయండిబిలో దీనికి 7.5 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

స్కూల్ రోజుల్లో హీరో (జెంగ్-వూ), హీరోయిన్ (హా-నెల్) ఇద్దరూ తోపు స్టూడెంట్స్. క్లాస్‌లో ఫస్ట్ ఎవరు రావాలి అనే విషయంలో ఇద్దరికీ అస్సలు పడేది కాదు, ఒకరినొకరు శత్రువుల్లా చూసుకునేవారు. కట్ చేస్తే, ఇద్దరూ పెద్దయ్యాక డాక్టర్లు అవుతారు. హీరో ప్లాస్టిక్ సర్జన్ అయి కోట్లు సంపాదిస్తుంటే, హీరోయిన్ ఏమో రాత్రి పగలు అనక ఆస్పత్రిలో గొడ్డు చాకిరి చేస్తూ యమ బిజీగా ఉంటుంది. అయితే సీన్ రివర్స్ అయి ఇద్దరి లైఫ్ ఒకేసారి దెబ్బతింటుంది. ఒక పేషెంట్ చనిపోవడంతో హీరో మీద కేసు పడి రోడ్డున పడతాడు. హీరోయిన్ ఏమో తన బాస్ వేధింపులు తట్టుకోలేక, డిప్రెషన్‌లోకి వెళ్లి ఉద్యోగం మానేస్తుంది.

అలా లైఫ్ మరీ దారుణంగా ఉన్న టైంలో, విధి ఆ ఇద్దరు పాత శత్రువులను మళ్ళీ ఒకేచోట కలిసేలా చేస్తుంది. అది కూడా హీరో వచ్చి హీరోయిన్ ఇంటి పైన ఉన్న గదిలో అద్దెకు దిగడంతో రచ్చ మొదలవుతుంది. మొదట్లో తిట్టుకున్నా, మెల్లగా ఒకరి కష్టం ఒకరికి అర్థమవుతుంది. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మళ్ళీ లైఫ్‌ని సెట్ చేసుకుంటారు. చివరికి హీరో మీద పడ్డ ఆ కేసుని ఎలా గెలిచాడు ? హీరోయిన్ తన డిప్రెషన్ నుండి ఎలా బయటపడింది ? వీళ్ళ ప్రేమ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ కే డ్రామాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  రైలు పట్టాలు ఎక్కే మృత్యువు… హైజాకర్ల హైటెక్ విధ్వంసం… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సిరీస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×