E-Paper
Advertisement

Mumbai Indians: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రోహిత్..బౌలింగ్, బ్యాటింగ్ లో ముంబైకి ఇక తిరుగులేదు, ఈ సారి టైటిల్ ప‌క్కా

Mumbai Indians: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రోహిత్..బౌలింగ్, బ్యాటింగ్ లో ముంబైకి ఇక తిరుగులేదు, ఈ సారి టైటిల్ ప‌క్కా
Advertisement

Mumbai Indians:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో 6 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. దాదాపు రెండు రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపిఎల్ టోర్నమెంట్లో పాల్గొనే పది జట్లు కూడా టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈసారి ఎలాగైనా ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు క్రీడాభిమానులు. అన్ని జట్ల కంటే ముంబై ఇండియన్స్, చాలా బలంగా ఉందని వెల్లడిస్తున్నారు.

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లోనే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతుంది. అయితే రోహిత్ శర్మకు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాత్రమే ఇవ్వబోతున్నారు. దాదాపు 20 కేజీలు తగ్గిన రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకునేందుకు ముంబై ఇండియన్స్ నిర్ణయం తీసుకుందట. అటు దాదాపు ఏడాదికాలంగా హార్దిక్ పాండ్యా భయంకరమైన ఫామ్ లో ఉన్నాడు. బ్యాటింగ్ అదే సమయంలో బౌలింగ్లో ఇరగదీస్తున్నాడు. కాబట్టి కెప్టెన్ పరంగా హార్దిక్ పాండ్యా తన డ్యూటీ నిర్వహిస్తాడు. ఇది ముంబై ఇండియన్స్ కు చాలా ప్లేస్ అవుతుంది.

ఇప్పటికే T20 వరల్డ్ కప్ తీసుకువచ్చిన ఊపులో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. 360 ప్లేయర్ గా పేరుగాంచిన సూర్య కుమార్ యాదవ్, ఈసారి అదరగొట్టే ఛాన్స్ ఉంది. అటు తిలక్ వర్మ కూడా తెలుగు కుర్రాడిగా ముంబై ఇండియన్స్ లో రాణిస్తాడు. ఓపెనర్ తప్ప మిగిలిన ఎక్కడైనా ఆడెందుకు తిలక్ వర్మ ఏ మాత్రం వెనకాడడు. 300 స్ట్రైక్ రేటు తో కూడా రెచ్చిపోగలుగుతాడు తిలక్ వర్మ. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఇది రుజువు అయింది. ఇక రెండు కోట్లకే కొనుగోలు చేసిన సౌత్ ఆఫ్రికా డేంజర్ ఆటగాడు డికాక్, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. ఇది ముంబై ఇండియన్స్ కు మరింత ప్లస్ అవుతుంది.

బౌలింగ్ బుమ్రా ఇర‌గ‌దీస్తాడు

Advertisement

లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ లో ఇద్దరు ఇరగదీస్తారు. మిడిల్ ఆర్డర్ లో విల్ జాక్స్ కచ్చితంగా బరిలోకి దిగుతాడు. టి20 ప్రపంచ కప్ టోర్నమెంటులో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లు అందుకున్న ప్లేయర్ గా కూడా ఇతనికి రికార్డు ఉంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అదరగొట్టుతాడు. ఒకవేళ ఇతడు కాకపోతే రూతర్ ఫోర్డ్ తన సత్తా చాటుతాడు. ఇక ఫినిషర్ గా నమందిర్ ఎలాగూ ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ పాత్ర పోషించబోతున్నాడు. దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, బుమ్రా బౌలింగ్ లో ఇరగదీసే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఈసారి టైటిల్ గెలవడం గ్యారెంటీ అంటున్నారు. అటు అంపైర్లను మేనేజ్ చేయడంలో కూడా ముంబై ఇండియన్స్ దిట్ట అన్న సంగతి తెలిసిందే.

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

 

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×