E-Paper
Advertisement

Amazon vs Flipkart offer: రూ.19వేలలోపే శామ్‌సంగ్ ఎఫ్55 5జి ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ Vs అమెజాన్ ఎక్కడ కొంటే లాభం

Amazon vs Flipkart offer: రూ.19వేలలోపే శామ్‌సంగ్ ఎఫ్55 5జి ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ Vs అమెజాన్  ఎక్కడ కొంటే లాభం

Amazon vs Flipkart offer: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అద్భుతమైన సమయం నడుస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ అలాగే అమెజాన్ లో నడుస్తున్న ఆఫర్లు చూసుకుంటే, సాధారణంగా ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా శామ్‌సంగ్ లాంటి బ్రాండ్ ఫోన్ లపై ఈ రెండు ప్లాట్‌ఫార్మ్స్ పోటీగా డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల ధరల్లో మంచి తేడా కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, లిమిటెడ్ టైమ్ డీల్స్ కలిపి చూస్తే, ఆఫ్‌లైన్ ధరలతో పోలిస్తే ఆన్‌లైన్ లోనే ఎక్కువ లాభం ఉంటుంది. అలాంటి ఆఫర్ల మధ్య ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న ఫోన్ ఏంటంటే శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ. ఇప్పుడు ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు, అలాగే ఇది ఎందుకు ఈ రేంజ్‌లో మంచి ఆప్షన్ అవుతుందో డీటెయిల్‌గా చూద్దాం.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 55 జీ పై ఆఫర్లు

ఇండియాలో ఈ ఫోన్ ధర మొదటగా కనిపిస్తున్నది రుపాయలు 18,984. అమెజాన్‌లో అప్రికాట్ క్రష్ కలర్ కి ఈ ధర కనిపిస్తోంది. అదే వేరే కలర్ అయిన రైసిన్ బ్లాక్ కి అమెజాన్ లోనే రుపాయలు 19,800 దగ్గర ఉంది. ఫ్లిప్‌కార్ట్ విషయానికి వస్తే, అదే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కి రుపాయలు 20,999 గా లిస్ట్ చేశారు. అంటే ప్లాట్‌ఫామ్ మారితే ధరలో సుమారు 2వేల రుపాయల వరకు తేడా కనిపిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్లు, స్టాక్, టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది.

అమెజాన్ లో ఎందుకు తక్కువ ధర కనిపిస్తోంది

అమెజాన్ లో ఈ ఫోన్‌కి ప్రైమ్ డీల్ ట్యాగ్ తో పాటు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు యాక్టివ్ గా ఉన్నాయి. అందుకే రుపాయలు 18,984 లాంటి తక్కువ ధర కనిపిస్తోంది. కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఒకేసారి మొత్తం అమౌంట్ చెల్లించలేని వాళ్లకు కూడా ఇది సులభంగా మారుతుంది.

ఫ్లిప్‌కార్ట్ లో ధర ఎక్కువగా ఎందుకు ఉంది

ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్‌కి పెద్ద డిస్కౌంట్ కన్నా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. పాత ఫోన్ ఇస్తే, కండిషన్ బట్టి అదనంగా రుపాయలు 2,000 లేదా 3,000 వరకు తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అందుకే లిస్ట్ చేసిన ధర రుపాయలు 20,999 గా కనిపించినా, ఫైనల్ బిల్ లో అది తగ్గే అవకాశం ఉంది.

Also Read: Meesho New Year Offers: ఇది కదా అసలైన లూట్.. మీషో న్యూయర్ సేల్‌లో సగం ధరలకే బ్రాండెడ్ లుక్ ప్రొడక్ట్స్

ఈ ధర రేంజ్‌లో ఈ ఫోన్ ఎందుకు హైలైట్ అవుతోంది

రుపాయలు 20,000 లోపు లేదా దాని చుట్టుపక్కల చూస్తే, ఈ ఫోన్‌కి ప్రీమియం లుక్ పెద్ద ప్లస్ పాయింట్. లెదర్ ఫినిష్ బ్యాక్ డిజైన్ వల్ల ఇది చేతిలో పట్టుకుంటే ఖరీదైన ఫీల్ ఇస్తుంది. సామ్‌సంగ్ బ్రాండ్ కావడం వల్ల బిల్డ్ క్వాలిటీ మీద కూడా నమ్మకం ఉంటుంది.

కెమెరాలో ఈ ధరకి ఏది బెస్ట్

ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. డే లైట్ ఫోటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. సోషల్ మీడియా కోసం ఫోటోలు, రీల్స్ తీసుకునే వాళ్లకు ఇది సరిపోతుంది. ఫ్రంట్ కెమెరా కూడా వీడియో కాల్స్, సెల్ఫీస్‌కి బాగానే పని చేస్తుంది. ఈ ధరలో కెమెరా పర్‌ఫార్మెన్స్ అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ అనుభవం

ఈ ఫోన్‌లో 5,000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఉంది. ఒక రోజు మొత్తం నార్మల్ యూజ్ కి ఈ బ్యాటరీ తగినంతగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం వల్ల కొద్ది సమయంలోనే బ్యాటరీ మళ్లీ ఫుల్ అవుతుంది. రోజంతా బయట ఉండే వాళ్లకు ఇది ఉపయోగపడే విషయం.

పర్‌ఫార్మెన్స్ ఈ ధరకి ఎలా ఉంది

డైలీ యూజ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ లాంటి పనులకు ఈ ఫోన్ ఎలాంటి ఇబ్బంది పెట్టదు. శామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ వల్ల యూజ్ చేస్తే స్మూత్ గా అనిపిస్తుంది. హెవీ గేమింగ్ కోసం కాకపోయినా, నార్మల్ యూజర్లకు మాత్రం ఇది సేఫ్ ఛాయిస్.

కొనాలి అనుకుంటే ఎక్కడ బెస్ట్

ఇప్పటి ధరలు చూస్తే, కేవలం డైరెక్ట్ ప్రైస్ పరంగా చూస్తే అమెజాన్ లో రుపాయలు 18,984 చాలా ఆకర్షణీయంగా ఉంది. కానీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ కూడా మంచి డీల్ ఇవ్వొచ్చు. కాబట్టి కొనేముందు రెండు ప్లాట్‌ఫార్మ్స్ లో ఒకే రోజు చెక్ చేసి, ఆ టైమ్ లో ఏది తక్కువగా ఉంటే అక్కడే కొనడం బెస్ట్ నిర్ణయం అవుతుంది. ఈ ధర రేంజ్‌లో స్టైల్, బ్రాండ్ విలువ, బ్యాలెన్స్ ఫీచర్లు కావాలంటే, శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్55జీ ప్రస్తుతం మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.

 

Related News

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

Big Stories

×