E-Paper
Advertisement

TDP MLA on KCR: కేసీఆర్-కేటీఆర్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఫామ్‌హౌస్‌లో ఏ బ్రాండ్ తాగొచ్చారో..

TDP MLA on KCR: కేసీఆర్-కేటీఆర్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్.. ఫామ్‌హౌస్‌లో ఏ బ్రాండ్ తాగొచ్చారో..
Advertisement

TDP MLA on KCR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మెల్లగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.

కేసీఆర్-కేటీఆర్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్

Advertisement

దాదాపు రెండేళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. తన ప్లాన్ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోదీ సర్కార్, ఏపీ సీఎం చంద్రబాబుపై రుసరుసలాడారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల గురించి వివరించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ లైటుగా తీసుకున్నట్లు కనిపించింది. గడిచిన నాలుగురోజులు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు నేతలు మాత్రమే స్పందించారు. అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు.

తాజాగా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో కేసీఆర్-కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ఫామ్‌హౌస్‌లో ఏ బ్రాండ్ మందు తాగి బయటికి వచ్చారో తెలియదన్నారు. రెండేళ్లుగా ప్రజలకు మొహం చూపించుకోలేక ఫామ్‌హౌస్‌లో నిద్రపోయారని అన్నారు. తనకు తాను దేశ్‌కి నేతగా భావించుకుంటారని ఆరోపించారు.

Advertisement

ఫామ్ హౌస్‌లో ఏ బ్రాండ్ పుచ్చుకున్నారో అంటూ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా సర్పంచ్‌లు ఓడిపోవడంతో ఆయనకు మతి భ్రమించినట్లు ఉందన్నారు. కేటీఆర్ లాంటి అసమర్థత వ్యక్తిని నమ్ముకుంటే ఆ పార్టీ మునిగిపోతుంది భావించి బయటికొచ్చి కేసీఆర్ మాట్లాడినట్టు కనిపించిందన్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే టీడీపీ నుంచి ఈ స్థాయిలో కౌంటర్ రావడం ఇదే తొలిసారి. అయితే గడిచిన నాలుగైదు రోజులు ఏం జరిగింది? ఉన్నట్లుండి టీడీపీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో స్పందించడంపై ఆ పార్టీలు నేతలు తలో విధంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు రాకుండా ఎమ్మెల్యే రాజు ఈ స్థాయిలో మాట్లాడరని అంటున్నారు.

ALSO READ: తెలంగాణలో యూరియా కష్టాలకు చెక్.. ఇంటి నుంచే బుకింగ్

టీడీపీలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు ఎమ్మెల్యే  ఎంఎస్ రాజు.  ఆయన్ని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించింది. ఇటీవల సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగించింది.  కేవలం తన నియోజకవర్గం మాత్రమే కాకుండా సమయం, సందర్భం వచ్చినప్పుడు కొన్ని అంశాలపై ఆయన నోరు విప్పుతున్నారు. ఇటీవల ఓ విషయంలో నోరు జారి ఇరుకుపడ్డారు కూడా. బీజేపీ నేతల నుంచి కౌంటర్ రావడంతో సైలెంట్ అయ్యారు. మరి కేసీఆర్ విషయంలో ఆయన తనకు తానుగా రియాక్ట్ అయ్యారా? పైనుంచి ఆదేశాలు వచ్చాయా? అనేది తెలియాల్సివుంది.

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×